పల్లవి శారద

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లవి శారద
జననం (1990-03-05) 1990 మార్చి 5 (వయసు 34)
పెర్త్, పశ్చిమ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా
జాతీయతఆస్ట్రేలియన్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం
తల్లిదండ్రులుహేమ శారదా
నలిన్ శారదా

పల్లవి శారద (ఆంగ్లం: Pallavi Sharda; జననం 1990 మార్చి 5) ఒక ఆస్ట్రేలియన్ నటి. ఆమె భారత సంతతికి చెందిన భరతనాట్యం నర్తకి.[1] అకాడమీ అవార్డుకు నామినేట్ చేయబడిన చిత్రం లయన్ (2016)లో ఆమె తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొన్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా $140 మిలియన్ లని వసూలు చేసి వాణిజ్యపరంగా కూడా జయప్రదం అయ్యింది. ఆస్ట్రేలియన్ చలనచిత్ర రంగంలో ఇది ఒక రికార్డుగా మిగిలిపోయింది.

ఆమె హిందీ భాషా చిత్రాలైన బేషరం (2013), హవాయిజాదా (2015), బేగం జాన్ (2017)లలో కూడా నటించింది. ఆమె ఆస్ట్రేలియన్ చిత్రం సేవ్ యువర్ లెగ్స్! (2012), ఆస్ట్రేలియన్ టెలిసిరీస్ లెస్ నార్టన్ (2019)లలోనూ నటించింది. ఆమె టామ్ అండ్ జెర్రీ (2021), అమెరికన్ చిత్రం రోమ్-కామ్ వెడ్డింగ్ సీజన్‌ (2022)లలో నటించింది.

ప్రారంభ జీవితం[మార్చు]

పల్లవి శారద పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో భారతీయ కుటుంబంలో హేమ శారదా, నలిన్ కాంత్ శారదా దంపతులకు జన్మించింది.[2] ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ భారతదేశంలోని ముంబై, ఢిల్లీ నగరాలలోని చెం ఐఐటి పూర్వ విద్యార్థులు.[3][4] వీరివురు సైన్స్ లండ్ ఇంజనీరింగ్‌లో పి.హెచ్.డిలు కలిగి ఉన్నారు. ఆమె పుట్టకముందే వారు 1980లలో ఆస్ట్రేలియాకు వలస వెళ్ళారు.[5][6] పల్లవి శారద పసిపిల్లగా మెల్‌బోర్న్‌కి వచ్చింది, అక్కడ ఆమె వాయువ్య శివారు ప్రాంతాల్లో పెరిగింది.[7] ఆమె ఎస్సెండన్‌లోని లోథర్ హాల్ ఆంగ్లికన్ గ్రామర్ స్కూల్ వెళ్లి అక్కడ అకడమిక్ స్కాలర్‌షిప్ పొందింది. 16 సంవత్సరాల వయస్సులో ఆమె మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి, బిఎ (మీడియా & కమ్యూనికేషన్స్) డిగ్రీ పట్టాపుచ్చుకుంది. అలాగే, ఆమె డిప్లొమా ఇన్ మోడరన్ లాంగ్వేజెస్ (ఫ్రెంచ్) పూర్తిచేసింది. ఆమె 2013లో మెల్బోర్న్ నుండి ముంబైకి స్థావరాన్ని మార్చింది.[8]

కెరీర్[మార్చు]

కరణ్ జోహార్ మై నేమ్ ఈజ్ ఖాన్ (2010)లో అతిధి పాత్రలో నటించడం ద్వారా పల్లవి శారద తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించింది. మార్చి 2010లో సిడ్నీలో జరిగిన మిస్ ఇండియా ఆస్ట్రేలియా కిరీటాన్ని ఆమె గెలుచుకుంది.[9][10][11][12] ఆమె తరువాత హాస్య-నాటక చిత్రం, దస్ తోలా (2010)లో నటుడు మనోజ్ బాజ్‌పేయి సరసన నటించింది. ఇందులో ఆమె పల్లెటూరి నృత్య ఉపాధ్యాయురాలు గీత పాత్రను పోషించింది. ఆమె నటనను ది టైమ్స్ ఆఫ్ ఇండియా కీర్తించింది.[13] 2011, 2012లలో ఆమె థియేట్రికల్ మ్యూజికల్, తాజ్ ఎక్స్‌ప్రెస్‌కి శ్రుతి మర్చంట్ దర్శకత్వం వహించగా, వైభవీ మర్చంట్ కొరియోగ్రఫీలో ప్రధాన నటిగా చేసింది.[14]

ఆమె 2013 ఫిబ్రవరి 28న విడుదలైన హాస్య చిత్రం సేవ్ యువర్ లెగ్స్‌తో ఆస్ట్రేలియన్ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.[15] ఆ తర్వాత ఆమె అభినవ్ కశ్యప్ బాలీవుడ్ చిత్రం బేషరమ్‌లో నటించింది.[16] ఆ తరువాత, ఆమె బాలీవుడ్ వెంచర్, హవాయిజాద 2015 జనవరి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనికి విభు పూరి దర్శకత్వం వహించగా, ఆయుష్మాన్ ఖురానా, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో ఆమె ముంబైలో బ్రిటీష్ రాజ్ కాలంలో వేశ్య నర్తకి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[17]

