చల్లా సత్యవాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చల్లా సత్యవాణి తెలుగు రచయిత్రి. ఆమె కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాల అధ్యాపకురాలిగా, ఎన్.సి.సి మేడంగా సేవలిందించి, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.ఆధ్యాత్మికంగా తాను అనుభూతి పొందుతూ, పదిమందికీ ఆ అనుభూతిని అందించడానికి, పుస్తక రూపంకల్పించి, ఆధ్యాత్మికసంపద వితరణచేస్తున్నారు.

పరిచయం[మార్చు]

కౌండిన్యస గోత్రికులు శ్రీమతి చల్లా అచ్యుత రామలక్ష్మి, శ్రీ వీరావధానులు పుణ్యదంపతులకు 1942 ఏప్రిల్ 4 న అంటే చిత్రభాను సంవత్సర చైత్ర బహుళ తదియ శనివారం రాజోలు తాలూకా మలికిపురం మండలం మోరి గ్రామంలో డాక్టర్ చల్లా సత్యవాణి జన్మించారు. 1942మే నెలనుంచి ఈమె రాజమండ్రి దానవాయిపేట ఇంటినెంబర్ 46-18-11లోనే నివసిస్తున్నారు. ఈ ఇంటిపేరే ప్రణవకుటి.డాక్టర్ (మేజర్) సత్యవాణి ఎం.ఏ (హిందీ) సాహిత్యరత్న, ఎం.ఏ (రాజనీతి శాస్త్రం, ఎం.ఏ (ఫిలాసఫీ, ఎం.ఇడి, ఎం.ఫిల్, పిహెచ్.డి.పూర్తిచేశారు. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన ఈమె ఎన్.సి.సి ఆఫీసరుగా, ఎన్ఎ.స్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా సేవలందించారు.ఎంతోమంది విద్యార్థినులకు స్ఫూర్తినిచ్చారు. పదవీ విరమణచేసాక, రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి, కళాశాల అభివృద్ధికి బాటలువేశారు. ప్రస్తుతం డైరక్టర్ గా కొనసాగుతున్నారు.

ఆధ్యాత్మిక సంపదను పంచుతూ[మార్చు]

పుస్తకం వేయడమే చాలా కష్టం. అలాంటిది అంత్యంత నాణ్యతతో, అరుదైన ఫోటోలు సేకరించి మరీ, పుస్తకాలమీద పుస్తకాలు వేయడం ఆషామాషీ కాదు. పైగా ఎవరి సాయం లేకుండా తన సొంత ధనం వెచ్చించి, ఆధ్యాత్మిక సంపదగా మలచి, పదుగురికే పంచడం ఆమెకే చెల్లింది. ఈవిధంగా తాను పొందుతున్న పుణ్యాన్ని పదిమందికీ పంచుతున్నారని ప్రశంసించని వారు లేరు.గడిచిన 16 ఏళ్లుగా ఈ యజ్ఞం కొనసాగిస్తున్నారు.దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి అక్కడ ఆలయాలను దర్శించి, వాటి విశిష్టత అవగతం చేసుకుంటారు. ఇక అక్కడకు ఎలావెళ్ళాలి వంటి విషయాలంటిని పొందుపరుస్తూ, వ్యాసాలను పత్రికలకు అందించడమేకాదు, మళ్ళీ వాటన్నింటినీ క్రోడీకరించి, పుస్తక రూపంతెచ్చి, ఉచితంగా పంచిపెట్టడం ఈమె సహజ లక్షణం. ఈవిధంగా ఇప్పటివరకూ ఈమె 25పుస్తకాలు అందుబాటులోకి తెచ్చారు.

డాక్టర్ ఏ.బీ.పై పరిశోధనకు ఎం.ఫిల్[మార్చు]

నిష్కళంక దేశభక్తుడు, నిస్వార్ధ నాయకుడు, మాజీమంత్రి డాక్టర్ఎ.బి నాగేశ్వరరావు-రాజకీయ జీవితంపై డాక్టర్ సత్యవాణి పరిశోధనచేసి ఎం.ఫిల్ సాధించారు.

విజయలక్ష్మి పండిట్ పై పరిశోధనకు డాక్టరేట్[మార్చు]

శ్రీమతి విజయలక్ష్మి పండిట్-రాజకీయ జీవనంపై పరిశోధనకు డాక్టరేట్ పొందారు.

రఘుపతి వెంకయ్య స్వర్ణ పతక పురస్కారం[మార్చు]

2006లో ఆంధ్రా యూనివర్సిటీనుంచి'సర్ రఘుపతి వెంకట రత్నంనాయుడు 'స్వర్ణ పతక పురస్కారం అందుకున్న డాక్టర్ సత్యవాణి, మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితినుంచి అన్నపూర్ణయ్య పురస్కారం పొందారు. ఇంకా ఎన్నో సత్కారాలు అందుకున్నారు.జూనియర్ చాంబర్ ఇంటర్ నేషనల్ (జె.సి.ఐ) ప్రతిఆధ్వర్యాన యేటా వారోత్సవాలలో ఇచ్చే పురస్కారంలో భాగంగా 2016 సెప్టెంబరు 18వతేదీ సాయంత్రం రాజమహేంద్రవరం జాపేట శ్రీ ఉమా రామలింగేశ్వర కల్యాణ మంటపంలో నిర్వహించిన జెసిఐ గ్రేట్ డేలో సమాచారమ్ దినపత్రిక దివంగత సంపాదకులు శ్రీ గంధం నాగ సుబ్రహ్మణ్యం స్మారక జెసిఐ అవార్డుని డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణికి అందజేశారు. ఇక ఈమె రంచించే ప్రతి పుస్తకంలోకూడా శ్రీ సుబ్రహ్మణ్యంగార్ని తలుచుకోవడం, ఫోటో ముద్రించడం చేస్తూనే ఉండడం విశేషం. అవార్డు స్వీకారం రోజున శ్రీ సుబ్రహ్మణ్యంపై ఈమె ఓ చిన్న బుక్ లెట్ కూడా వేసి, పంచిపెట్టారు.

