Jump to content

ఫీనిక్స్ నగరం

అక్షాంశ రేఖాంశాలు: 33°26′54″N 112°04′26″W / 33.44833°N 112.07389°W / 33.44833; -112.07389
వికీపీడియా నుండి
(ఫీనిక్స్ (నగరం) నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:Phoenix-logo.svg

Phoenix, Arizona
డౌన్ టౌన్ ఫీనిక్స్
డౌన్ టౌన్ ఫీనిక్స్
డౌన్ టౌన్ ఫీనిక్స్
ముద్దు పేరు:
Valley of the Sun, The Valley, PHX, The 602, Bird City, P-town[1][2]
Location in Maricopa County and the state of అరిజోనా
Location in Maricopa County and the state of అరిజోనా
Location in Maricopa County and the state of అరిజోనా
అక్షాంశరేఖాంశాలు: 33°26′54″N 112°04′26″W / 33.44833°N 112.07389°W / 33.44833; -112.07389
Country అమెరికా
State ఆరిజోనా
County Maricopa
Incorporated ఫిబ్రవరి 5, 1881
ప్రభుత్వం
 - Type Council-Manager
 - మేయర్ Phil Gordon (D)
వైశాల్యము
 - City 1,334.1 km² (517.17 sq mi)
 - భూమి 1,334.1 km² (517.126 sq mi)
 - నీరు 0.6 km² (0.2 sq mi)
ఎత్తు 340 m (1,117 ft)
జనాభా (2007)[3][4][5]
 - City 15,52,259 (US rank : 5th)
 - సాంద్రత 1,188.4/km2 (2,937.8/sq mi)
 - మెట్రో 4,281,899 (US Census, July, 2,008 est.)
 - Demonym Phoenician ఫినీసియన్
కాలాంశం MST (UTC-7)
 - Summer (DST) no DST (UTC-7)
Area code(s) 602, 480, 623, 520
FIPS code 04-55000
వెబ్‌సైటు: http://www.phoenix.gov/

ఆరిజోనా రాష్ట్రంలోని అతిపెద్ద నగరం 'ఫీనిక్స్ (Phoenix)'. అంతేకాక ఇది అరిజోనా రాష్ట్ర రాజధాని కూడా. అలాగే అమెరికా నగరాలలో జనసాంధ్రతలో 5వ స్థానంలో ఉంది.నగరంలోని నివాసితుల సంఖ్య 1,552,259. ఫీనిక్స్ నగరపాలనా ప్రదేశంలో ఫీనిక్స్ నగరం ప్రధాన కేంద్రం. నగరపాలిత ప్రదేశంలో నివాసితుల సంఖ్య 4,281,899. అమెరికాలో ఇది 12వ స్థానంలో ఉన్న నగరపాలితం.మారికోపా కౌంటీకి ఫీనిక్స్ నరమే కౌంటీ నియోజకవర్గం. ఈ ఫీనిక్స్ నగరం దేశంలో అతిపెద్ద భూభాగం ఉన్న నగరం.

సాల్ట్ రివర్ సమీపంలో 1868లో స్థాపించబడిన ఈ నగరానికి నగరపాలన హోదా 1881లో లభించింది. ఫీనిక్స్ ఉత్తర అమెరికాలోని ప్రధాన రవాణా కేంద్రం. అగ్నేయ అమెరికా యొక్క ప్రధాన ఆర్థిక, రవాణా, పారిశ్రామిక, సాంస్కృతిక కేంద్రం ఫీనిక్స్ నగరం. నగరం గుర్తించతగిన రాజకీయ సంస్కృతిని కలిగి ఉంది. ఒకప్పుడు ఇది రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలా ఉండేది. ఫీనిక్స్ నగరం రాజకీయంలో హేమామీలైన అనేకనాయకులకు పుట్టిల్లు. వారిలో బారీ గోల్డ్ వాటర్, విలియమ్ రెహ్క్విస్ట్, జాన్ మెకైన్,జానెట్ నెపోలిటానో,కార్న్ హైడెన్, సాంద్ర ఓ కోన్నర్ ప్రసిద్ధులు.

సొనోరన్ ఎడారి ఈశాన్యంలో ఉపస్థితమైన ఈ నగరం అమెరికా నగరాలలోనే అసాదారణ వాతావరణానికి పేరుపొందింది. సంవత్సరంలో అయిదు నెలల కాలం ఉష్ణోగ్రత 100 ఫారెన్‌హీట్ ఉంటుంది. ఒక్కోసారి 120 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు చేరడం కద్దు.

