Jump to content

నగరం (సినిమా)

వికీపీడియా నుండి
నగరం
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.సి.శ్రీనివాస్
తారాగణం జగపతి బాబు, అజయ్, ఆలీ, భువనేశ్వరి, బ్రహ్మానందం, కావేరీ ఝా, గుండు హనుమంతరావు
నిర్మాణ సంస్థ బ్లూ స్కై ఎంటర్ టైన్ మెంట్
విడుదల తేదీ 6 మార్చి 2008
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నగరం 2008 లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఎం. అంజిబాబు, పి. కిషోర్ బాబు మాక్ మీడియా-బ్లూ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. సిసి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్, జగపతి బాబు, కావేరి ఝా ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రం సంగీతం సమకూర్చాడు.[1].[2] [3] [4]

రైట్ ( శ్రీకాంత్ ) నగరంలో ప్రసిద్ధ రౌడీ. కానీ అతను చేసే మంచి పనులకు ప్రసిద్ధి చెందాడు. అతను ఒక ప్రత్యేక ముఠాను నడుపుతున్నాడు. పెద్ద డాన్ కాసిమ్ భాయ్ ( ప్రదీప్ రావత్ ) కు కుడి భుజంగా కూడా పనిచేస్తాడు. కాసిమ్ రైట్‌ను అతని ముఠానూ అవసరమైనప్పుడు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా ఉపయోగించుకుంటాడు. ఎసిపి చౌదరి ( జగపతి బాబు ) కోర్టులు, తీర్పులూ లాంటి విధానాల ద్వారా సమయాన్ని వృథా చేయకుండా నేరస్థులను నిర్మూలించడం ద్వారా తనదైన చట్టాన్ని అమలు చెయ్యడాన్నే నమ్ముతాడు. నవ్య ( కావేరి ఝా) పిహెచ్.డి విద్యార్థిని. రౌడీల జీవితాలపై పరిశోధన చేయాలనుకుంటుంది. ఆశ్చర్యకరంగా రైట్ జీవితంలోకి ప్రవేశించి అతడి ఇంట్లో ఆశ్రయం పొందుతుంది. అయితే, ఆమె వారి జీవితంలోకి ప్రవేశించిన తర్వాత విషయాలు మారుతాయి, ఇద్దరూ ప్రేమలో పడతారు. ఒక పరిస్థితిలో, రైట్, కాసిం ల మధ్య ఘర్షణ తలెత్తుతుంది. రైట్, కాసిమ్ కుమారుడు నాజర్ భాయ్ ( జి.వి. సుధాకర్ నాయుడు ) ను చంపేస్తాడు. కాని దురదృష్టవశాత్తు, రైట్ అనుచరుడు బాలు ( అజయ్ ) కూడా ముఠా పోరులో మరణిస్తాడు. బాలు మరణాన్ని చూసిన తరువాత, మంచివ్యక్తిగా మారాలని రైట్ నిర్ణయించుకుంటాడు. కాబట్టి వారు తమను తాము చౌదరికి లొంగిపోతాడు. అతను సాధారణ జీవితాన్ని గడపడానికి అవకాశం ఇస్తాడు. కొంత సమయం తరువాత, చౌదరిని బదిలీ చేస్తారు. అవినీతిపరుడైన ఎసిపి ( కళాభవన్ మణి ) ప్రవేశిస్తాడు. ACP, కాశింలు రైట్ జట్టులోని ప్రతి ఒక్కరినీ చంపేస్తారు, అతని సోదరి లావణ్య (మీనా) తో సహా. వారు రైట్‌ను ఎదుర్కోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, చౌదరి అతని రక్షణ కోసం తిరిగి వస్తాడు. ఇద్దరూ కలిసిపోయి క్లైమాక్స్‌లో దుష్టులను నిర్మూలిస్తారు

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."ఎదలోపల ఏదో దాహం"Bhakarbhatlaకౌసల్య6:14
2."వారెవ్వా వయసే గరం"వేటూరి ఉందరరామమూర్తిరవివర్మ, సాయి శీవాని5:00
3."అభీ అభీ"భాస్కరభట్లచక్రి, కౌసల్య4:59
4."హోషియారే హోషియారే"భువనచంద్రసునిధి చౌహాన్4:35
5."ట్రూ లైఫ్ కమాన్"భాస్కరభట్లచక్రి, రేవతి4:32
మొత్తం నిడివి:25:20

మూలాలు

[మార్చు]
  1. "Heading". IMDb.
  2. "Heading-2". Indiaglitz.
  3. "Heading-3". fullhyd.
  4. "Heading-4". gomolo. Archived from the original on 2018-10-24. Retrieved 2020-08-29.
  5. "Manisha Koirala turns item girl in Nagaram". Sify. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 29 ఆగస్టు 2020.
  6. Vardhan, G. P. Aditya (7 March 2008). "Avoid Nagaram at all cost". Rediff.com. Archived from the original on 13 July 2011. Retrieved 5 June 2016.