Jump to content

దస్తగిరి అచ్చుకట్ల చిన్న

వికీపీడియా నుండి

దస్తగిరి అచ్చుకట్ల చిన్న తెలుగు రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

దస్తగిరి అచ్చుకట్ల చిన్న కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామంలో ఖాదర్‌బి, మహబూబ్‌ సాహెబ్‌ దంపతులకు 1939 జూన్ 15 న జన్మించారు. ఇతని కలంపేరు ఎసి దస్తగిరి. ఆయన భాషాప్రవీణ, పి.ఓ.ఎల్ చేసి, అధ్యాపకులుగా పనిచేసి, 1997లో పదవీ విరమణ పొందారు.

రచనా వ్యాసంగము

[మార్చు]

వీరు విద్యార్థిగా వున్నప్పుడే .... 'సుషమ' సాహిత్య మాసపత్రికకు సంపాదకత్వం వహిస్తూ, పద్యాలు రాస్తూ రచనా రంగంలో ప్రవేశించారు. 1961లో ప్రతాప వెంకటయ్య శాస్త్రితో కలసి 'వర్తమానం' పద్యకావ్యం ప్రచురించారు. అప్పటినుండి సాహిత్యసేవలో భాగంగా సాహిత్యసభలునిర్వహణ, అష్టావధానాలలో పాల్గొనడం, సాహిత్య-ధార్మిక ఉపన్యాసాలు చేయడంలో ఆసక్తి చూపడంతో పలు సాహిత్య ప్రసంగ వ్యాసాలు ఆకాశవాణి ద్వారా ప్రసారం అయ్యాయి.1973లో 'నవ్య సాహితీ సమితి' (ప్రొద్దుటూరు) స్థాపించి పలు సాహిత్య కార్యక్రమాల నిర్వహణ. కవులను, రచయితలను ప్రోత్సహిస్తూ పలువురి రచనలను నవ్య సాహితీ సమితి పక్షాన ప్రచురించి తోడ్పాటు అందించారు.

రచనలు

[మార్చు]

1. పద్యోపహరణము (1961)
2. వర్తమానం (1965)
3. అమృతమూర్తి
4. కవితా భారతి (పద్యకావ్యాలు)
5. మణి మంజూష (ఖండ కావ్యం).

ఈ రచనలలో 'అమృతమూర్తి' గుర్తింపు, ఖ్యాతిని తెచ్చిట్టింది. వీరి లక్ష్యం: సర్వమానవ సౌభ్రాతృత్వము -మానవతా దృష్టి-దేశభక్తి పెంపుదల దిశగా సాహిత్య కృషి.

మూలాల జాబితా

[మార్చు]
  • సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ రచించిన అక్షర శిల్పులు అనేగ్రంథము అక్షరశిల్పులు గ్రంథము: రచన సయ్యద్ నశీర్ అహమద్, ప్రచురణ సంవత్సరం 2010, ప్రచురణకర్త-- ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ .. చిరునామా వినుకొండ - 522647. పుట 59


అక్షర శిల్పులు
అజ్మతుల్లాచాంద్‌ బాషా పిబుడన్‌ సాహెబ్‌ షేక్‌బిందే అలీ సయ్యద్‌బషీరుద్దీన్‌ ముహమ్మద్‌షేక్‌ మహబూబ్ బాషబాషా షేక్‌బాషా ఎస్‌.ఎంషేక్ మహబూబ్‌ బాషా, నెల్లూరుషేక్ ఖాదర్‌బాషాసయ్యద్‌ హుసేన్‌ బాషాషేక్‌ బడే సాహెబ్‌, గుంటూరుషేక్‌ బడేసాహెబ్‌షేక్‌ బాబూజీ