Jump to content

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్

వికీపీడియా నుండి
(తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నుండి దారిమార్పు చెందింది)
తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్
నినాదంఇంటింటా ఇన్నోవేటర్
ఏజెన్సీ అవలోకనం
ఏర్పాటు2017
అధికార పరిధి నిర్మాణం
కార్యకలాపాల అధికార పరిధిహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
చట్టపరమైన అధికార పరిధితెలంగాణ రాష్ట్రం
ప్రధాన కార్యాలయంహైదరాబాద్
వెబ్‌సైట్
అధికారిక వెబ్‌సైటు

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ ప్రభుత్వంలోని సమాచార, సాంకేతిక శాఖకు చెందిన ఒక విభాగం. తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలనే లక్ష్యంతో ఈ తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఏర్పాటు చేయబడింది.

ప్రారంభం

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కరణల సంస్కృతిని నిర్మించడంకోసం, పెంపొందించడంకోసం తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ పాలసీ కింద 2017లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ ఈ సెల్ ను ప్రారంభించాడు. ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్‌లు, వ్యవస్థాపకులు మొదలైన వారికి ఈ సెల్ ప్రోత్సాహం అందిస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక స్టార్టప్‌లకు ఈ సెల్ సహకారం అందించడంతో వివిధ రకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయి.

లక్ష్యాలు

[మార్చు]
  1. పాఠశాలలుథాయి నుండే ఆవిష్కరణ సంస్కృతిని నిర్మించడం
  2. ప్రభుత్వం, పరిపాలన స్థాయిలో ఆవిష్కరణలను ప్రచారం చేయడం, పెంపొందించడం
  3. రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహించి, సహాయం అందించడం

ఆవిష్కరణలు

[మార్చు]

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 2022 అక్టోబరు 19న టి హబ్ 2 వేదికగా జరిగిన 'మన ఇన్నోవేటర్స్‌ కథలు' అనే కార్యక్రమంలో గ్రామీణుల ఆవిష్కరణలు ప్రదర్శించబడ్డాయి. సమస్య మీది.. పరిష్కారం మాది అనే కాన్సెప్టుతో రైతులు, వృద్ధులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చక్కటి పరిష్కారమార్గాలను చూపేవిధంగా ఆవిష్కరణలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ రూపొందించిన ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలకు ఇన్నోవేషన్ గురించి తెలిసేలా చేసింది. ఎంపిక చేసిన 23 గ్రామీణ ఆవిష్కరణల్లో 21 ఆవిష్కరణల గురించి తెలుసుకున్న పెట్టుబడిదారులు 21 ఆవిష్కరణల్లో 49మంది పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చారు.[1]