ఆమె 2016 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో వాఖ్యాతగా సోనీ ఇఎస్పిఎన్ (Sony ESPN) జట్టులో చేరింది.[18] అదే సంవత్సరం, ఆమె హాలీవుడ్ చిత్రం లయన్‌లో దేవ్ పటేల్, నికోల్ కిడ్‌మాన్‌(Nicole Kidman)లతో కలిసి నటించింది. ఆమె తదుపరి బాలీవుడ్ చిత్రం బేగం జాన్ ఏప్రిల్ 2017లో విడుదలైంది.[19] ఇందులో, ఆమె భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన సమయంలో గ్రామీణ పంజాబ్‌లోని సెక్స్ వర్కర్ గులాబో పాత్రను పోషించినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.[20] ఆమె ఎబిసి(ABC Television) ఆస్ట్రేలియా మెడికల్ డ్రామా చిత్రం పల్స్‌లో ప్రముఖ పాత్ర పోషించింది, ఆమె నటనకు ఆస్ట్రేలియా కాస్టింగ్ గిల్డ్ "రైజింగ్ స్టార్" అవార్డును ప్రదానం చేసింది.[21] ఆమె ఎబిసి టీవి సిరీస్ లెస్ నార్టన్‌లో జార్జి పాత్రను పోషించింది. ఆమె గురిందర్ చద్దా దర్శకత్వం వహించిన ఐటీవి (ITV) హిస్టారికల్ డ్రామా సిరీస్, ఎబిసి టీవి కామెడీ రెట్రోగ్రేడ్‌లో బీచమ్ హౌస్‌లలో నటిస్తోంది.[22][23]

ఇక రచయతగా ఆమె తన మొదటి పుస్తకం పని మొదలు పెట్టింది, ప్రస్తుతం ఇంకా పేరు పెట్టబడలేదు, ఇది ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ అమ్మాయిగా తన గుర్తింపు పోరాటాలను అన్వేషిస్తుంది.[24]

మూలాలు[మార్చు]

 1. Banerjee, Debesh (19 October 2010). "Building on Bollywood". The Indian Express. Retrieved 6 January 2022.
 2. "I always regretted not being born in India: Pallavi Sharda". The Times of India (in ఇంగ్లీష్). 29 August 2013. Retrieved 17 June 2022.
 3. "UWA Staff Profile : The University of Western Australia : The University of Western Australia". Uwa.edu.au. Archived from the original on 29 September 2013. Retrieved 27 February 2015.
 4. Nalin Kant Sharda. "Dr.Nalin Kant Sharda". Nalinsharda.com. Archived from the original on 9 October 2013. Retrieved 27 February 2015.
 5. "I always regretted not being born in India: Pallavi Sharda". The Times of India. Archived from the original on 29 August 2013. Retrieved 27 February 2015.
 6. "Pallavi Sharda – Ranbir's new leading lady". The Times of India. Archived from the original on 28 September 2013. Retrieved 27 February 2015.
 7. "PROFILE: Pallavi Sharda living Bollywood dream". Brimbank Weekly. Archived from the original on 17 December 2013. Retrieved 19 November 2013.
 8. [1] Archived 17 మే 2013 at the Wayback Machine
 9. "Pallavi Sharda, Miss India Australia 2010, Photo Gallery – Official Miss India Australia Site – Est. 2001". 18 November 2013. Archived from the original on 19 August 2017. Retrieved 19 August 2017.
 10. Pallavi Sharda Interview | On Making It in Bollywood, Besharam, and Her Big Hollywood Plans Ep. 44 (in ఇంగ్లీష్), archived from the original on 6 January 2022, retrieved 2 April 2021
 11. "I always wanted to dance in Bollywood". Hindustan Times. 22 October 2010. Archived from the original on 25 January 2013. Retrieved 27 February 2015.
 12. "Who is Pallavi Sharda?". The Indian Express. 1 October 2013. Archived from the original on 5 January 2014. Retrieved 27 February 2015.
 13. "Dus Tola Movie Review, Trailer, & Show timings at Times of India". The Times of India. Archived from the original on 6 November 2010. Retrieved 27 February 2015.
 14. "Aboard the Taj Express". The Indian Express. 27 June 2011. Archived from the original on 16 September 2013. Retrieved 27 February 2015.
 15. "Pallavi Sharda spreads her wings back home". Herald Sun. Retrieved 27 February 2015.
 16. Thakkar, Mehul (16 August 2013). "Ranbir Kapoor juggling between the Kashyap brothers". The Times of India. Archived from the original on 19 August 2013. Retrieved 27 February 2015.
 17. "'Hawaizaada': A dreamlike masterpiece about a dreamer". The Economic Times. 4 February 2015. Archived from the original on 31 October 2016. Retrieved 19 July 2016.
 18. "IPL 2016: Rochelle Rao and Pallavi Sharda to anchor 'Extraaa Innings T20". Sportskeeda.com. 5 April 2016. Archived from the original on 11 April 2016. Retrieved 19 August 2017.
 19. "Srijit shares picture of his Begum Jaan brigade". The Times of India. Archived from the original on 24 July 2016. Retrieved 19 August 2017.
 20. "Begum Jaan movie review LIVE: All bow down to Vidya Balan, the begum who means business". Firstpost.com. 13 April 2017. Archived from the original on 26 June 2017. Retrieved 19 August 2017.
 21. "Home". If.com.au. Archived from the original on 10 July 2017. Retrieved 19 August 2017.
 22. "Pallavi Sharda plays a princess in Gurinder Chadha's period drama". The Times of India. 9 October 2018. Archived from the original on 9 October 2018. Retrieved 10 October 2018.
 23. "Pallavi Sharda happy to work with Gurinder Chadha". The Times of India. Archived from the original on 10 October 2018. Retrieved 10 October 2018.
 24. Pallavi Sharda Interview | On Making It in Bollywood, Besharam, and Her Big Hollywood Plans Ep. 44 (in ఇంగ్లీష్), archived from the original on 6 January 2022, retrieved 2 April 2021