Coordinates: 15°59′38″N 80°22′41″E / 15.994°N 80.378°E / 15.994; 80.378

చెరుకూరు (పర్చూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవెన్యూ గ్రామం
పటం
Coordinates: 15°59′38″N 80°22′41″E / 15.994°N 80.378°E / 15.994; 80.378
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంపర్చూరు మండలం
Area
 • మొత్తం22.67 km2 (8.75 sq mi)
Population
 (2011)[1]
 • మొత్తం7,080
 • Density310/km2 (810/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి997
Area code+91 ( 08598 Edit this on Wikidata )
పిన్‌కోడ్522169 Edit this on Wikidata


చెరుకూరు బాపట్ల జిల్లా, పర్చూరు మండలంలోని గ్రామం. పటంఇది మండల కేంద్రమైన పర్చూరు నుండి 18 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన చీరాల నుండి 36 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2038 ఇళ్లతో, 7080 జనాభాతో 2267 హెక్టార్లలో విస్తరించి ఉంది.[2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,393 గ్రామంలో నివాస గృహాలు 1,999 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,267 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

రమణయ్యపాలెం 3 కి.మీ, గొల్లపూడి 4 కి.మీ, కే.ఎం.వి.పాలెం 5 కి.మీ, పోతుకట్ల 5 కి.మీ, వీరన్నపాలెం 6 కి.మీ., భూషాయపాలెం 2.5 కి.మీ.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

 • శ్రీ త్రివిక్రమస్వామివారి ఆలయం:- ఈ ఆలయం దేశంలోనే ప్రసిద్ధిచెందిన ఆలయం. గులాబివర్ణంలో మూల విరాట్టు దాదాపు 9 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు తో, 8 చేతులతో సర్వాంగసుందరంగా ఉన్న విగ్రహం, దేశంలో మరెక్కడా లేదు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమస్వామిగా స్వయంభువుగా వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి.[3]
 • శ్రీ అగస్తేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం త్రివిక్రమస్వామివారి దేవాలయానికి దగ్గరలోనే ఉన్నది. ఈ ఆలయంలో స్వామివారు స్ఫటికలింగరూపంలో దర్శానమిస్తారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై జుట్టుముడి కలిగి ఉండటం విశేషం.
 • ఈ రెండు ఆలయాలకూ, 351 ఎకరాల మాన్యంభూమి ఉన్నది ఇదిగాక, అర్చకులకు 93.16 ఎకరాలు, భజంత్రీలకు 54.25 ఎకరాలు భూమి ఉంది. ఆలయం పేరిట రు. 40 లక్షల ధరావతులు ఉన్నాయి. రు. 23 లక్షల నగదు ఉంది.

ఈ గ్రామాన్ని విష్ణుమూర్తి దశావతారాల ప్రాజెక్టులోచేర్చి, ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది. వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపిన అణగద్రొక్కిన ప్రదేశం ఇది. అనంతరం స్వామివారు త్రివిక్రమస్వామిగా, స్వయంభూగా ఇక్కడ వెలసినాడని ప్రతీతి. త్రివిక్రమస్వామివారి ఆలయం రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే ఉన్నది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో త్రివిక్రస్వామివారి ఆలయం ఉన్నా, చెరుకూరులోని స్వామివారు తొమ్మిది అడుగుల ఎత్తులో, గోధుమవర్ణంలో దర్శనమివ్వడం విశేషం. ఈ ఆలయం ప్రక్కన ఉన్న ఖాళీస్థలంలో భక్తుల సౌకర్యార్ధం ఒక వసతిగృహం నిర్మించెదరు.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పర్చూరులోను, ఇంజనీరింగ్ కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ నాగులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చీరాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

చెరుకూరులో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వుంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది

భూమి వినియోగం[మార్చు]

చెరుకూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 334 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 1932 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 315 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1616 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

చెరుకూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 505 హెక్టార్లు
 • ఇతర వనరుల ద్వారా: 1110 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

వరి, మొక్కజొన్న, పొగాకు,అపరాలు, కాయగూరలు ఈ ఊరిలో పండించే ప్రధాన పంటలు

గ్రామం విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన వంకాయలపాటి సత్యనారాయణ , వైమానిక దళంలో పనిచేసి, పదవీ విరమణ పొందిన తరువాత గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేశారు. తల్లి-తండ్రి పేరిట బస్ షెల్టర్ నిర్మించారు. "తల్లి-తండ్రి" అను ఒక సేవాసదనం ఇతర సేవాకార్యక్రమాలు అనగా గ్రామస్తుల సౌకర్యం కోసం ఒక ఆంబులెన్స్ , కుట్టు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేశారు. 20 కంప్యూటర్లను శిక్షణ, విశ్రాంతి గదులు, వైద్యాలయం, పిల్లల పార్కు, సంగీత పాఠశాల, సామూహిక మరుగుదొడ్లు, దంతవైద్య పరికరం వగైరాలు ఏర్పాటు చేశారు.

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 3. ఈనాడు, విలేకరి. "సాగు ఆగదు.. భజంత్రీ మోగదు". ఈనాడు. న్యూస్ టుడే. Archived from the original on 3 జనవరి 2017. Retrieved 3 January 2017.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లింకులు[మార్చు]