నాని ‘గ్యాంగ్ లీడర్’

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాని'స్ గ్యాంగ్‌లీడర్
Gang Leader 2019 film poster.jpg
దర్శకత్వంవిక్రమ్ కుమార్
రచనవిక్రమ్ కుమార్
నిర్మాతమైత్రి మూవీ మేకర్స్
రవిశంకర్‌ యలమంచిలి
మోహన్ చెరుకూరి
నటవర్గం
ఛాయాగ్రహణంమీరోస్లా కూబా బ్రోజెక్
కూర్పునవీన్ నూలి
సంగీతంఅనిరుధ్ రవిచంద్రన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదారులుసరిగమ సినిమాస్ (నార్త్ అమెరికా)
విడుదల తేదీలు
2019 సెప్టెంబరు 13 (2019-09-13)
నిడివి
155 నిముషాలు [1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹25 కోట్లు[2]
వసూళ్ళు₹45 కోట్లు[2]

నాని'స్ గ్యాంగ్‌లీడర్ 2019 సెప్టెంబరు 13న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

కథ[మార్చు]

సిటీలో ఓ బ్యాంకులో 300 కోట్లు చోరీ జరుగుతుంది. ఈ బ్యాంక్‌దోపీడీ సందర్భంగా ఐదురుగు వ్యక్తులు చంపబడతారు. అదే స‌మ‌యంలో స‌ర‌స్వ‌తి అనే పెద్దావిడ‌ (ల‌క్ష్మి) త‌న కొడుకుని బ్యాంకు రాబ‌రీలో చంపేసిన వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి చనిపోయిన మిగిలిన న‌లుగురు మ‌హిళ‌ల సాయం కోరుతుంది. ఇంగ్లీష్‌ సినిమాల్లో కథల్ని కాపీ కొట్టి ప్రతీకార నవలలు రాస్తుంటాడు పెన్సిల్ పార్థసారథి (నాని). హాలీవుడ్ సినిమాల్ని చూసి వాటి ద్వారా న‌వ‌ల‌లు రాసుకుంటూ ఫేమ‌స్ రైట‌ర్‌గా చ‌లామ‌ణీ అవుతుంటాడు. తమకు జరిగిన అన్యాయం ఎదుర్కోవడానికి ఓ రివెంజ్‌ ప్లాన్‌ కావాలంటూ ఐదురుగురు మహిళలు అతని దగ్గరకు వస్తారు.

పెన్సిల్ ఈ రియల్‌ రివేంజ్‌ స్టోరిని కథగా రాసి భారీగా డబ్బు సంపాదించొచ్చన్న ఆశతో వారికి సాయం చేసేందుకు అంగీకరిస్తాడు. ఆ ఐదుగురు ఆడవాళ్లతో కలిసి పెన్సిల్ హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ కథకు ఇండియాస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ "దేవ్"‌ (కార్తికేయ గుమ్మకొండ)కు సంబంధం ఏంటి..? ఇంతకీ నాని ఆ ఆడవాళ్లకి ఎందుకు సాయం చేస్తున్నాడు ? వాళ్ల ప్రతీకారం ప్లాన్‌ను పార్థసారథి ఎలా రాశాడన్నది కథ.[3]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు[మార్చు]

పాటలు[మార్చు]

Untitled

ఈ సినిమాకు సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించాడు. పాటలు అనంత శ్రీరామ్, ఇన్నో జంగా రాశారు.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."రా రా (Roar of the Revengers)"అనంత శ్రీరాంపృథ్వి చంద్ర, బషర్ మాక్స్04:05
2."హొయ్నా హొయ్నా ..."అనంత శ్రీరామ్, ఇన్నో గెంగాఇన్నో గెంగా04:52
3."నిను చూసే ఆనందంలో"అనంత శ్రీరామ్సిద్ శ్రీరామ్05:33
4."గ్యాంగ్ -యూ లీడర్ (ప్రమోషనల్ సాంగ్ )"అనంత శ్రీరామ్అనిరుధ్ రవిచందర్03:28
బోనస్ ట్రాక్స్
సం.పాటగాయకులుపాట నిడివి
5."కథారాయడం రిప్రెస్"అనిరుధ్ రవిచందర్03:02

మూలాలు[మార్చు]

  1. "GANG LEADER". British Board of Film Classification. Archived from the original on 2019-10-11. Retrieved 2021-04-17.
  2. 2.0 2.1 "2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే." Sakshi. 2019-12-31. Retrieved 2021-04-17.
  3. Sakshi (13 September 2019). "'నాని గ్యాంగ్‌ లీడర్‌' మూవీ రివ్యూ". Archived from the original on 20 అక్టోబరు 2020. Retrieved 17 April 2021.