తిరుష్ కామిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుష్ కామిని
ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2013 లో వెస్టిండీస్‌పై సెంచరీ చేస్తున్న సమయంలో కామిని ఆడిన షాట్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మురుగేషన్ డికేశ్వశంకర్ తిరుష్ కామిని
పుట్టిన తేదీ (1990-07-30) 1990 జూలై 30 (వయసు 33)
చెన్నై, తమిళనాడు, భారతదేశం,
బ్యాటింగుఎడమచేతివాటం
బౌలింగుRight-arm legbreak
పాత్రబంతిని కొట్టడం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 74)2014 13 ఆగష్టు - ఇంగ్లాండు తో
చివరి టెస్టు2014 నవంబరు 16 - సౌత్ ఆఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 83)2006 మార్చి 7 - పాకిస్థాన్ తో
చివరి వన్‌డే2017 10 పిబ్రవరి - ఐర్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.16
తొలి T20I (క్యాప్ 12)2008 అక్టోబరు 28 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2013 ఏప్రిల్ 4 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2000/01–2014/15తమిళనాడు మహిళలు
2015/16– ప్రస్తుతంరైల్వేస్ మహిళలు
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఒడిఐ టిీ20
మ్యాచ్‌లు 2 39 3
చేసిన పరుగులు 237 825 67
బ్యాటింగు సగటు 79.00 25.78 33.50
100s/50s 1/0 2/3 0/1
అత్యధిక స్కోరు 192 113 * 56
వేసిన బంతులు 6 384
వికెట్లు 0 9
బౌలింగు సగటు 45.53
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 30.11
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/19
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 5/– 0/–
మూలం: ESPN Cricinfo, 2020 జనవరి 17

మురుగేశన్ డికేశ్వశంకర్ తిరుష్ కామిని (జ:1990 జూలై 30) భారత మహిళా క్రికెట్ జట్టు కోసం 39 మహిళల ఒకరోజు అంతర్జాతీయ ఆటలో 39 మంది మహిళలతో పాటు ఆడిన ఒక భారతీయ క్రికెటర్.[1] తిరుష్ కామిని ఆరేళ్ల వయసులో ఆడటం ప్రారంభించింది. ఆమె తండ్రి ఆమెకు క్రికెట్‌పై ఉన్న ఆసక్తిని గమనించాడు.అప్పటి నుండి ఆమె తండ్రి వద్దనే శిక్షణ పొందింది.ఆమె 8 సంవత్సరాల వయస్సులో 16 సంవత్సరాల వయస్సు లోపు వారి ఆటకు తమిళనాడు రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించింది.10 సంవత్సరాల వయస్సులో సీనియర్సు తరుపున రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది [2] ఆమె 15 ఏళ్ల వయసులో 21 సంవత్సరాల వయస్సు లోపు వారి ఆటకు భారతదేశం తరుపున ప్రాతినిధ్యం వహించింది, అ ఆటకు పాకిస్తాన్‌లో పర్యటించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకుంది. ఆమె 16 సంవత్సరాల వయస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె తొలి టోర్నమెంట్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను గెలుచుకుంది. 2007లో, ఆమె అలన్ బోర్డర్ గవాస్కర్ స్కాలర్‌షిప్‌ను గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందే అవకాశాన్ని పొందింది.

తిరుష్ కామిని, 2007-2008 జూనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2009-2010 సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, 2012-2013 సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఆటలకు మూడుసార్లు బిసిసిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెట్ క్రీడాకారిణి.