చరిత్ర

[మార్చు]

స్థానిక అమెరికా కాలం

[మార్చు]

1000 సంవత్సరాల కంటే మునుపే ఈ ప్రాంతం హోహోకామ్ ప్రజలచే ఆక్రమించబడి ఆ తరువాతి కాలంలో క్రమంగా ఫీనిక్స్ నగరంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ హోనిక్స్ ప్రజలు 135 మైళ్ళ పొడవున వ్యవసాయ కాలువలను నిర్మించడం వలన ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. ఈ కాలువ మార్గం ఆధునిక అరిజోనా కాలువ నిర్మాణానికి ఉపయోగపడింది. ఈ కాలువ మార్గం ప్రస్తుతం సెంట్రల్ అరిజోనా సెంట్రల్ కెనాల్ , ది హైడెన్-రోహ్డ్స్ అక్విడక్ట్గా రూపుదిద్దుకుంది. హోహోకామ్ ప్రజలు పరిసరాలలో ఉన్న అనాసాకి మొగొల్లాన్, మెసోమెరికన్ తెగతో విశేషంగా వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. 1300 నుండి 1450 ల మధ్య కాలంలో హోహోకామ్ ప్రజలు ఇక్కడ నివసించినట్లు విశ్వసించబడుతుంది. ఆ తరువాత కాలంలో సంభవించిన కరువు కాటకాలు, వరదలు హోహోకామ్ ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి ప్రధాన కారణమైంది. ప్రాచీన సంతతి వారు నగర వెలుపలి ప్రాంతానికి తరలి వెళ్ళడానికి అకిమెల్ ఊధమ్ ఒప్పందం కారణమని భావించపడుతుంది. నగర వెలుపలి ప్రాంతానికి తరలి వెళ్ళిన హూహూకామ్ ప్రజలు, గిలా నది తీరంలో కేంద్రీకృతమైన తోనో ఊధమ్, మారికోపా ప్రజలు ఇందుకు తార్కాణం. కొన్ని కుటుంబాలు సమూహంగా సాల్ట్ రివర్ ప్రాంతంలో నివసిస్తున్నా పెద్ద పెద్ద పల్లెల్లు మాత్రం ఇప్పటికి సజీవంగా లేవు.

హిస్పానిక్ కాలం

[మార్చు]

స్పానిష్ ప్రభుత్వ సేవలో ఒక భాగంగా ఫాదర్ కినో, ఇటాలియన్ జెసూట్ 1600 నుండి 1700 వ శతాబ్ధాల మధ్య ఇక్కడకు ప్రయాణించిన మొదటి యూరప్ దేశస్థులు. ఆ కాలంలో ఈ లోయ న్యూ స్పెయిన్ పరిపాలిత భూభాగంలో భాగమే. ఇది స్పెయిన్ అధీనం నుండి తరువాతి కాలంలో స్వతంత్ర మెక్సికోలో ఒక భాగమైంది. ఫాదర్ కినో ఈ నదికి రివర్ సలాడో (సాల్ట్ రివర్) అని నామకరణం చేసాడు. ఇందుకు ఈ నదీ జలాలు అధిక లవణసాంద్రత కలిగి ఉండటమే అందుకు కారణం. ఆయన అక్కడ మిగిలి ఉన్న ప్రజలతో కలసి పనిచేసినా దక్షిణ అరిజోనాలో విస్తరిస్తున్న పిమా మిషనరీకి ముఖ్యత్వం ఇచ్చాడు. అలాగే ఆగ్నేయ, కాలిఫోర్నియాలో నూతన భాభాగం కోసం శోధించడంలో కృషి సాగించాడు. దక్షిణ అరిజోనా మాత్రమే హిస్పానిక్ హిస్పానికులకు ప్రధాన నివాసమైంది. కొన్ని శతాభ్దాల కాలం సాల్ట్ రివర్ ప్రాంతం నిర్జనంగానే మిగిలి పోయింది.

అమెరికా సంయుక్తరాష్ట్రాల ప్రారంభ కాలం

[మార్చు]
Downtown Phoenix from an airplane, 2011

19వ శతాబ్ధంలో ప్రస్తుత మధ్య అరిజోనా ప్రాంతాన్ని శోధించి చేరుకున్న అమెరికా, యూరప్ దేశకొండజాతి ప్రజలు ఫీనిక్స్ నగరం మార్గంలో ప్రయాణించినట్లు విశ్వసించబడుతుంది. నీరు లభ్యమై వాతావరణం అనుకూలించినప్పుడు ఇక్కడ జింకలు, గుడ్లగూబలు ఇతర జంతువులనూ వారు చూసారు.

మెక్సికన్ - అమెరికన్ యుద్ధం ముగుసిన తరువాత కాలంలో అధిక ఉత్తర మెక్సికన్ భాగం అమెరికా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఫీనిక్స్ నగరంతో కలసి ఈ భూభాగం కొంతకాలం న్యూ మెక్సికన్ టెర్రిటరీగా గుర్తించబడింది. 1853లో ఈ ప్రాంతాన్ని గాడ్సన్ పర్చేస్ పేరుతో అమెరికా ప్రభుత్వం ఊపందం మూలంగా స్వాధీన పరచుకుంది. టక్సన్ ని రాజధానిగా చేసుకుని సదరన్ సానుభూతిపరులు అరిజోనాలోని కొంత ప్రాంతాన్ని చేర్చి కాన్ఫిడరేట్ అరిజోనా టెర్రిటరీ పేరుతో తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ప్రస్తుతం ప్రెస్ కాట్, అరిజోనాగా ఉన్న అప్పటి ఫోర్ట్ విపిల్ నగరాన్ని రాజధానిగా చేసుకుని అప్పటి అమెరికా కాంగ్రెస్ 1863లో అరిజోనా టెర్రిటరీని రూపుదిద్దింది. సాల్ట్ రివర్ తీరం వరకు అరిజోనా భూగమైంది. ఈ ప్రాంతం మిలటిరీ ప్రాముఖ్యాన్ని సంతరించుకోలేదు. యుద్ధానికి సాక్షిగా నిలబడలేదు.

