Jump to content

దివ్య శ్రీపాద

వికీపీడియా నుండి
దివ్య శ్రీపాద
జననం
దివ్య దృష్టి

1996 సెప్టెంబరు 5
విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2019–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • శ్రీనివాస్ (తండ్రి)
  • సుధారాణి (తల్లి)

దివ్య శ్రీపాద (జననం 1996 సెప్టెంబరు 5) భారతీయ తెలుగు సినిమా నటి. 2019లో డియర్ కామ్రేడ్తో అరంగేట్రం చేసిన ఆమె 2022లో వచ్చిన స్వాతిముత్యం ఆమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆమె సెకండ్ హీరోయిన్, కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది.

బాల్యం

[మార్చు]

దివ్య శ్రీపాద ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో శ్రీనివాస్, సుధారాణి దంపతులకు 1996 సెప్టెంబరు 5న జన్మించింది.

కెరీర్

[మార్చు]

కలర్ ఫొటో (2020), మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020), హర్ష పులిపాక రచన, దర్శకత్వం వహించిన డ్రామా చిత్రం పంచతంత్రం, స్వాతి ముత్యం (2022) చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ఆమె విడుదలకు సిద్ధంగా ఉన్న యశోద (2022)లోనూ నటించింది. సమంత ముఖ్యపాత్రలో రూపొందిన ఈ థ్రిల్లర్ సినిమా దక్షిణభారత భాషల్లోనే కాక హిందీలోనూ విడదలవనుంది.

సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించి సునీల్‌, సుహాస్‌, చాందిని రావు, శ్రీ విద్యలతో పాటు దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ఓటీటీలో 2022 అక్టోబరు 22న విడులైంది.[1]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర గమనికలు మూ
2019 డియర్ కామ్రేడ్ అనిత గుర్తింపు పొందలేదు
2020 కలర్ ఫొటో పద్మజ దివ్య దృష్టి
మిస్ ఇండియా ప్రీతి
మిడిల్ క్లాస్ మెలోడీస్ గౌతమి అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది
2021 జాతి రత్నాలు జర్నలిస్ట్ దివ్య దృష్టిగా కీర్తించారు
హెడ్స్ అండ్ టేల్స్ మాంగ ప్రధాన పాత్ర; జీ5 చిత్రం
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ క్రిస్టీ సోనీ లైవ్ విడుదల
2022 గుడ్ లక్ సఖీ జ్యోతి అమెజాన్ ప్రైమ్ విడుదల
ఎఫ్ 3 విశాల్ మిత్తల్ కూతురు
స్వాతి ముత్యం శైలజ
యశోద లీల
పంచతంత్రం దేవి
2024 సుందరం మాస్టర్
మై డియర్ దొంగ

మూలాలు

[మార్చు]
  1. "Cinema news: ముగ్గురు అమ్మాయిల తలరాతలు.. హెడ్స్‌ అండ్‌ టేల్స్‌ ట్రైలర్‌ చూశారా?". web.archive.org. 2022-11-09. Archived from the original on 2022-11-09. Retrieved 2022-11-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)