నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ | |||
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ | |||
వ్యవస్థాపక అధ్యక్షులు, లోక్‌సత్తా పార్టీ
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
నియోజకవర్గం | కూకట్‌పల్లి, హైదరాబాద్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జనవరి 14 1956 నాగభిర్, మహారాష్ట్ర | 1956 జనవరి 14 / ||
రాజకీయ పార్టీ | లోక్‌సత్తా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | ఎం.బి.బి.ఎస్ ఉస్మానియా మెడికల్ కాలేజీ | ||
వెబ్‌సైటు | www.kukatpallynow.com | ||
జనవరి 1, 2013నాటికి |
నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్ (Dr. JP Narayan) లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కృష్ణాజిల్లా గొడవర్రులో పెరిగాడు. ఎమ్.బి.బి.ఎస్ పట్టా పొందిన పిదప భారత పరిపాలనా సేవలో (I.A.S) చేరాడు.
ప్రస్థానం
[మార్చు]1980లో ఐఎఎస్ అధికారిగా గుంటూరులో అడుగుపెట్టారు. తర్వాత విశాఖలో జాయింట్ కలెక్టర్‌గా, 1986లో ప్రకాశం జిల్లాలో, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్‌గా చేశారు. తర్వాత యాగ్రో ఇండస్ట్రీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అధినేతగా, గవర్నర్ కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పలు పదవులు నిర్వహించారు.
సామాజిక జీవితం
[మార్చు]లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులను నిషేధించే చట్టం, గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు. 1996లో ఐఎఎస్ పదవిని వదలి లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాలా ప్రియం. 2009లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. 2014లో మల్కాజ్‌గిరి నుంచి లోకసభకు పోటిచేసి ఓడిపోయారు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఒక తెలుగు మాట్లాడే కుటుంబంలో మహారాష్ట్రలోని నాగభిర్‌లో 1956 జనవరి 14న జన్మించారు. మూడవ యేట నుండి 7 సంవత్సరాల వయస్సు వరకు విజయవాడ సమీపం లోని గొడవర్రు అనే గ్రామంలో పెరిగారు. ఇక్కడే తెలుగు మీడియంలో చదువు కొనసాగింది. 7 సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రులతో కృష్ణా జిల్లా ఇందుపల్లి సమీపంలోని వేమండ గ్రామానికి మారారు. 1969లో ఆంధ్ర లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ కోసం చేరారు. తదనంతరం వైద్యపట్టా పొందారు. భార్య రాధ, అమ్మాయి స్నిగ్ధ, అబ్బాయి సిద్ధార్ధ.
సామాజిక సంస్కరణలు
[మార్చు]- నారాయణ ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్‌డిఆర్) వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుతం దాని ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. రాజకీయ, ఎన్నికల పాలన రంగాలలో రాష్ట్ర విధానం క్లిష్టమైన రంగాలలో ప్రాథమిక సంస్కరణలను రూపొందించడానికి ప్రోత్సహించడానికి భారతదేశంలోని ప్రముఖ థింక్-ట్యాంకులు పరిశోధన-వనరుల కేంద్రాలలో FDR ఒకటి.
- నారాయణ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం (వైపిపి) సలహాదారు, సామాజిక స్పృహ ఉన్న యువతకు వారి అభిప్రాయాలు, ఆలోచనలను వ్యక్తీకరించడానికి జాతీయ భవన ప్రక్రియలో మార్పు ఏజెంట్‌గా పనిచేయడానికి యూత్ పార్లమెంట్ ఒక అనువైన వేదిక.