తిమ్మరాజుపాలెం (పర్చూరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 15°59′56″N 80°15′00″E / 15.999°N 80.25°E / 15.999; 80.25అక్షాంశ రేఖాంశాలు: 15°59′56″N 80°15′00″E / 15.999°N 80.25°E / 15.999; 80.25
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంపర్చూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)523171 Edit this on Wikidata


తిమ్మరాజుపాలెం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గ్రామ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఆయువుపట్టు. వరి, పొగాకు, ప్రత్తి, మిరప, శనగ, మినుము పండించే ముఖ్యమైన పంటలు.

గ్రామ వివరాలు[మార్చు]

  • వైశాల్యం: 2.7 చదరపు కిలోమీటర్లు
  • జనాభా: 820
  • ఓటర్ల సంఖ్య: 730
  • వార్డులు: 8

విద్యారంగం[మార్చు]

ఈ గ్రామంలో 75% ప్రజలు విద్యావంతులు. ఐదవ తరగతి వరకు చదువుకొనుటకు ఈ గ్రామంలో వసతులు ఉన్నాయి. పై తరగతుల కొరకు చుట్టుపక్కల గ్రామాలైన అన్నంభొట్లవారిపాలెం, పర్ఛూరు, చిలకలూరిపేట లకు వెళ్లి వచ్చెదరు. ఈ గ్రామ యువకులు వివిధరంగాలలో ఉద్యోగాలు చేస్తూ హైదరాబాదు, బెంగళూరు మొదలగు పట్టణాలలోనే కాక లండను, అమెరికా వంటి దేశాలలో స్థిరపడి యున్నారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామం చిలకలూరిపేట-చీరాల రోడ్ మార్గములో ఉంది. ప్రతి 15 నిమిషములకు చిలకలూరిపేట, చీరాల, నరసరావుపేట నుంచి బస్సు సేవలు ఉన్నాయి. పర్చూరు, చిలకలూరిపేట నుంచి ఆటో సౌకర్యం ఉంది. దగ్గరలో వున్న రైలు స్టేషనులు చీరాల (20 కి.మీ), నరసరావుపేట (30 కి.మీ). సమీప గ్రామాలైన శ్యామలవారి పాలెం, గోరంట్లవారి పాలెం, చెన్నుభోట్లవారి పాలెం ప్రజలు రవాణా సౌకర్యం కోసం ఈ గ్రామానికి వస్తారు.

పరిపాలన[మార్చు]

ఈ ఊరి పరిపాలన గ్రామ పంచాయితీ ద్వారా జరగుతుంది.

సర్పంచులు[మార్చు]

ప్రస్తుత సర్పంచ్, ఉప సర్పంచ్

గత సర్పంచులు (సర్పంచ్,ఉప సర్పంచ్)

మల్లేశ్వరి కుక్కపల్లి, భూలక్ష్మి (2013 నుండి 2019)

నాగేశ్వరరావు కుక్కపల్లి, చిన్నం నాగేశ్వరరావు (2005-2010)

నాగేశ్వరరావు కుక్కపల్లి, బాలినేని పోతురాజు (2000-2005)

నిడమానూరి సుభానిబి, బాచిన చింపిరయ్య (1995-2000)

గోరంట్ల హరిబాబు, బాలినేని హనుమంతరావు (1990-1995)

నర్రా సుబ్బారావు, బాలినేని హనుమంతరావు (1985-1990)

గ్రామం లోని వివిధ ప్రాంతాలు[మార్చు]

గ్రామంలోని వివిధ ప్రాంతాలను గ్రామవాసుల పిలుపులలో ఈ విదంగా పలుకుతారు - మెయిను బజారు, తూర్పు బజారు, మధ్య బజారు, దక్షిణ బజారు, చెరువు కట్ట, చెరువు మాన్యం, రింగు రోడ్దు, రాముల వారి సెంటరు.

పండగలు, దేవాలయాలు[మార్చు]

దేవాలయం

సంక్రాంతి, దీపావళి, వినాయక చవతి, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ముఖ్యంగా జరుపుకునే పండుగలు. ప్రతి సంవత్సరం వూరి నడిబొడ్డున వున్న రామాలయంలో "హరే రామ" మంత్ర సప్తాహం జరుగును. రైతులు ప్రతి వేసవిలో వ్యవసాయం ప్రారంభించే ముందు పోలేరమ్మ తల్లి పూజలు చేసెదరు, కొలుపులు కూడా జరిపించెదరు. శ్రీ సత్యన్నారాయణ స్వామి దేవాలయం ఈ వూరి ప్రత్యేకత. సంక్రాంతి పండుగ నాడు జరుపుకునే తెప్పోత్సవం కన్నుల పండుగగా వుంటుంది. కృష్ణాష్టమి రోజున వుట్టి కొట్టే పోటీలు జరుపుకుంటారు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామాన్ని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీ స్వామినాథన్, ఆకర్షణీయ గ్రామం (smart villege) గా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకున్నాడు.[1]

వ్యవసాయం:[మార్చు]

ఈ గ్రామంలో 90% ప్రజలు వ్యవసాయం పై ఆధారపడియున్నారు. వ్యవసాయానికి అనువైన నల్ల రేగడి నేలలు విస్తరించియున్నాయి. వ్యవసాయానికి అవసరమైన నీటి వనరులు లేనప్పటికి పూర్త్తిగా వర్షాధారమైన పొగాకు, ప్రత్తి, జొన్న, శనగ, మినుము మొదలగు పంటలు పండిస్తారు.

ఆర్ధిక వ్యవస్థ[మార్చు]

సహకార బ్యాంకు పాలకవర్గం:

నర్రా రామయ్య (అధ్యక్షులు)

కుక్కపల్లి బుచ్చిబాబు

కుక్కపల్లి నాగేశ్వరరావు

తెమిడిదపాటి లింగారావు

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు ప్రకాశం; 2015,మార్చి-5; 9వపేజీ.

వెలుపలి లంకెలు[మార్చు]