క్రమసంఖ్య ఆవిష్కర్త పేరు జిల్లా ఆవిష్కరణ
1 ఎం. గోపాల్‌ సింగ్‌ రంగారెడ్డి మెకానికల్‌ టర్న్‌ ఆన్‌/ఆఫ్‌ కంట్రోల్‌ ఆఫ్‌ వాల్వ్‌ సిస్టం
2 దీపక్‌ రెడ్డి సంగారెడ్డి రాతి వ్యర్థాలను తొలగించే లోకాస్ట్‌ మల్టీపర్పస్‌ యంత్రం
3 గొర్రె అశోక్‌ సూర్యాపేట వ్యవసాయ పనిముట్లు- పొల్లాల్లో వాడే స్ప్రేయర్‌
4 ఎం. సత్యనారాయణ భద్రాద్రి కొత్తగూడెం హైడ్రాలిక్‌ అటాచ్‌మెంట్‌ టూ ట్రాక్టర్‌ ఫర్‌ ఈజీ లెవెలింగ్‌
5 టి. రవికిరణ్‌ ఆదిలాబాద్‌ రోగుల కోసం మల్టీపర్పస్‌ కోటు
6 వెల్లే శ్రీనివాస్‌ ఖమ్మం 2 కి.మీ దూరం నుంచే రిమోట్‌ కంట్రోల్‌ డివైజ్‌ ద్వారా వ్యవసాయ మోటార్లను ఆన్‌, ఆఫ్‌ చేసే పరికరం
7 శ్రీజ జోగులాంబ గద్వాల మొక్కల పెంపకం కోసం వాడే ప్లాసిక్‌ కవర్ల స్థానంలో వినియోగించే బయోడీగ్రేడబుల్‌ కుండలు
8 రామకృష్ణ పెద్దపల్లి తక్కువ వ్యయంతో కూడిన యూవీ లైట్‌ శానిటేషన్‌ బాక్స్‌తో ఆఫీస్‌ పైల్స్‌ను, కాగితపు వస్తువులను శుభ్రం చేయడం
9 కె.శివనాగరాజు యాదాద్రి భువనగిరి తక్కువ వ్యయంతో కూడిన ఎలక్ట్రిక్‌ మినీ ట్రాక్టర్‌- కూరగాయలు, పూలు పండించేందుకు వినియోగం
10 టి.శ్రీదేవి నిజామాబాద్‌ మిల్లెట్‌ ఆధారిత పోషకాహార ఉత్పత్తుల తయారీ- గర్భవతులు, చిన్న పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు
11 రాజు ముప్పారపు హన్మకొండ ఆటోమేటిక్‌ స్ట్రీట్‌ లైట్‌ కంట్రోల్‌ సిస్టం
12 ఇంజపూరి అంజయ్య జగిత్యాల తక్కువ వ్యయంతో సోలార్‌ విద్యుత్‌తో పనిచేసే బహుళ వినియోగ ఎలక్ట్రిక్‌ వీడర్‌, స్ప్రేయింగ్‌ యంత్రం
13 గొనే కిషన్‌కుమార్‌ జగిత్యాల ఇన్‌స్టాంట్‌ ప్యాడీ డ్రైయర్‌
14 మెండె శ్రీనివాస్‌ జగిత్యాల ఆటోమేటిక్‌ రోబో టు టర్న్‌ ఆన్‌ ఆఫ్‌ మోటార్స్‌ యూజింగ్‌ ఎయిర్‌ అండ్‌ వాటర్‌
15 వెంకటేశ్‌ అబ్బోజు వరంగల్‌ తక్కువ వ్యయంతో కూడిన మోనో వీల్‌ వీడర్‌ విత్‌ అడ్జస్టబుల్‌ రో విడ్త్‌
16 లెఫ్టినెంట్‌ కల్నల్‌ భాస్కర్‌ రెడ్డి హైదరాబాద్‌ వృద్ధుల కోసం మల్టీపర్పస్‌ వాకింగ్‌ స్టిక్‌
17 సుధీర్‌ యాదాద్రి భువనగిరి యాదాద్రి దేవాలయం నుంచి పూల వ్యర్థాలను సేకరించి సువాసననిచ్చే ఆగర్‌ బత్తీల తయారీ
18 ధని పావని మేడ్చల్‌ అక్టోక్లీనర్‌- నీళ్లలో లోతుగా వెళ్ళి చెత్త వ్యర్థాలను సేకరించే యంత్రం
19 హేమేశ్‌ హైదరాబాద్‌ అల్జీమర్‌ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా చేతికి ధరించే మానిటర్‌తో శరీర ఉష్ణోగ్రతలు, పల్స్‌రేటును గుర్తించే యంత్రం
20 ఉదయ్‌ భాస్కర్‌ మేడ్చల్‌ న్యూమటిక్‌ కన్వేయర్‌ టు ట్రాన్స్‌ఫర్‌ గ్రేన్స్‌ అండ్‌ హస్క్‌ ఇన్‌ బల్క్‌ క్వాంటిటీ
21 రవికాంత్‌ చారి హైదరాబాద్‌ అడ్వాన్స్‌డ్‌ మెథడ్‌ టు క్రియేట్‌ మోల్డింగ్‌ అండ్‌ వ్యాక్యూమ్‌ కాస్టింగ్‌ ఫర్‌ మేకింగ్‌ మాస్టర్‌ పీసెస్‌ ఆఫ్‌ జుయెల్లరీ
22 అల్లాడి ప్రభాకర్‌ జగిత్యాల మల్టీపర్పస్‌ కాట్‌ ఫర్‌ బెడ్‌ రిడెన్‌ పేషెంట్స్‌
23 షణ్ముఖరావు మహబూబాబాద్‌ లోకాస్ట్‌ సిక్స్‌ రో రైస్‌ ట్రాన్స్‌ప్లాంటర్‌

ఇతర వివరాలు

[మార్చు]
  • గ్రామీణ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలనే లక్ష్యంతో, గ్రామీణ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేందుకు కృషిచేస్తున్న స్టార్టప్‌ నిర్వాహకులను ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న ‘విలేజ్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ను 2022, మార్చి 12న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించాడు.[2]
  • తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ విభాగం నుండి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతున్న స్టార్టప్‌లకు ఆర్థిక చేయూతనందించేందుకు ఆయా స్టార్టప్‌లకు రూ.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తోంది.[3]
  • తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు వ్యవసాయ అనుబంధ ఆవిష్కరణలను అర్థం చేసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి పరస్పర సహకారం కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ల మధ్య సంస్థాగత ఒప్పందం జరిగింది.[4]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2022-10-20). "అబ్బురపరిచిన మన ఇన్నోవేటర్స్‌". Namasthe Telangana. Archived from the original on 2022-10-20. Retrieved 2022-10-22.
  2. telugu, NT News (2022-03-13). "టీఎస్‌ఐసీ ఆధ్వర్యంలో విలేజ్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌". Namasthe Telangana. Archived from the original on 2022-03-13. Retrieved 2022-03-25.
  3. "స్టార్టప్‌లకు స్వర్గధామం.. టీఎస్‌ఐఆర్‌ఐఐ". Sakshi. 2022-03-02. Archived from the original on 2022-03-22. Retrieved 2022-03-26.
  4. Telanganatoday (2022-01-11). "Telangana State Innovation Cell signs MoU with AgHub". Telangana Today. Archived from the original on 2022-01-11. Retrieved 2022-03-26.

బయటి లంకెలు

[మార్చు]