జాతీయ రహదారి 10 (పాత సంఖ్య)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 10
10
జాతీయ రహదారి 10
పటం
Map of Old NH 10 in red
National Highway 10 (India).png
జాతీయ రహదారి 10, నీలం రంగులో
మార్గ సమాచారం
Length403 కి.మీ. (250 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
తూర్పు చివరఢిల్లీ
Major intersections
List
పశ్చిమ చివరఫజిల్కా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఢిల్లీ: 18 కి.మీ.
హర్యానా: 313 కి.మీ.
పంజాబ్: 72 కి.మీ.
ప్రాథమిక గమ్యస్థానాలుఢిల్లీ - రోహ్‌తక్ - హిసార్ - సిర్సా - ఫాజిల్కా
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 9 ఎన్‌హెచ్ 11

జాతీయ రహదారి 10 ఢిల్లీలో మొదలై ఇండో-పాక్ సరిహద్దుకు సమీపంలో పంజాబ్‌లోని ఫజిల్కా పట్టణంలో ముగుస్తుంది. దీని పొడవు 403 కి.మీ. (250 మై.),[1]

కొత్త నంబరింగ్

[మార్చు]

రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల సంఖ్యలను హేతుబద్ధీకరించినపుడు, పాత ఎన్‌హెచ్‌ 10 ను క్రింది విధంగా మార్చారు. [2]

ఉన్నతీకరణలు

[మార్చు]

హిస్సార్, రోహ్తక్ మధ్య నాలుగు వరుసలకు పెంపు

[మార్చు]

2016 జూన్ నాటికి, రోహ్‌తక్-హిస్సార్ టోల్‌వే ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థ ద్వారా, హిస్సార్ నుండి రోహ్‌తక్ వరకు నాలుగు వరుసలుగా విస్తరించడాన్ని పూర్తి చేసింది. నిర్మాణ కాలంతో సహా ప్రాజెక్ట్ కోసం రాయితీ కాలం 22 సంవత్సరాలు. [3]

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో మూడవదశలో ఈ రోడ్డు విస్తరణ కోసం అదనంగా 591.84 హెక్టార్ల భూమిని సేకరించింది:

  • 2 టోల్ రోడ్ ప్లాజాలు:
  • 3 ఓవర్‌బ్రిడ్జిలు :
    • హిసార్ సమీపంలో హిసార్-జఖల్ రైల్వే లైన్
    • హిసార్ కాంట్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జి. )
    • రోహ్తక్ సమీపంలో జింద్-రోహ్తక్ రైల్వే లైన్
  • 13 అండర్‌పాస్‌లు
    • కలుపుతున్న గ్రామాలలో 6 పాదచారుల అండర్‌పాస్‌లు
    • కలుపుతున్న గ్రామాలలో 7 వాహనాల అండర్‌పాస్‌లు
  • 5 బైపాస్‌లు
    • హన్సి బైపాస్
    • మహం బైపాస్
    • ఖర్కడ బైపాస్
    • మదీనా బైపాస్
    • ఎన్‌హెచ్‌ 71 మీదుగా రోహ్‌తక్ సౌత్-వెస్ట్ ఎన్‌హెచ్‌10 బైపాస్

హిసార్ నుండి సిర్సా, దబ్వాలి మధ్య నాలుగు వరుసలకు పెంపు

[మార్చు]

బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT) టోల్ రోడ్ మోడ్‌లో హర్యానాలోని హిసార్-సిర్సా- దబ్వాలి విభాగాలను నాలుగు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టును డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (DBFOT) పద్ధతిలో 24 సంవత్సరాల రాయితీతో ఇచ్చారు. ఈ ప్రాజెక్టు 2015 లో ప్రారంభమైంది. ఇందులో క్రింది నిర్మాణాలు భాగం: [4]

  • 1 రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB)
  • 10 ఫ్లై ఓవర్లు
  • 1 ప్రధాన వంతెనలు
  • 11 చిన్న వంతెన
  • సిర్సా బైపాస్

భద్రత

[మార్చు]

2012 నుండి ఎన్‌హెచ్‌ఏఐ, PWD లు చేపట్టిన భద్రతా మెరుగుదల కారణంగా ఎన్‌హెచ్‌10లో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ మెరుగుదలలలో రంబుల్ స్ట్రిప్స్, అదనపు సంకేతాలు, ప్రతిఫలించే గుర్తులూ ఉన్నాయి. [5]

ప్రజా బాహుళ్యంలో

[మార్చు]

అనుష్క శర్మ నిర్మించిన బాలీవుడ్ థ్రిల్లర్ మూవీ ఎన్‌హెచ్‌10 ని జాతీయ రహదారి 10 మీద ప్రయాణించే కథ ఆధారంగా రూపొందించారు. అయితే, సినిమాలో చూపించిన దానికంటే హైవే పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. సినిమాలో చూపించినట్లు అది గుర్గావ్ గుండా వెళ్ళదు.

మూలాలు

[మార్చు]
  1. "Archived copy". Archived from the original on 10 April 2009. Retrieved 20 July 2011.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  2. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 30 Apr 2018.
  3. "CMIE". Centre for Monitoring Indian Economy. Archived from the original on 6 March 2016. Retrieved 12 June 2016.
  4. Hissar-Dabwali highway, National Highway Authority of India
  5. "Death toll on NH-10 dips". The Times of India. 19 July 2012. Archived from the original on 26 January 2013.