ప్రస్తుతం మారికోపా కౌంటీగా గుర్తించబడుతున్న ప్రదేశం 1863లో అప్పటి గనుల నగరమైన వికెన్ బర్గ్ గా అవతరించిందిప్పుడు ఈ నియోజక వర్గం ప్రెస్ కాట్ టౌన్ తో కలసి యవాకోపై కౌంటీగా ఉండేది. 1865 యు ఎస్ ఆర్మీ యార్డే నదీతీరంలో మెక్‌డ్వెల్ ఓడరేవును నిర్మించింది. హోహోకామ్‌ ప్రజలు ఈప్రాంతాన్ని విడిచి వెళ్ళిన తరువాత రేవు నిర్మాణంలో పనిచేస్తున్న హిస్పానిక్ స్థానికిలు 1866 సాల్ట్ నదీ ఏరపరుచుకున్న తాత్కాలిక నివాసాలు ఈ ప్రదేశంలో స్థిరనివాసాలు ఏర్పడటానికి నాందీ అయింది. ఆ తరువాత ఈ లోయప్రాంతంలో సమీపంగా ఏర్పరుచుకున్న ఇతర ఒప్పందాల కారణంగా ఏర్పడిన నివాసాల సంఘటిత రూపం టెంప్ నగరంగా మారింది. కానీ ఫీనిక్స్ నగరంగా మాఇన తరువాతనే ఇది నగరపాలనా వ్యవస్థగా మారింది.

ఫీనిక్స్ నగరస్థాపన

[మార్చు]

ఫీనిక్స్ నగర చరిత్ర అమెరికా అంతర్యుద్ధం‌లో పనిచేసిన జాక్‌స్విల్లింగ్చే ఆరంభమైంది. ఆయన 1850 సంపదను వెతుక్కుంటూ వెళ్ళి మొదట వికెన్‌బర్గ్లో పనిచేసాడు. 1867లో అక్కడి నుంచి బయటబడి వైట్ టాంక్ మౌంటెన్ క్రింది భాగంలో విశ్రాంతి కోసం ఆగినప్పుడు స్విల్లింగ్ అక్కడి ప్రదేశాన్ని పరిశీలించి అది అభివృద్ధి చేయటానికి అనువైన ప్రదేశంగా భావించాడు. అప్పటికే మెక్‌డ్వెల్ రేవు నిర్మాణంతో కొంత అభివృద్ధి చెంది ఉంది. ప్రదేశం,వాతావరణం అనుకూలంగా ఉందని నిరంతర నీటి సరఫరా ఉంటే అభివృద్ధి సాద్యమని అభిప్రాయపడ్డాడు. హోహోకామ్ ప్రజలు వదిలి వెళ్ళిన శిథిలాలు కాలువల రూపురేఖలను రేఖలను పరిశీలించి వాటిని పునరుద్దరిస్తే చక్కటి నీటి పారుదల సాధ్యమని స్విల్లింగ్ ఊహించాడు.

Radio program written and performed in Phoenix, Arizona, by children of Junior Artists Club (Federal Arts Program, 1935).

