ప్రజా రాజ్యం (1983 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రజా రాజ్యం
దర్శకత్వంఎం. మల్లికార్జునరావు
రచనపరుచూరి సోదరులు (కథ, మాటలు), జి. హనుమంతరావు (చిత్రానువాదం)
నిర్మాతజి. నాగరత్నమ్మ
తారాగణంకృష్ణ,
జయప్రద
ఛాయాగ్రహణంపుష్పాల గోపీకృష్ణ
కూర్పుకోటగిరి గోపాలరావు
సంగీతంజె. వి. రాఘవులు
నిర్మాణ
సంస్థలు
రత్న మూవీస్, పద్మాలయా స్టూడియోస్ (సమర్పణ)
విడుదల తేదీ
సెప్టెంబరు 29, 1983 (1983-09-29)[1]
భాషతెలుగు

ప్రజారాజ్యం 1983 లో ఎం. మల్లికార్జునరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో కృష్ణ, జయప్రద ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ పతాకంపై జి. నాగరత్నమ్మ పద్మాలయా స్టూడియోస్ సమర్పణలో నిర్మించింది. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి సోదరులు సమకూర్చారు. జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.

శివరామయ్య, రాఘవయ్య అన్నదమ్ములు. వీరి బావమరిది రాజారావు ఆలయ ధర్మకర్త అయిఉండీ గుళ్ళో నగలు దొంగిలిస్తాడు. ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు శివరామయ్య, రాఘవయ్యలు అతన్ని ధర్మకర్త పదవి నుండి తొలగిస్తారు. దాంతో వాళ్ళతో బాంధవ్యం తెంచుకుంటాడు రాజారావు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక సిబ్బంది

[మార్చు]
  • దర్శకత్వం: ఎం. మల్లికార్జునరావు
  • కథ, మాటలు: పరుచూరి సోదరులు
  • చిత్రానువాదం: జి. హనుమంతరావు
  • సంగీతం: జె. వి. రాఘవులు
  • కళ: శ్రీనివాసరాజు
  • నృత్యం: శ్రీనివాస్
  • కూర్పు: కోటగిరి గోపాలరావు
  • కెమెరా: పుష్పాల గోపీకృష్ణ
  • థ్రిల్స్: రాజు

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి జె. వి. రాఘవులు సంగీత దర్శకత్వం వహించాడు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పాటలు పాడారు. వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.[2]

  • అమ్మాయి అమ్మాయి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • హేహే గుక్కేసి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • ఒంటరి తుంటరి కుర్రదానా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • గోపాలుడవటే గోపెమ్మా, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం, పి సుశీల
  • కదలండి కదలండి., గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

మూలాలు

[మార్చు]
  1. "Praja Rajyam (1983)". Indiancine.ma. Retrieved 2020-09-08.
  2. "Praja Rajyam(1983), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-09-08.[permanent dead link]