నాగలాపురం మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 13°23′17″N 79°47′46″E / 13.388°N 79.796°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | తిరుపతి జిల్లా |
| మండల కేంద్రం | నాగలాపురం |
| విస్తీర్ణం | |
• మొత్తం | 192 కి.మీ2 (74 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 34,026 |
| • సాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1030 |
నాగలాపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా 34 మండలాల్లో ఇది ఒకటి. ఇది శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ ఒక భాగం. ఈ మండలం చిత్తూరు జిల్లాలో భాగంగా ఉండేది, 2022 ఏప్రిల్ 4న కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో భాగంగా చేర్చబడింది.[3][4] మండల కేంద్రం అయిన నాగలాపురం సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి.మీ. దూరంలో, తిరుపతికి 70 వాయవ్యంగా కి.మీ. దూరంలో ఉంది.
మండల గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలంలోని జనాభా మొత్తం 33,886.అందులో పురుషులు 16,778 మంది కాగా, - స్త్రీలు 17,108 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 63.58% - పురుషులు అక్షరాస్యత రేటు 74.35% - స్త్రీలు అక్షరాస్యత రేటు 53.18%
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సదాశివ శంకరాపురం
- బీర కుప్పం
- త్రిపురాంతకపురం కోట
- కడివీడు
- వెల్లూరు
- కృష్ణాపురం
- కలంజేరి
- నాగలాపురం
- వెంబాకం
- బైటకొడియంబేడు
- కారణి
- సురుటుపల్లి
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]చరిత్ర
[మార్చు]15వ శతాబ్దంలో విజయనగర మహాసామ్రాజ్య చక్రవర్తి తుళువవంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ (గాజులవారి ఆడపడచు) జన్మించిన హరిగండపురం అనే గ్రామాన్ని, తానూ చిన్నతనం గడిపిన ఆ గ్రామాన్ని, తమ తల్లి పేర అభివృద్ధి చేయడంతో అప్పటినుండి ఈ పట్టణానికి నాగలాంబపురం, నాగలాపురం అని పేరు వచ్చింది.[మూలం అవసరం] అంతేకాకుండా, ఇది విజయనగర సామ్రాజ్య కాలం నాటి నిర్మాణాలతో కూడిన చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇది నాగేశ్వరస్వామి ఆలయం, శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం వంటి ఎన్నో చారిత్రక దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015
- ↑ Sasidhar, B. M. (2022-04-04). "Chittoor, Tirupati, Annamayya districts formed as part of rejig". The Hans India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-06.
- ↑ "Nivar impact: Water touches precarious levels in Chittoor reservoirs". The Hindu (in Indian English). 2020-11-26. ISSN 0971-751X. Retrieved 2022-04-12.
