దక్షిణ కోసల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పురాతన తూర్పు-మద్య భారతదేశంలో దక్షిణ కోసల (సా.శ.375)

మధ్య భారతదేశంలోని చారిత్రక ప్రాంతాలలో దక్షిణ కోసల ఒకటి. ఇది ఇప్పుడు ఛత్తీసుగడు, పశ్చిమ ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలో ఉంది. [1] ఇది ప్రస్తుత మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలోని కొంత భాగాన్ని కూడా కలిగి ఉండవచ్చు. [2]

వివిధ సమయాలలో భద్రావతి, సిర్పూరు (పురాతన శ్రీపుర), తుమను (పురాతన తుమ్మన), రతన్పూరు (పురాతన రత్నపుర) దాని రాజధానులుగా ఉన్నాయి. [3]

విస్తరణ

[మార్చు]

కోసాలా ("దక్షిణ కోసల") ను కొన్నిసార్లు కోసల అని పిలుస్తారు. దీనిని ప్రస్తుత ఉత్తర ప్రదేశు లోని ఉత్తర కోసల ("ఉత్తర కోసల") నుండి వేరు చేయడానికి దీనిని దక్షిణ కోసల పిలుస్తారు.[4]

రాయపూరు, బిలాసపూరు, సంబల్పూరు జిల్లాల సరిహద్దు ప్రాంతం కచ్చితంగా దక్షిణ కోసల ప్రాంతంలో ఒక భాగమని ఎపిగ్రాఫికు ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ జిల్లాలలో కనిపించే శాసనాలు కోసల దేశంలో ఉన్న గ్రామాల గ్రాంట్లను నమోదు చేస్తాయి. ఈ శాసనాలలో పేర్కొన్న పాలకులకు దక్షిణ కోసల (కోసలాధిషా, కోసలాదిపతి, కోసల-నరేంద్ర వంటివి) ప్రజలు తమ ప్రభువును సూచించే శీర్షికలు ఇవ్వబడ్డాయి.[5]

7 వ శతాబ్దపు చైనా యాత్రికుడు జువాన్జాంగు అభిప్రాయం ఆధారంగా, సమకాలీన కోసల సామ్రాజ్యం వైశాల్యం 6,000 లీ అంటే సుమారు 81,000 చదరపు మైళ్ల విస్తీర్ణం.[6] ఇది 7 వ శతాబ్దంలో దక్షిణ కోసల ప్రాంతం పైన పేర్కొన్న జిల్లాల సరిహద్దు ప్రాంతం కంటే చాలా పెద్ద ప్రాంతాన్ని కలిగి ఉందని సూచిస్తుంది. సంబల్పూరు సరిహద్దులో ఉన్న ప్రస్తుత ఒడిశాలోని ఇతర ప్రాంతాలు కూడా దక్షిణ కోసలలో భాగమని సోమవంశీ శాసనాలు సూచిస్తున్నాయి. జువాన్జాంగు కాలంలో కోసాల 78 వ మెరిడియను తూర్పు నుండి తూర్పు-పడమర దిశలో 85 వ మెరిడియను తూర్పు వరకు విస్తరించి ఉన్నట్లు తెలుస్తుంది.[5]

కోసల ఉత్తర సరిహద్దు మేకల రాజ్యంలో భాగమైన అమరకాంతకకు దక్షిణాన ఉంది.[5] వాయు పురాణం, మత్స్య పురాణాలతో సహా పురాణాలు మేకల, కోసలలను విభిన్న ప్రాంతాలుగా పేర్కొన్నాయి. ఒకతక రాజు రెండవ పృథ్వీషేన బాలఘాటు శాసనం వంటి పురాతన ఎపిగ్రాఫులు కూడా ఈ రెండు ప్రాంతాల మధ్య తేడాను గుర్తించాయి. ఏదేమైనా ఒక ప్రదేశంలో వాయు పురాణం దీనిని మేకలాలను పంచ కోసలాలలో ఒకటిగా పేర్కొంది ("ఐదు కోసలాలు"). ఇది ఏదో ఒక సమయంలో మేకల ప్రాంతంలోని ముఖ్యులు కోసల పాలకులకు అధీనంలో ఉన్నారని సూచిస్తుంది.[5]

