జహ్రా అలీ యావర్ జంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బేగం జహ్రా అలీ యావర్ జంగ్ హైదరాబాదుకు చెందిన సంఘసేవకురాలు, పద్మభూషణ పురస్కార గ్రహీత.

ఈజిప్టు అధ్యక్షుడు గమాల్ నాసర్ భారత రాయబారి దంపతుల గౌరవార్ధం ఏర్పాటుచేసిన విందులో బేగం గమాల్‌తో జహ్రా అలీయావర్ జంగ్ (మధ్యలో)

జహ్రా, హైదరాబాదులో 1920, డిసెంబరు 27వ తేదీన నవాబ్ మెహదీ యార్ జంగ్ బహదూర్, కుల్సుం షంసున్నీసా బేగం దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి ఆ తర్వాత కాలంలో హైదరాబాదు రాజ్యానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఈమె విద్యాభ్యాసం ఇంగ్లాండులోని హారోలోని సౌత్‌లాండ్‌లో సాగింది.[1] ఈమె భర్త నవాబ్ అలీ యావర్ జంగ్, అర్జెంటీనా, ఈజిప్టు, యుగోస్లావియా, గ్రీకు, ఫ్రాన్స్, అమెరికా దేశాలకు భారత రాయబారిగా పనిచేశాడు., మహారాష్ట్ర గవర్నరుగాను, ఉస్మానియా విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా కూడా పనిచేశాడు.

ఈమె చేసిన సేవలకు గుర్తింపుగా భారతప్రభుత్వం 1976లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

ఈమె 2010, ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది.

మూలాలు[మార్చు]

  1. Ghose, Amal (1977). Who's who of Indian women, international, Volume 1. National Biographical Centre. p. 31. Retrieved 18 November 2017.