ముద్రిత గ్రంధాలు[మార్చు]

డాక్టర్ (మేజర్) సత్యవాణి రచించిన గ్రంథాల్లో దాదాపు అన్ని ముద్రితమయ్యాయి. తాజాగా శ్రీ యాతగిరి శ్రీరామ నరసింహారావు అశీతి (80 ఏళ్ళ పండుగ) సందర్భంగా ఆయన నివాసం దగ్గర ఉన్న ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్థల చరిత్రపై పుస్తకాన్ని ముద్రించారు. శ్రీ యాతగిరికి అంకితం ఇచ్చిన ఈ పుస్తకాన్ని 2016 సెప్టెంబరు 28న మాజీ ఎం ఎల్ ఏ శ్రీ రౌతు సూర్యప్రకాశరావు ఆవిష్కరించారు.

  1. సత్యవ్యాస కదంబం ప్రథమ భాగం (30.4.2000).
  2. డాక్టర్ ఎ.బి నాగేశ్వరరావు-ఏ పొలిటికల్ స్టడీ (1.11.2001).
  3. ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్ర దర్శిని (4.3.2003).
  4. మా ఊరి గుళ్ళు-తరలివచ్చిన దేవుళ్ళు (2003).
  5. (గోదావరి పుష్కర దర్శిని, ఆగలింగ క్షేత్రత్రదర్శిని (ఫిబ్రవరి2004)
  6. నవజనార్ధన క్షేత్రదర్శిని (ఆగస్టు2004).
  7. ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ తొలిభాగం (4.3.2005).
  8. పంచారామ క్షేత్రదర్శిని (మార్చి05).
  9. 20సత్యవ్యాస కదంబం రెండవభాగం (ఏప్రియల్2006).
  10. ద్వాదశ నారసింహ క్షేత్రదర్శిని (23.8.2008).
  11. రాజమహేంద్రిలో ఒకనాటి నాయకత్రయం (1.11.2008).
  12. పంచాయతన దేవాలయములు-తూర్పు గోదావరి జిల్లా (3.11..2008).
  13. శ్రీ పర్వతవర్ధినీ ఉమారామలింగేశ్వర పంచాయతన ఆలయం-శ్రీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల క్షేత్రమహ్యత్యం (11.11.2008).
  14. ఎన్.సి.సి-ఏ సింబల్ ఆఫ్ డిసిప్లిన్ రెండవభాగం (నవంబరు 2008).
  15. అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని-తూర్పుగోదావరి జిల్లా ప్రథమముద్రణ (23.2.2009).
  16. మహిళారత్నం, పద్మ విభూషణ్ డాక్టర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ (15.7.2009).
  17. హిమాలయ క్షేత్రదర్శిని (28.3.2010).
  18. అష్టమూర్తి శివక్షేత్రదర్శిని (4.4.2011).
  19. రాజమహేంద్రవర వరపుత్రుడు, శతాబ్ది మహనీయుడు డాక్టర్ ఎ.బి.నాగేశ్వరరావు (14.2.2012).
  20. నలుదిక్కులా నాలుగుక్షేత్రాలు (23.3.2012).
  21. అష్ట సోమేశ్వర క్షేత్రదర్శిని - తూర్పుగోదావరి జిల్లా రెండవముద్రణ (10.3.2013).
  22. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర యాత్రాదర్శిని (15.4.2015).
  23. గోదావరి పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు (గోదావరి పుష్కర క్షేత్ర దర్శిని - 14.7.2015).
  24. 'కృష్ణానది పరీవాహక క్షేత్రాలు-దేవాలయాలు' (కృష్ణవేణి పుష్కర దర్శిని - ఆగస్టు 2016)
  25. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయ స్థలచరిత్ర (28.9.2016).

ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకిజీలకు బాసట[మార్చు]

≠డాక్టర్ సత్యవాణి రచించిన రెండు పుస్తకాలు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకీజీలు పెట్టడానికి దోహదపడ్డాయి. పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం ఆధారంగా అప్పట్లొ ఆర్.టి.సి. పంచారామ యాత్రాదర్సిని పేరిట ప్రత్యేక బస్సులు కార్తిక మాసంలో ప్రవేశపెట్టింది. ప్రతియేటా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం కూడా ఆర్.టి.సి అందిస్తోంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని నవజనార్ధన క్షేత్రదర్శిని పుస్తకం కారణంగా కొన్ని సంవత్సరాలు ధనుర్మాసం సమయంలో ఆర్.టి.సి ప్రత్యేక సర్వీసులు నడిపింది.

మూలాలు[మార్చు]

  1. డాక్టర్ (మేజర్) చల్లా సత్యవాణి రచించిన గ్రంథాలు.
  2. https://web.archive.org/web/20160928193008/http://sarikothasamacharam.com/22nd-issue-september-2016/,
  3. http://sarikothasamacharam.com/drmejar-challa-satyavanis-krishna-pushkara-darshini/[permanent dead link]
  4. 'కృష్ణవేణి పుష్కరదర్శిని' ఆవిష్కరణ (సాక్షి దినపత్రిక)
  5. 'శ్రీ లక్షీనరసింహస్వామి ఆలయ చరిత్ర పుస్తకావిష్కరణ (సాక్షి దినపత్రిక, (29.9.2016)

ఇతర లింకులు[మార్చు]