స్థానిక అమెరికన్‌ల పద్ధతిలో పలు కాలువలు నిర్మించాడు. క్రమంగా నదీతీరంలో నాలుగు మైళ్ళ విస్తీర్ణంలో చిన్న సమూహంతో కూడిన స్థిరనివాసాలూ ఏర్పడ్డాయి. ఇక్కడి కాలువల ప్రక్కన విస్తారంగా అతిపెద్ద ఆకారంలో పండిన గుమ్మడికాయల కారణంగా ఈ ప్రదేశానికి మొదటిగా పంప్‌కిన్ సిటీ (గుమ్మడికాయల నగరం)అని పిలవడం ఆరంభం అయింది. ఆతరువాత నిర్మించబడిన స్విల్లింగ్ మిల్లు కారణంగా హెల్లింగ్ మిల్ల్, మిల్‌ సిటీగా పిలువబడింది. చివరికి ఈస్ట్ ఫీనిక్స్‌గా పిలువబడింది. కాన్ఫిడరేట్‌కి చెందిన పూర్వ సైనికుడు జనరల్ స్టోన్‌వాల్ జాక్‌సన్గౌరవార్ధం స్విల్లింగ్ ఈ ప్రదేశానికి స్టోన్‌వాల్ సిటీ అని నామకరణం చేయాలని భావించాడు. ఇతరులు సలైనా అని పేరు సూచించారు. కానీ ఈపేర్లేవీ సమూహంచే అంగీకారం పొందలేదు. ఆఖరిగా లార్డ్ దారెల్ డుప్పా అక్కడి స్థానికులు వదిలి వెల్లిన శిథిలాల నుండి ఈ ప్రదేశం పునరుద్ధరింపబడిన దానికి గుర్తుగా ఫీనిక్స్ అని పేరు సూచించాడు. ఆ పేరు అందరి ఆమోదం పొంది స్థిరపడింది. ఆ ప్రదేశానికి చుట్టూ విస్తరించి ఉన్న యవాకోపీ కౌంటీకి చెందిన పర్యవేక్షకులు ఈ ప్రదేశాన్ని 1868, మే 4వ తారీఖున ఎన్నికల నియోజకవర్గంగా గుర్తించబడింది. జాన్ స్విల్లింగ్ పోస్ట్ మాస్టర్‌గా ఇక్కడ 1868, జూన్ 15న తపాలా కార్యాలయం ఆరంభించబడింది. నివాసితులు సంఖ్య అభివృద్ధి చెందుతున్న కారణంగా (అమెరికా జనాభా గణాంకాలు నిర్ధారించి జనసంఖ్య 240)పట్టణ నిర్మాణానికి ప్రదేశం అవసరమని భావించారు. 1870సెప్టెంబర్ 20న ప్రజలంతా కూడి నగర నిర్మాణం ఎక్కడ నిర్మించాలో నిర్ణయించారు. 320 ఎకరాల ప్రాంతాన్ని నగర నిర్మాణం కొరకు కొనుగోలు చేయబడింది. అదే నగర వ్యాపారకూడలిగా అభివృద్ధి చెందిన ప్రస్తుత డౌన్ టౌన్.

ఫీనిక్స్ నగరం1871 ఫిబ్రవరి 12న ఆరవ కౌంటీ అయిన మారికోపా కౌంటీగా అవతరించింది. 1871లో మొదటి కౌంటీ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. బర్నమ్ మొదటి షరీఫ్‌గా ఎన్నుకొన బడ్డాడు. 1870లో 48 అమెరికన్ డాలర్ల సరాసరి వెల నిర్ణయించి అనేక భూములు విక్రయించబడ్డాయి. 1871న మొదటి చర్చి నిర్మించబడింది అలాగే మొదటి పచారీ దుకాణం తెరవబడింది. 1872 సెప్టెంబరు 5న కౌంటీ కోర్ట్ ఆవరణలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన మొదటి తరగతి ప్రారంభించబడింది. 1873లో పాఠశాలకు ప్రత్యేక భవనం నిర్మించబడింది. 1873 నవంబరు 10న ఫ్లారెన్స్ ల్యాండి ఆఫీస్‌లో ఇక్కడి భూములు అధికారపూర్వకంగా నమోదు చేయబడ్డాయి. 1874 ఏప్రిల్ 10న ప్రెసిడెంట్ ఉల్సెస్ ఎస్ గ్రాంట్ చే అధికారాన్ని ఆమోదిస్తూ ఫీనిక్స్ నగర పేటెంట్ పత్రం విడుదల చేయబడింది. నగర ప్రదేశం మొత్తం భూమి వెల 550 అమెరికన్‌డాలర్లుగా నిర్ణయించబడింది. డౌన్‌టౌన్ స్థలాలు 7, 11 వెలలు నిర్ణయించి విక్రయించబడ్డాయి. తరువాత అతికొద్ది కాలంలో ఒక తంతి కార్యాలయం,16 క్షవరశాలలు,4 నాట్యశాలలు, రెండు బ్యాంక్‌లు తెరవబడ్డాయి.

నగరపాలన

[మార్చు]