దక్షిణాన దక్షిణ కోసల ప్రాంతం దాని శిఖరాగ్ర స్థాయిలో మహారాష్ట్రలోని ప్రస్తుత విదర్భ ప్రాంతంలో కొంత భాగాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. నల మహారాజు పురాణం ఆయన కోసల రాజధానికి చేరుకున్నట్లు పేర్కొంది: ఆయన ప్రయాణ మార్గం వర్ణన ఈ రాజధాని ప్రస్తుత భద్రావతి అని సూచిస్తుంది.[7][8]

ఏది ఏమయినప్పటికీ దక్షిణ కోసల, మహాకోషల ఒకే భౌగోళిక విభాగాన్ని సూచిస్తారనే వాదనకు పురాతన గ్రంథాలు లేదా శాసనాలు ఏవీ మద్దతు ఇవ్వలేదు.[9] పురాతన సంస్కృత గ్రంథాలు తరచుగా దక్షిణ కోసల గురించి ప్రస్తావించాయి కాని మహాకోషల ఒక ప్రాంతం పేరుగా పేర్కొనలేదు.[4]

రాజధానులు

[మార్చు]

వివిధ సమయాలలో కోసలలు సిర్పూరు (పురాతన శ్రీపుర), తుమను (పురాతన తుమ్మన), రతన్పూరు (పురాతన రత్నపుర) ఉన్నాయి. జువాన్జాంగు కాలంలోనే భద్రావతి దక్షిణ కోసల రాజధాని అయి ఉండవచ్చు.[7]అయినప్పటికీ సిర్పూరు ఈ ప్రాంతం సమకాలీన మరొక రాజధానికి నగరంగా భావించబడుతుంది.[10]

రాజు రెండవ భీమసేన సా.శ. 601 అరంగుశాసనం స్థానిక రిషితుల్యాకుల రాజులకు శ్రీపుర రాజధాని (బహుశా సా.శ. 5 వ శతాబ్దం నుండి) అని సూచిస్తుంది.[11] తరువాతి కాలంలో ఇది పాండువంశీ రాజుల రాజధానిగా పనిచేసింది. వీరిని వారి శాసనాలలో కోసల ప్రభువులుగా అభివర్ణించారు.[12]

శతాబ్దాల తరువాత తుమ్మన, రత్నపుర దక్షిణ కోసల రాజధానులుగా మారాయి. తుమ్మునను కళిగరాజు త్రిపురి కలాచురి సంతతికి చెందిన రాజు మొదటి కోకల్లా (సా.శ. 875) స్థాపించాడు. రత్నపురను కళింగరాజు తరువాత వారసుడు, రత్నపుర కలచురి రాజవంశం రాజు రత్నదేవ స్థాపించాడు.[7]

పురాణాలు

[మార్చు]

పురాతన భారతీయ సాహిత్యంలో అలాగే రామాయణం, మహాభారతం వంటి పురాణాలలో ఉత్తర భారతదేశంలోని పురాతన కోసల రాజ్యం గురించి చాలా సూచనలు ఉన్నాయి. సూర్యవంశ ఇక్ష్వాకు రాజవంశం రాజులు కోసలరాజ్యాన్ని అయోధ్యను తమ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. శ్రీ రామచంద్రుడు ఆ వంశానికి చెందిన రాజు. ఈ పాత్ర కార్యకలాపాల ఆధారంగా రామాయణం వ్రాయబడింది. ఈ రచనలో రాముడి తరువాత ఆయన ఇద్దరు కుమారులు లావ - కుశ మధ్య రాజ్యం విభజించబడింది. ఉత్తర కోసల శ్రావస్తి నగరాన్ని రాజధానిగా చేసుకుని లవుడు పాలించగా, కుశ దక్షిణ కోసలను పాలించాడు. కుశస్థలి నగరం వింధ్య పర్వతశ్రేణికి సమీపంలో ప్రవహిస్తున్న కుశర్వతి నదీతీరంలో స్థాపించి ఆయన కుశాస్థలిపుర నగరం తన కొత్త రాజధానిగా చేసుకుని పాలించాడు. విద్యపర్వతశ్రేణి ఉత్తర, దక్షిణ భారతదేశాలను విభజిస్తుంది. కుశస్థలిపురం ప్రస్తుత ఛత్తీసుగడు రాష్ట్రంలోని బిలాస్పూరు జిల్లాలోని మల్హరు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.

