Jump to content

తెలంగాణ చేనేత మగ్గం పథకం

వికీపీడియా నుండి
తెలంగాణ చేనేత మగ్గం పథకం
తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర
ప్రాంతంహైదరాబాదు, తెలంగాణ
ప్రధాన వ్యక్తులుతెలంగాణలోని చేనేత కార్మికులు
స్థాపన2023, ఆగస్టు 07
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ చేనేత మగ్గం పథకం అనేది చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.[1] తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులు కొత్త తరహా మగ్గాల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించడంకోసం ఈ పథకం ప్రవేశపెట్టబడింది. రాష్ట్రంలోని 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్‌ మగ్గాల ఏర్పాటుకు రూ.38వేల చొప్పున ఈ పథకానికి రూ.40.50 కోట్లను కేటాయించనుంది.[2]

రూపకల్పన

[మార్చు]

సాంప్రదాయ గుంట మగ్గాల వల్ల చేనేత కార్మికులకు పనిభారం, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని నివారించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్‌ మగ్గాలను ఏర్పాటుచేయాలన్న చేనేత కార్మికుల విజ్ఞప్తి మేరకు ఈ పథకానికి రూపకల్పన చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.[3]

ప్రారంభం

[మార్చు]

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2023, ఆగస్టు 7న మన్నెగూడలోని బీఎంఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన చేనేత దినోత్సవ వేడుకలలో రాష్ట్ర చేనేత జౌళి శాఖలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేనేత మగ్గం పథకాన్ని ప్రారంభించాడు.[4] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక-సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ చింతా ప్రభాకర్, పవర్ లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చైర్మన్‌ గూడూరి ప్రవీణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్, కర్నాటి విద్యాసాగర్ లతోపాటు పలు చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "నేతన్నలకు ఆరోగ్య కార్డు". EENADU. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
  2. "National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు". ETV Bharat News. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
  3. "నేతన్నలకు గుడ్‌న్యూస్.. ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 వేల వరకు." Samayam Telugu. 2023-08-07. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
  4. telugu, NT News (2023-08-07). "KTR | నేత‌న్నల కోసం చేనేత మిత్ర‌.. ఈ నెల నుంచే ప్ర‌తి మ‌గ్గానికి రూ. 3 వేలు : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-08-07. Retrieved 2023-08-07.
  5. telugu, NT News (2023-08-08). "Minister KTR | చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా వ్యవహరిస్తున్న కేంద్రం: మంత్రి కేటీఆర్‌". www.ntnews.com. Archived from the original on 2023-08-08. Retrieved 2023-08-08.