చనుబండ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చనుబండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చాట్రాయి
ప్రభుత్వము
 - సర్పంచి మోరంపూడి అనసూయ
జనాభా (2011)
 - మొత్తం 8,907
 - పురుషుల సంఖ్య 4,459
 - స్త్రీల సంఖ్య 4,448
 - గృహాల సంఖ్య 2,503
పిన్ కోడ్ 521 214
ఎస్.టి.డి కోడ్ 08598

చనుబండ, కృష్ణా జిల్లా, చాట్రాయి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 214., ఎస్.టి.డి.కోడ్ = 08673.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళిక స్థితి[మార్చు]

[1] సముద్రమట్టానికి 28 మీ.ఎత్తు

 • గ్రామం ప్రధాన కూడలి నాలుగు దిక్కులా నాలుగు దారులతొ వుంది. ఒకటి విజయవాడకు, ఒకటి సత్తుపల్లికి, ఒకటి తిరువూరుకి, వేరొకటి చింతలపూడికి దారితీస్తాయి.
 • చనుబండ, భౌగోళికంగా 17°04′ఉత్తర 80°81′తూర్పు అక్షాంశరేఖాంశాలలో ఉన్న చాట్రాయి మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం. గ్రామానికి 100 సంవత్సరాలు పైబడిన చరిత్ర వుంది.
 • చనుబండ గ్రామం, కృష్ణా జిల్లా సరిహద్దులో కృష్ణా మరియు ఖమ్మం జిల్లాల మద్యలో వుంది.
 • గ్రామానికి తూర్పున నరసింహరావు పాలెం, ఉత్తరాన సూరంపాలెం, పడమటీన కొర్లమండ, దక్షిణాన క్రిషణారావు పాలెం ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో బూరుగుగూడెం, చాట్రాయి, నరసాపురం, జానలగడ్డ, చిన్నంపేట గ్రామాలు ఉన్నాయి.

సమీప మoడలాలు[మార్చు]

విస్సన్నపేట, లింగపాలెం, చింతలపాడు, సత్తుపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మర్లపాడు, రాఘవాపురం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 68 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
 2. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల కొందరు పెద్దల చొరవతో శ్రీ కొత్తగుండ్ల విశ్వనాథం భూమి విరాళంతో 1964 లో గ్రామంలో తొలిసారిగా ఏర్పాటు చేయబడింది.
 3. గ్రామంలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

తపాలా కార్యాలయం[మార్చు]

మండలానికి చెందిన ప్రధాన తపాలా కార్యాలయం ఇక్కడనే వుంది.

బ్యాంకులు[మార్చు]

ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08673/255226.

గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో అన్ని ప్రధాన మతాల వారికి చెందిన మందిరాలు ఉన్నాయి.

 1. శ్రీ కోదండ రామాలయం:- భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూడలేనివారు, ఈ ఆలయంలో చూసినయెడల, అదే పుణ్యం లభించునని నానుడి. అందువలన ఈ ఆలయానికి, "అపర భద్రాద్రి" అని పేరు. గ్రామంలోని ఈ దేవాలయనికి 400 సంవత్సరాల చరిత్ర వుంది. ఇపుడు వున్న ఆలయం 1627లో నిర్మించగా, ఆలయ గోపురాన్ని భద్రాచలం ఆలయ గోపురం మాదిరిగా నిర్మించారు. భద్రాచలం వలెనే ఏటా ఇక్కడి రామాలయంలో కూడా స్వామి వారి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. శ్రీరామ నవమి సందర్భంగా ఇక్కడ తిరునాళ్ళు, కబడ్డి పొటీలు కూడా జరుగుతాయి. [3]
 2. ‍సత్యనారాయణస్వామి దేవాలయం.
 3. మసీదు.
 4. చర్చి.
 5. పెంతుకొస్తు చర్చి.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మామిడి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. చుట్టుపక్కల గ్రామాలకి ఇది ప్రధాన వాణిజ్య కూడలిగా వుంది.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. దీనికి కావలసిన నీటి వనరులు ప్రధానంగా గ్రామంలో కల మూడు చెరువల ద్వారా లభ్యమవుతాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

విస్సన్నపేట మండలం కొర్లమండ గ్రామానికి చెందిన శ్రీ దొబ్బిగడ్ల సత్యనారాయణ, చనుబండ గ్రామంలో 80 సెంట్ల భూమిని కౌలుకు తీసికొని, ఈ సంవత్సరం ఖరీఫ్ లో "బాస్మతి" వరి సాగు చేపట్టినారు. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి తలెత్తినా గానీ, పైరు ఏపుగా పెరిగి, దిగుబడులపై నమ్మకాన్ని పెంచింది. మెట్ట ప్రాంతంలో ఈ వరి, సాగుకు అనుకూలం కాదని పలువురు చెప్పినా, ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు ఈ రైతు చెబుచున్నారు. ప్రస్తుతం ఈ పంట ఒక వారం రోజులలో కోతకు వచ్చేటట్లున్నది. [2]

ఈ గ్రామానికి చెందిన శ్రీ కొక్కెరపాటి రాజారావు కుమారుడు శ్రీ ఫణివిక్రమకుమార్, ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. అనంతరం ఐ.ఐ.ఎం.కలకత్తాలో విద్యనభ్యసించారు. ఈయన గత సంవత్సరం, ఈయన ఐ.ఐ.ఎం. విద్యార్థిగా ఉన్నప్పుడు "ది స్టోరీ ఆఫ్ ఇండియన్ బ్రాండ్ కమర్షియల్ ఓవర్ డికేడ్స్" అను ఒక పుస్తకం సమర్పించారు. ఈ పుస్తకంలోని అంశాలను గుర్తించి, వీరికి ఐ.ఐ.ఎం.కలకత్తాలో ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొనుటకు అవకాశం లభించింది. 2015, నవంబరు-14,15 తేదీలలో, ఐ.ఐ.ఎం.ఎస్. కలకత్తాలో, "గ్లోబల్ ఎలయన్స్ ఫర్ మేనేజ్ మెంట్ యూరోపియన్ స్కూల్" అధ్వర్యంలో ఒక సదస్సు నిర్వహించుచున్నారు. ఈ సెమినార్ లో శ్రీ ఫణివిక్రమరావు, "నేటీ వ్యాపారరంగంలో బ్రాండ్ పరిణామాలు" ఆవశ్యకతపై మాట్లాడనున్నారు. [4]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 8,907 - పురుషుల సంఖ్య 4,459 - స్త్రీల సంఖ్య 4,448 - గృహాల సంఖ్య 2,503

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8902.[2] ఇందులో పురుషుల సంఖ్య 4514, స్త్రీల సంఖ్య 4388, గ్రామంలో నివాసగృహాలు 2154 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3445 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో బూరుగుగూడెం, చాట్రాయి, నరసాపురం, జానలగడ్డ, చిన్నంపేట గ్రామాలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Chatrai/Chanubanda". Retrieved 21 June 2016.  External link in |title= (help)
 2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2014, నవంబరు-8; 9వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, మార్చ్-27; 6వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-11; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చనుబండ&oldid=2070766" నుండి వెలికితీశారు