తన సైనిక పోరాటం రాజ్యవిస్తరణ భాగంగా సహదేవుడు ఇండో-గంగా మైదానానికి దక్షిణంగా ఉన్న ప్రాంతాలలో ఉన్న రాజ్యాలను లక్ష్యంగా చేసుకున్నాడు. యుద్ధంలో కోసల రాజు అజేయమైన భీష్మకను ఓడించి సహదేవుడు, వెన్వా ఒడ్డున ఉన్న భూభాగాలను అలాగే కాంతరాకులు, తూర్పు కోసల రాజులను ఓడించాడు.[13][page needed]

చరిత్ర

[మార్చు]

గుప్తసామ్రాజ్య పతనం తరువాత దక్షిణకోసల ప్రాంతాన్ని అనేక చిన్న రాజవంశాలు పాలించాయి. వాటిలో అమర్యక్యుల, పాండువంశీల మేకల, పాండువంశీయుల దక్షిణ కోసల (పాండువంశీయుల శ్రీపురం), షరభపురీయులు ఉన్నారు. ఈ రాజవంశాల కాలక్రమం చాలా స్పష్టంగా లేదు. ఎందుకంటే వాటి శాసనాలు క్యాలెండర్ యుగానికి బదులుగా పాలన సంవత్సరాలలో ఉన్నాయి.[14] ఈ ప్రాంతంలో కనుగొనబడిన ఏకైక పురాతన శాసనం క్యాలెండరు యుగంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకు శూరకుటుంబానికి చెందిన రెండవ భీమసేన అరంగ రాగి-ఫలక శాసనం సాక్ష్యంగా ఉంది. అయినప్పటికీ ఇది ప్రాంతంలోని ఇతర నమోదిత ఆధారాలతో అనుసంధానించబడలేదు. అందువలన ప్రాంతం కాలక్రమాన్ని పునర్నిర్మించడానికి ఇది ఉపకరించదు.[15]

రాజవంశం చివరి సభ్యుడైన అరబాలా రాజు జారీ చేసిన రెండు మల్హారు శాసనాల నుండి మేకల పాండవాల ఉనికి తెలుస్తుంది.[16] రాజు అరబాలా చంద్ర రాజవంశం (సోమవాసా) పురాణ కథానాయకుడు పాండురాజు సంతతికి చెందినట్లు పేర్కొనబడింది.[17]

వ్యాఘ్రరాజా మల్హారు శాసనం ఆధారంగా అమరాయకులాలు (అమర్య కుటుంబం) గుర్తించబడ్డారు.[18] డి. సి. సిర్కారు ఈ కుటుంబం శరభపురియాలతో సమానమని విశ్వసిస్తారు. అజయ మిత్రశాస్త్రి దీనిని ఒక స్వతంత్ర రాజవంశంగా విశ్వసిస్తారు. అయితే హన్స్ టి. బక్కరు దీనిని శరభాపురియుల ఆధీనంలో ఉందని విశ్వసిస్తారు.[19]

శరభాపురియులు ముందుగా గుప్తుల సామంతులుగా ఉన్నారు. వారు పుష్కరీ నాలాలతో పోరాడి ఉండవచ్చు.[20] వారు ప్రత్యేకమైన దక్షిణ కోసల కళ, వాస్తుశిల్పానికి పునాది వేశారు.[21]

దక్షిణకోసల పాండువంశీలకు మేకల పాండువంశీలతో సంబంధం కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రారంభంలో శరభపురియులకు సామంతులుగా పనిచేశారు.[22]రాజవంశం ప్రారంభ రాజులు వైష్ణవులు. కానీ దాని చివరి రాజు మహాశివగుప్తుడు బాలార్జున తనను తాను శైవుడు (పరమ-మహేశ్వర) గా పేర్కొన్నాడు. ఆయన బౌద్ధులను పోషించాడు. ఆయన పాలనలో చైనా యాత్రికుడు జువాన్జాంగు ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. ఆయన రాజ్యాన్ని ("కియావో-సా-లో" లేదా కోసల) ఈ క్రింది విధంగా వివరించాడు:[23]