1881 నాటికి ఫీనిక్స్ పట్టణ స్థాయి పాలనా వ్యవస్థ రూపొందేటంతగా ఎదిగింది.11 టెర్రిటోరియల్ లెజిస్లేచర్ ఫీనిక్స్‌క్ నగరానికి నగరపాలనా వ్యవస్థకు ఆమోదం తెలుపుతూ ది ఫీనిక్స్ చార్టర్ బిల్లును జారీ చేయడంతో నగరం మేయర్-కౌన్‌సిల్ ప్రభుత్వం పాలనలోకి చేరింది.గవర్నర్ జాన్ సి ఫ్రిమోంట్చే 1881 ఫిబ్రవరి 25 న బిల్లు జారీ చేయబడింది.అప్పటి నగర జనాభా సుమారుగా 2,500.1881 మే 21 న ఫీనిక్స్ మొదటి మేయర్ ఎన్నికలు నిర్వహించింది.107 స్థానాలు గెలిచిన డి.మోనిహన్ ను 127 స్థానాలు సాధించిన న్యాయాధిపతి టి.అల్సాప్ ఓడించి నగరానికి మొదటి మేయర్ అనే గౌరవాన్ని పొందాడు.1888 ఆరంభ కాలంలో ప్రభుత్వ కార్యాలయాలు వాషింగ్‌టన్, సెంట్రల్‌ ప్రాంతానికి తరలి వెళ్ళాయి.ఆతరువాత బస్ టెర్మినల్‌ ఉన్న ప్రదేశానికి మార్చబడి అక్కడ 1990లో సెంట్రల్ స్టేషను నిర్మాణం ప్రారంభం అయేవరకు ఉన్నాయి.1889లో ఆకార్యాలయాలు ఫీనిక్స్ నగరానికి మారచబడ్డాయి.1880 రైల్ రోడ్స్ రాకతో ఫీనిక్స్ ఆర్థిక రంగంలో వ్ప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.వాణిజ్యం రైల్ మార్గంలో వ్యాగన్ల రూపంలో నగరానికి ప్రవాహంలా వచ్చి చేరింది.తూర్పు పడమటి ప్రాంతాలకు ఉత్పత్తులు పోయి చేరడంతో ఫీనిక్స్ ప్రధాన వ్యాపార కూడలి అయింది.ఫలితంగా ఫీనిక్స్ నగర చాంబరాఫ్ కామర్స్ 1888 నవంబరు 4 న రూపుదిద్దుకుంది.1891లో నిర్మించిబడిన ఆరంభకాల స్టేగ్ కోచ్ లైన్ ఆధారంగా ఎలెక్‌ట్రిక్ స్ట్రీట్ కార్ సిస్టమ్ ప్రారంభించబడింది.

ఆధునిక ఫీనిక్స్ నగరం(1900 నుండి ప్రస్తుత కాలం వరకు)

[మార్చు]
Phoenix’s Navy Week, 2005.

1992లో అప్పటి ప్రెసిడెంట్ అయిన దియోడోర్ రూస్‌వెల్ట్ ఆమోదంతో నెరవేరిన నేషనల్ రిక్లెమేషన్ యాక్ట్ నగరంలో ఆనకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేసింది.పడమటి నదీప్రవాహాలపై ఆనకట్ట నిర్మాణానికి పనులు ప్రారంభం చేయడానికి ప్రజలుచే 1903 ఫిబ్రవరి 7న సాల్ట్ రివర్ వెల్లీ వాటర్ అసోసియేషన్ జల, విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి స్థాపించబడింది.సాల్ట్ రివర్ ప్రాజెక్ట్లో అంతర్భాగంగా ఈ ఏజెన్సీ ఇంకా కొనసాగుతూ ఉంది.తూర్ప కొండ ప్రాంతంలో రూజ్‌వెల్ట్ డామ్నిర్మాణం 1991 నాటికి పూర్తి అయింది.ఫీనిక్స్ నగర ప్రాంతాలలో పర్వత శ్రేణుల సమీపంలో పలు సరసులు ఏర్పడ్డాయి.నీటి పారుదలకు అధికంగా జలవినియోగం జరుగుతున్న కారణంగా నదీజలాలు తరచుగా ఎండిపోతున్నాయి.ఈ కారణంగా భారీగా వలస పక్షులు ఈ ప్రాంతాలను వదిలి బీవర్ డామ్స్, కాటన్ వుడ్ వృక్షాలకు తరలి వెళతాయి.

1912 ఫిబ్రవరి 14న ప్రెసిడేంట్ పాలనలో ఫీనిక్స్ నగరం అరిజోనా రాష్ట్ర రాజధాని అయింది.ఫీనిక్స్ రాష్ట్రరాజధానిగా, భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉండటంతో ట్క్సన్, ప్రెస్కాట్‌ల కన్నారిజోనా రాష్ట్రంలో ప్రాధాన్యత సంతరించుకుంది.అప్పట్లో ఫీనిక్స్ టక్సన్ నగరానికంటే చిన్నది అయినా తరువాతి కొన్ని దశాబ్ధాలలోనే అభివృద్ధి చెంది రాష్ట్రంలో పెద్దనగరంగా మారింది.

1912లో ఫీక్స్ నగరం మేయర్_కౌన్సిల్ పాలనావ్యవస్థ నుండి కౌన్సిల్_మేనేజర్ పాలనా వ్యవస్థగా మారింది.అమెరికాదేశంలో ఇలాటి పాలనా వ్యవస్థ ఏర్పరుచుకున్న మొదటి నగరం ఫీనిక్సే.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫీనిక్స్ నగర ఆర్థికవనరులు యుద్ధపరికరాల వినియోగ కేంద్రంగా మారింది.యుద్ధపరికరాల తయారుచేసి సరఫరాచేసే పరిశ్రమలు అతివేగంగా అభివృద్ధి చెందాయి.హైదర్ సెంటర్లో ల్యూక్ ఫీల్డ్,విలియమ్ ఫీల్డ్, ఫాల్కన్ ఫీల్డ్ ఏర్పరచిన బృహత్తర యుద్ధ శిక్షణా కేంద్రాలు నగరంలోకి వేలకొలది క్రొత్త జనవాహినిని తీసుకు వచ్చాయి.

