Jump to content

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి

వికీపీడియా నుండి
(నలమడ ఉత్తమకుమార్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
07 డిసెంబర్ 2023
గవర్నరు తమిళిసై సౌందరరాజన్
ముందు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు శానంపూడి సైది రెడ్డి
నియోజకవర్గం హుజూర్‌నగర్
పదవీ కాలం
2 జూన్ 2014 – 5 జూన్ 2019
ముందు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
తరువాత శానంపూడి సైది రెడ్డి
నియోజకవర్గం హుజూర్‌నగర్

పదవీ కాలం
6 జూన్ 2019 – 6 డిసెంబర్ 2023
ముందు గుత్తా సుఖేందర్ రెడ్డి
నియోజకవర్గం నల్గొండ

2వ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు
పదవీ కాలం
ఫిబ్రవరి 2015 – జూన్ 2021
ముందు పొన్నాల లక్ష్మయ్య
తరువాత రేవంత్ రెడ్డి

హౌసింగ్ & కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ మంత్రి
పదవీ కాలం
25 మే 2009 – 21 ఫిబ్రవరి 2014
ముందు బొత్స సత్యనారాయణ
తరువాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
పదవీ కాలం
2009 – 2014
ముందు నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది
నియోజకవర్గం హుజూర్‌నగర్
పదవీ కాలం
1999 – 2009
ముందు వేనేపల్లి చందర్ రావు
తరువాత వేనేపల్లి చందర్ రావు
నియోజకవర్గం కోదాడ

వ్యక్తిగత వివరాలు

జననం (1962-06-20) 1962 జూన్ 20 (వయసు 62)
తాటిపాముల, తిరుమలగిరి మండలం, సూర్యాపేట్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నలమాద పద్మావతిరెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి (జ. 1962 జూన్ 20) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై  2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, తెలంగాణ శాసనసభకు రెండు సార్లు,ఒకసారి పార్లమెంట్ లోక్సభకు సభ్యుడిగా,2023 డిసెంబర్ 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

అతను సూర్యాపేటలో 1962, జూన్ 20న జన్మించాడు. అతని తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణి. అతని స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల.[2] అతను బియస్సీ చేసాడు. అతను భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా తన సేవలనందించాడు. అతను ఎం.ఐ.జి 21, ఎం.ఐ.జి 23 విమానాలను నడిపాడు. అతను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు. [3]

రాజకీయ జీవితం

[మార్చు]

ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా 1994లో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. 2004 శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యాడు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశాడు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి గెలిచి అదే సంవత్సరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి పై 25,682 ఓట్ల మెజారిటీతో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు.[4] తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా 2015 నుండి 26 జూన్ 2021 వరకు పని చేశాడు.[5][6]

ఉత్తమ్ కుమార్ రెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7]

ఉత్తమ్ కుమార్ రెడ్డి 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా[8], డిసెంబర్ 24న కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమించారు.[9]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1994లో కాంగ్రెస్‌ తరఫున కోదాడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 1999, 2004 ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2009, 2014లో హుజూర్​నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో కిరణ్ కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో 2012 నుంచి 2014 వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి
  • 2014లో తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
  • 2015 మార్చి 2 నుంచి 2021[10] జూన్ 26 వరకు టీపీసీసీ అధ్యక్షుడు
  • 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • 2018లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక
  • 2023 ఎన్నికల్లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక
  • నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి 2023 డిసెంబర్ 7 - ప్రస్తుతం[11][12]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (8 December 2023). "ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
  2. Eenadu (4 November 2023). "ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి ఇక్కడే గెలిచారు". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
  3. "Huzurnaar MLA" Archived 2013-10-09 at the Wayback Machine. Andhra Pradesh MLA's Portal.
  4. "Housing Minister" Archived 2014-05-02 at the Wayback Machine. Andhra Pradesh MLAs Portal.
  5. http://indtoday.com/uttam-exhorts-party-cadre-to-re-capture-hyderabad-in-next-elections/
  6. సాక్షి, పాలిటిక్స్ (24 May 2019). "టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ గెలుపు". Sakshi. Archived from the original on 24 May 2019. Retrieved 25 October 2019.
  7. Namaste Telangana (8 December 2023). "12 మందితో కాంగ్రెస్‌ క్యాబినెట్‌". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  8. Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
  9. Sakshi (24 December 2023). "TS: ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ మంత్రుల నియామకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
  10. Sakshi (2 March 2015). "టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్: ఏఐసీసీ". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
  11. V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  12. ETV Bharat News (7 December 2023). "పార్టీకి నమ్మిన బంటు, ఆపత్కాలంలో ఆపద్బాంధవుడు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిదే". Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.