"రాజధాని వైశాల్యం 40 లీ రౌండు; నేల సమృద్ధిగా, సారవంతమైనది, సమృద్ధిగా పంటలను ఇస్తుంది. [...] జనసాంధ్రత అధికంగా ఉంటుంది. పురుషులు పొడవైన, నలుపు రంగు గలవారుగా ఉన్నారు. ప్రజల స్వభావం కఠినమైనది, హింసాత్మకమైనది; వారు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు. ఇక్కడ మతవిశ్వాసులు, అవిశ్వాసులు ఇద్దరూ ఉన్నారు. వారు అధ్యయనపరులుగా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు. రాజు క్షత్రియ జాతికి చెందినవాడు; ఆయన బుద్ధుని నియమాలను ఎంతో గౌరవిస్తాడు. అతని ధర్మం, ప్రేమ చాలా ప్రసిద్ది చెందాయి. సుమారు వంద బౌద్ధ సంగారామాలు ఉన్నాయి. వాటిలో 10,000 మంది పూజారులు కంటే తక్కువగా ఉన్నారు; వారందరూ మహాయాన బోధనను ఒకే విధంగా అధ్యయనం చేస్తారు. సుమారు 70 దేవాలయాలు ఉన్నాయి. వేర్వేరు మతవిశ్వాసులు అధికంగా ఉంటారు. నగరానికి దక్షిణాన ఒక పాత సంగారామం ఉంది. దాని పక్కన అకోకా-రాజా నిర్మించిన ఒక స్థాపం ఉంది.

దక్షిణ కోసల పాండువంశీలు ప్రస్తుత ఒరిస్సాను పాలించిన తరువాత సోమవంశీ రాజవంశానికి సంబంధించినవారు కావచ్చు.[24]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nava Kishor Das (2012). Odisha. Seagull. p. 5. ISBN 978-81-7046-293-4. Dakshina Kosala is the territory now divided in the districts of Chhattisgarh and Sambalpur and neighbouring areas of western Odisha.
  2. Hira Lal 1986, p. 162-163.
  3. Hira Lal 1986, p. 163-165.
  4. 4.0 4.1 Hira Lal 1986, p. 161 footnote.
  5. 5.0 5.1 5.2 5.3 Hira Lal 1986, p. 162.
  6. Hira Lal 1986, pp. 161–162.
  7. 7.0 7.1 7.2 Hira Lal 1986, p. 163.
  8. Hira Lal 1986, p. 161:19 వ శతాబ్దంలో ఆర్కియాలజికలు సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు అలెగ్జాండరు కన్నిన్గ్హం దక్షిణ కోసలను మహాకోసల పర్యాయపదంగా పేర్కొన్నాడు. ఈ వాదనకు ఎటువంటి మూలాన్ని ప్రస్తావించబడలేదు."
  9. Madan Mohan Upadhyay (2005). Inscriptions of Mahakoshal: Resource for the History of Central India. B.R. pp. 2–3. ISBN 978-81-7646-496-3. Mahakoshal as a territorial unit synonymous with Kosala or Daksina Kosala (modern Chhattisgarh) has never appeared in the ancient Indian literature as well as epigraphs.
  10. Hira Lal 1986, pp. 165–166.
  11. Hira Lal 1986, p. 164.
  12. Hira Lal 1986, pp. 164–165.
  13. Mahabharata, Book 2, Chapter 30
  14. Hans T. Bakker 1994, p. 1.
  15. Hans T. Bakker 1994, pp. 1–2.
  16. Hans T. Bakker 1994, p. 3.
  17. Hans T. Bakker 1994, p. 5.
  18. Hans T. Bakker 1994, p. 6.
  19. Hans T. Bakker 1994, pp. 7–8.
  20. Hans T. Bakker 1994, p. 10.
  21. Hans T. Bakker 1994, p. 13.
  22. Hans T. Bakker 1994, p. 14.
  23. Hans T. Bakker 1994, p. 21.
  24. A. M. Shastri I 1995, pp. 172–175.

గ్రంధసూచిక

[మార్చు]

మూస:Tribes and kingdoms of the Mahabharata