నగరంలో జర్మన్ యుద్ధ ఖైదీలను నిర్భంధించటానికి ది పపాగో పార్క్ ప్రిజనర్ ఆఫ్ వార్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. వాటికి చెందిన కొన్ని భవనాలు మాత్రం ప్రస్తుతం మిగిలి ఉన్నాయి.1944లో డజన్ల కొద్దీ ఖైదీలు దిగువ సాల్ట్, గిలా నదీ ప్రవాహాల గుండా బోట్లలో ప్రయాణీంచి మెక్సికో చేరాలని ఉయూహం పన్నారు.సాల్ట్ నదీ జలాలు దశాబ్ధాలుగా ఎండిపోయి ఉన్నాయని గ్రహించకుండా ధైర్యం చేయడంతో క్యాంప్ పరిసరాలలోనే పట్టుబడ్డారు.

1942లో నగరంలో బసచేసి ఉన్న యు.ఎస్ సైకులూ ఆర్మీ పోలీసుల మధ్య జరిగిన దురదృష్టకరమైన కొన్ని దుర్ఘటనల తరువాత కల్నల్ ల్యూక్ ఫీల్డ్ నగర పరిసరాలలో సైనిక దళాలకు నిషేధం విధించాడు.విజయవంతంగా ముగుసిన ఈ ప్రయత్నం నగర కౌన్సిల్‌కు పరిపాలనలో విశేషాధికారం ఇవ్వడానికి కారణం అయింది.అలాగే నిధులను వినియోగించడంలో కూడా అధిక స్వాతంత్ర్యం లభిచింది.

1947లో సంభవించిన అగ్ని ప్రమాదం అధిక సంఖ్యలో స్ట్రీట్ కార్లను దగ్ధంచేయడంతో నగరం కొత్త స్ట్రీట్ కార్లను తయారు చేసుకోవడం లేక ప్రయాణావసారలకు బసులపై ఆధారపడవససిన పరిస్థితిలో పడింది.

1950 నాటికి నగరజనాభా 1,00,000కు చేరుకుంది.ఇది కాక నగర పరిసర ఇతర సమూహాల జనాభా కొన్ని వేలకు చేరుకుంది.నగరంలో పేవ్‌మెంట్ నిర్మించిన వీధులు 148 మైళ్ళపొడవున ఉన్నాయి.అవికాక పేవ్‌మెంటులు లేని వీధులు 163 మైళ్ళ పొడవున ఉన్నాయి.

తరువాతి కొన్ని దశాబ్ధాల కాలం నగరం పరిసర ప్రాంతాలు ఆకర్షణీయమైన అభివృద్ధి సాధించాయి.రాత్రి జీవితం కొన్ని ప్రత్యేక సంఘటనలకుమాత్రం కేంద్రంగా ఉన్న సెంట్రల్ అవెన్యూలో 1970 నుండి నేరాల అభివృద్ధి వాణిజ్యం క్షీణించడం ఏకకాలంలో ప్రారంభం అయ్యాయి.1976లో అరిజోనా రిపబ్లిక్ రచయిత డాన్‌బోల్స్ కారు బాంబ్ పేలి హత్యకు గురి అయ్యాడు.ఫీనిక్స్ నగరంలో నేరాల జరుగుతున్న తీరు తెన్నుల గురించి ఆయన పరిశోధించి పత్రికలకు అందించడం ఈ హత్యకు మూలకారణంగా భావించారు.1980 నాటికి స్ట్రీట్ గ్యాంగ్, డ్రగ్ ట్రేడ్ ప్రజారక్షణ సంబంధిత చర్చనీయాంశాలు అయ్యాయి. అనేకరకాల నేరాలు అప్పటినుండి పెరుగుతూ వచ్చాయి.ప్రస్తుతం నగరంలో నేరాలు జాతీయ సరాసరి కంటే అధికమే.1980లో సాల్ట్ నదికి సంభవించిన వరదల కారణంగా పలు వంతెనలు దెబ్బతిన్నాయి,ది అరిజోనా డిపార్ట్‌మెంటాఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, అమ్‌ట్రాక్ఒకటిగా చేరి పనిచేసి తాత్కాలిక ట్రైన్ సర్వీసులు నడిపాయి.ది హట్టీ బి పేరుతో మధ్య ఫీనిక్స్ నుండి ఆగ్నేయ సరిహద్దుల వరకు ట్రైన్ సర్వూసులు నిర్వహించారు.నిర్వహణలో నిధులు నిర్వహణ చేయడంలో స్థానిక అధికారులు తగినంత శ్రద్ధ చూపించక పోవడమూ ఖరీదైన ఇతర ప్రాజెక్టులు చేపట్టడమూ చేరి హట్టీబీ లైన్ ‌లో సర్వీసులను నిలిపి వేయడానికి కారణం అయ్యాయి.

