నల్గొండ ఐటీ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్గొండ ఐటీ టవర్
నల్గొండ ఐటీ టవర్
సాధారణ సమాచారం
రకంఐటీ టవర్
ప్రదేశంనల్గొండ, తెలంగాణ
నిర్మాణ ప్రారంభం2018, డిసెంబరు 31
పూర్తి చేయబడినది2023
ప్రారంభం2023, అక్టోబరు 2
వ్యయం100 కోట్లు
యజమానితెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ
సాంకేతిక విషయములు
నేల వైశాల్యం75,000 sq ft (7,000 m2)

నల్గొండ ఐటీ టవర్ అనేది తెలంగాణ రాష్ట్రం, నల్గొండ పట్టణంలో ఉన్న ఐటీ టవర్. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం, నల్గొండ పట్టణంలో 3 ఎకరాలలో 75వే చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 కోట్ల వ్యయంతో జీప్లస్‌ 3 అంతస్తులతో నిర్మించిన ఈ ఐటీ హబ్ 2023, అక్టోబరు 2న ప్రారంభించబడింది.[1]

శంకుస్థాపన[మార్చు]

2021 డిసెంబరు 28న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్గొండలో అభివృద్ధిపై సమీక్షించి సందర్భంలో నల్గొండలొ ఐటీ టవర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్​లోని పాలిటెక్నిక్ కళాశాల స్థలంలో ఐటీ టవర్ నిర్మాణానికి 2021 డిసెంబరు 31న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు భూమిపూజ చేశాడు.[2]

కంపెనీల ఏర్పాటు[మార్చు]

ఇందులో కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి దాదాపు 40 కంపెనీలు ఐటీ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతర్జాతీయ సంస్థ సోనాటాతో 2023 జూన్ లో ఒప్పందాన్ని జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్, ఆరోగ్య రంగం, లైఫ్ సైన్స్ రంగాల్లో సేవలు అందించేందుకు అవసరమైన సాప్ట్‌వేర్ డవలప్‌మెంట్, టెక్నాలజి, ఇన్నోవేషన్ల కోసం సోనాటా కార్యాకలాపాలను నిర్వహించనుంది. స్థానికంగా ఉండే సుమారు 200 మంది యవతకు ఈ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా ఈ ఐటీ టవర్ ద్వారా స్థానికంగా ఉండే సుమారు 2500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.[3]

ప్రారంభం[మార్చు]

2023, అక్టోబరు 2న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ ఐటీ హబ్ ను ప్రారంభించి, ఐటీ టవర్‌ లోపల పూజల అనంతరం అక్కడే ఏర్పాటుచేసిన శిలాఫలాకాన్ని ఆవిష్కరించాడు. అనంతరం వివిధ కంపెనీల్లో ఎంపికైనవారికి నియామక పత్రాలు అందజేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్య‌స‌భ ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన, వివిధ కంపెనీల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]

మూలాలు[మార్చు]

  1. "నల్గొండ సిగలో ఐటీ నగ". EENADU. 2023-08-30. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
  2. "Nalgonda IT Hub: సెప్టెంబరులో నల్గొండ ఐటీ హబ్ ప్రారంభోత్సవం". ETV Bharat News. 2023-08-31. Archived from the original on 2023-09-03. Retrieved 2023-09-03.
  3. Ashok (2023-07-04). "ప్రారంభానికి ముందే నల్గొండ ఐటి టవర్‌కు క్యూ కడుతున్న ఐటి సంస్థలు". Mana Telangana. Archived from the original on 2023-07-04. Retrieved 2023-09-03.
  4. ABN (2023-10-03). "ఆద్యంతం అట్టహాసం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-08.

వెలుపలి లంకెలు[మార్చు]