2013 మహిళల ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 100 పరుగులు చేసింది.ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2013 మొదటి ఆటలో 146 బంతుల్లో 100 పరుగులు చేయడం ద్వారా ప్రపంచ కప్ ఆటలో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ సాధించిన స్థాయిని, తిరుష్కామిని అధిగమించింది.ప్రపంచ కప్‌లో 100 పరుగులు చేసినమొదటిభారతీయమహిళగా నిలిచింది.2014లో కామిని దక్షిణాఫ్రికాతో జరిగినటెస్ట్ మ్యాచ్‌లో430 బంతుల్లో 192 పరుగులు చేసింది.ఇది ఒక భారతీయమహిళ చేసిన రెండవ అత్యుత్తమ స్కోరు, ఒక భారతీయ ఓపెనర్ చేసినఅత్యధిక స్కోరు. శ్రీలంక లోని కొలంబోలో 2017లో జరిగిన ఐసిసి మహిళలప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ఐర్లాండ్ మహిళలపై 194 బంతుల్లో అజేయంగా113 పరుగులుచేసి తన క్రికెట్ ఆటలలోఅత్యుత్తమంగా స్కోర్ చేసింది. క్వాలిఫయర్స్‌లో కూడా 100 పరుగులుచేసినమొదటి భారతీయ మహిళగా తిరుష్ కామిని నిలిచింది.ఆమె ప్రస్తుతం కాంట్రాక్టు బీసిసిఐ ఏ తరగతి క్రీడాకారిణి.

క్రికెట్ ఆట చరిత్రలో మైదానాన్ని అడ్డుకున్నందుకు బయటకు పంపబడిన ఏకైక మహిళా క్రికెట్ క్రీడాకారిణిగా ఆమె గణతికెక్కింది.[3]

అంతర్జాతీయ సెంచరీలు[మార్చు]

టెస్టు సెంచరీలు[మార్చు]

తిరుష్ కామిని టెస్ట్ సెంచరీలు[4]
# పరుగులు ఆటలు ప్రత్యర్థులు నగరం/దేశం ప్రదేశం సంవత్సరం
1 192 2  వెస్ట్ ఇండీస్ భారతదేశం మైసూరు భారతదేశం శ్రీకంఠదత్త నరసింహ రాజా వడెయార్ గ్రౌండ్ 2014[5]

అంతర్జాతీయ వన్డే సెంచరీలు[మార్చు]

తిరుష్ కామిని వన్డే ఇంటర్నేషనల్ సెంచరీలు[6]
# పరుగులు ఆటలు ప్రత్యుర్థులు నగరం/దేశం ప్రదేశం సంవత్సరం
1 100 22  వెస్ట్ ఇండీస్ భారతదేశం ముంబై, భారతదేశం బ్రబౌర్న్ స్టేడియం 2013[7]
2 113* 38  ఐర్లాండ్ శ్రీలంక కొలంబియా, శ్రీలంక P Sara Oval 2017[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

దక్ఠణ రైల్వేలోని పర్సనల్ బ్రాంచిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమె భారత రైల్వేస్ తరపున ఆడింది.[9] ఆమె 2021 జూలైలో దక్షిణ రైల్వేలో ఉద్యోగానికి రాజీనామా చేసింది.

అవార్డులు[మార్చు]

 • బి.సి.సి.ఐ. జూనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2007-2008
 • బి.సి.సి.ఐ. సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2009-2010
 • బి.సి.సి.ఐ. సీనియర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2012-2014 [10]

ఇది కూడ చూడు[మార్చు]

 • మహిళల ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 పరుగుల జాబితా
 • మహిళల టెస్టు క్రికెట్‌లో 100 పరుగుల జాబితా

మూలాలు[మార్చు]

 1. "Thirush Kamini player profile". Cricinfo. Retrieved 6 March 2010.
 2. "Honing their game on an uneven pitch - Times of India". The Times of India. Retrieved 2017-08-28.
 3. Staff, CricketCountry (2016-11-13). "MD Thirushkamini first women cricketer to be given out Obstructing the Field". Cricket Country. Retrieved 2017-08-28.
 4. "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com – MDT Kamini". ESPNcricinfo. Retrieved 11 December 2021.
 5. "Full Scorecard of IND Women vs SA Women Only Test 2014/15 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 11 December 2021.
 6. "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – MDT Kamini". ESPNcricinfo. Retrieved 11 December 2021.
 7. "Full Scorecard of IND Women vs WI Women 1st Match, Group A 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 11 December 2021.
 8. "Full Scorecard of IND Women vs Ire Women 11th Match, Group A 2016/17 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 11 December 2021.
 9. "Meet the star of the Indian women's cricket team". dtNext.in. 2015-12-25. Archived from the original on 28 August 2017. Retrieved 2017-08-28.
 10. "Meet woman cricketer Thirush Kamini". femina.in. Retrieved 2017-08-28.

వెలుపలి లంకెలు[మార్చు]