"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== సినీరంగ ప్రస్థానం ==
తన స్నేహితుడు, నిర్మాత వి.బి.రాజేందప్రసాద్‍ నుంచి ‘అన్నపూర్ణ’ లో నటించాలని పిలుపు రావడంతో మద్రాస్‍ వెళ్లాడు. కాని, ఆ వేషం దక్కలేదు. డబ్బింగ్‍ కళాకారుడిగా ప్రయత్నాలు ప్రారంభించారు. ‘పార్వతీ కళ్యాణం’ లోని శివుడి పాత్రకి డబ్బింగ్‍ చెప్పి తొలి సంపాదనగా రూ.500 పొందారు. ఆ తర్వాత నటుడిగా కూడా అవకాశాలు సొంతం చేసుకొన్నారు. నిర్మాత కాక ముందు ఆయన నటుడిగా సినీ ప్రస్థానాన్ని ఆరంభించారు. [[రణభేరి]], [[నేరము శిక్ష]], [[బంగారు బాబు (1973 సినిమా)|బంగారు బాబు]], [[మానవుడు - దానవుడు (1972 సినిమా)|మానవుడు దానవుడు]], [[చిననాటి స్నేహితులు]] తదితర చిత్రాల్లో నటించారు.
 
1962 నుంచి 1974 మధ్య కాలంలో సుమారు 30 సినిమాల్లో నటించారు. వంద చిత్రాలకి పైగా డబ్బింగ్‍ చెప్పారు. ఆ తర్వాత కాకినాడకి చెందిన భాస్కరరెడ్డి, రామకృష్ణారెడ్డి, లచ్చిరెడ్డి, వీర్రాజులతో కలిసి ‘వెంకటేశ్వర కల్యాణం’అనే చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాకి లాభాలు రావడంతో ఆ నలుగురూ కలిసి గీతాకృష్ణ కంబైన్స్ అనే సంస్థని ప్రారంభించి నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిద నాగేశ్వరరావుకి అప్పగించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1771915" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