1997లో నగరచరిత్రలో ఫీనిక్స్ లైట్స్దృశ్యాలు స్థానం సంపాదించాయి.2000 నాటికి ఫీనిక్స్ నగరం 24.2% అభివృద్ధి చెందింది.ఇది దేశంలో ఫీనిక్స్ నగరాన్ని త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాలలో లాస్ వెగాస్ తరువాతి స్థానంలోకి తీసుకు వచ్చింది.2008లో ఆర్థిక సంక్షోభం వలన బలంగా బాధించబడిన నగరాలలో ఫీనిక్స్ నగరం ఒకటి.ఈ సంక్షోభం సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్ క్రైసిస్గా అభివర్ణించ బడింది.సమీపకాలంలో ఆకాశాన్నంటిన నివాసగృహాల ఖరీదు 2,62,000 అమెరికా డాలర్ల నుండి 1,50,000 కు పడిపోవడం విశేషం.ప్రస్తుతం ఫీనిక్స్ నేరాలు తగ్గుముఖం పట్టాయి.

A panoramic view of Phoenix from the South Mountain Range, Winter 2008 with Sky Harbor International Airport on the far right.
A panoramic view of Phoenix from the South Mountain Range, Winter 2008 with Sky Harbor International Airport on the far right.

భౌగోళికం

[మార్చు]
ఉత్తర ఎమ్.టీ ప్రిజర్వ్ నుండి ఫీనిక్స్
Landsat 7 Satellite image of the Phoenix Metro Area in 2002.
Tuimelapse of the Phoenix area from 1972 to 2011. Data from Landsat satellites. Due to the wavelengths of light recorded, healthy vegetation appears red in these images.

ఉత్తరదిశగా సొనారన్ ఎడారి, పడమటి దిశలో సాల్ట్ నది సముద్ర తీరానికి 1,117 అడుగుల ఎత్తులో నగరం ఉపస్థితమై ఉంది. ఈశాన్యంలో నగరం చుట్టూ మెక్ డ్వెల్ పర్వతాలు',' పడమటి దిశలో వైట్ టాంక్ పర్వతం, తూర్పున సూపర్ స్టిషన్ పర్వతాలు, ఆగ్నేయంలో సైరా ఎస్ట్రెల్లా పర్వతాలు, నగరంలో ఫీనిక్స్ పర్వతాలు, దక్షిణ పర్వతాలూ నగరానికి వింతశోభను సంతరించాయి. ప్రస్తుతం ఉత్తర, పడమటి దిశలో భౌగోళిక సరిహద్దులు దాటి నగరం అభివృద్ధి చెందుతూ ఉంది. దక్షిణంలో పైనల్ కౌంటీలను తాకుతూ విస్తరిస్తూ ఉంది. యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో గణాంకాలననుసరించి నగర విస్తీర్ణం 475.1 చదరపు మైళ్ళు. 474.9 చదరపు మైళ్ళు భూభాగం,0.2 చదరపు మైళ్ళు జలభాగం.

ఫీనిక్స్ నగరపాలిత ప్రాంతం జనసంఖ్య అరిజోనాకు చెందిన మారికోపా, పైనల్ కౌంటీల ప్రజలుతో కలిపి దేశంలో 13వ స్థానంలోఉంది. యు.ఎస్ గణాంకాలననుసరించి మొత్తం జనసంఖ్య 40,39,182. నగరపాలితంలోకి చేరిన ఇతర నగరాలు మెసా, స్కాట్‌డేల్, గ్లెండేల్, టెంప్, చాండ్లర్, గిల్‌బర్ట్, పియోరియా. పలు చిన్న చిన్న సాంస్కృతిక సమూహాలు నగర జనాభాలో అంతర్భాగమే. కేవ్‌గ్రీక్, క్వీన్‌గ్రీక్, బక్‌యే, గుడ్‌ఇయర్, ఫౌంటెన్ హిల్స్, లిచ్‌ఫీల్డ్ పార్క్, అనితమ్, సన్‌లేక్స్, సన్‌సిటీ, సన్‌సిటీ, అవోండేల్, సర్‌ప్రైస్, ఇఐ మైరేజ్, పారడైజ్‌వెల్లీ, టాల్‌సన్ వీరంతా నగరపాలిత సాంస్కృతిక సమూహాలకు చెందిన వారే. వీరు కాక నగర ఇతర ప్రాంతాలలో నివసించే అహ్వాతుకీ ,అర్కాడియా, దీర్‌వెల్లీ, లావీన్, లావీన్, మేరీ వేల్ ప్రజలు ఉన్నారు. అహ్వాతుకీ మాత్రం దక్షిణ పర్వతాల నడుమ ప్రత్యేకంగా ఉన్నారు.

వాతావరణం

[మార్చు]
Downtown Phoenix skyline looking northeast toward Camelback Mountain.

ఫీనిక్స్ నగర సోతోష్ణ స్థితి ఎడారులలో ఉండే శితోష్ణ స్థితిని పోలి ఉంటుంది. ఎండా కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే శీతాకాలంలో మితమైన చలి ఉంటుంది. మేమాసాం చివర నుండి సెప్టంబర్ మాస ఆరంభం వరకు ఉష్ణోగ్రతలు సుమారు 100 డిగ్రీల ఫారెన్ హీటు ఉంటుంది. సంవత్సరంలోదాదాపు 110 రోజులపాటు ఇలా సాగుతుంది. సంవత్సరంలో పద్దెనిమిది రోజులపాటు ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్ హీటు వరకు చేరడం ఇక్కడ అలవాటే. అమెరికా సంయుక్తరాష్ష్ట్రాలలో జనసాంద్రత అధికంగా కలిగిన నగరాలలో అధిక ఉష్ణోగ్రత కలిగిన నగరం ఇది. సంవత్సర కాలంలో సుమారు 18 రోజులు ఉష్ణోగ్రత 110 డిగ్రీల ఫారెన్ హీటు వరకు ఉంటుంది. జూలై ఆరంభం నుండి సెప్టెంబరు మధ్య కాలం వరకు వర్షాకాల తడి వాతావరణం కొనసాగుతుంది. ఈ సమయంలో గాలిలో తేమ శాతం అధికం కావడమే కాక అప్పుడప్పుడూ వరదలు ఉంటాయి. నులివెచ్చని శీతాకాలం ఇక్కడ సహజం. ఫీనిక్స్ నగరం సూర్యరశ్మి శాతం దాదాపు 85%. ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నమోదు చేసిన సరాసరి అధిక వర్ష పాతం 8.3 అంగుళాలు. సంవత్సరంలో అధిక తడివాతావరణం మార్చి మాసంలోనూ అధిక పొడి వాతావరణం జూలై మాసం లోనూ సహజం. జూలై సెప్టెంబరు మధ్యకాలంలో ఉరుములు పిడుగులతో కూడిన గాలులతో కూడిన వర్షపాతం ఎప్పుడైనా రావడం సహజం. వర్షాకాలంలో కలిఫోర్నియా గల్ఫ్ నుండి వీచే తడిగాలులు వీచడం సర్వ సాధారణం. ఈ గాలులు బలమైన గాలి, వడగళ్ళ వానకు కారణం కావడమే కాక అరుదుగా టొర్నాడోస్ అనబ్సడే సుడిగాలులు వీస్తుంటాయి. చలిగాలులు పశిఫిక్ సముద్రం వైపు ప్రయాణిస్తూ అప్పుడప్పుడూ వర్షపాతాన్ని కలిగిస్తుంది. మంచు అరుదుగా కురిసినా చలికాలంలో ప్రతి సంవత్సరం దర్శనం ఇస్తుంది. సుమారు సంవత్సరకాలంలో అయిదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పూర్తిగా పడి పోయి మంచు గడ్డకట్టే పరిస్థితి పొడచూపుతుంది.

జనసంఖ్య

[మార్చు]

2007 అమెరికా గణాంకాలననుసరించి జనసంఖ్య వివరాలు;-

  • 48.1% హిస్పానికులు కాని శ్వేతజాతీయులు.
  • 6.0% ఆఫ్రికన్ అమెరికన్లు.
  • 2.4% అమెరికన్ ఇండియన్ స్థానికులు.
  • 2.7% ఆసియన్లు.
  • 0.2% స్థానిక హవాలియన్, ఇతర పసిఫిక్ ద్వీపవాసులు.
  • 14.1% ఇతరులు.
  • 1.9% మిశ్రిత జాతీయులు.
  • 4.1% హిస్పానికులు (అన్ని జాతీయులు).

2000 జనాభాలెక్కల గణాంకాలను అనుసరించి నగర జనాభా 1,321,045,నివాసాల సంఖ్య 865,834,నగర సరిహద్దులలో నివసిస్తున్న వారి సంఖ్య 407,450.ఒక చదరపు మైలు ప్రదేశ జనసాంద్రత 2,782.సరాసరి ఒక చరదరపు మైలు విస్తీర్ణంలో నివాసగృహాల సంఖ్య 1,044.18 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య జనాభాలో 35.7%.ఒకటిగా నివసిస్తున్న దంపతులు, పిల్లల శాతం 46.9%.ఒంటరిగా నివసిస్తున్న స్త్రీల సంఖ్య జనాభాలో 12.9%. విజాతీయుల శాతం 34%.ఒంటరిగా నివసిస్తున్న ప్రజల శాతం 25.45%.65 సంవత్సరముల పైబడిన వారు 6.3%.సరాసరి నవాసగృహ నివాసితులు 2.7, సరాసరి కుటుంబంలో నివాసితులు 3.39.

నరసరిహద్దులలో 18 సంవత్సరాల లోపు వారు 28.9%,18 నుండి 24 సంవత్సరాల లోపు వారు 10.9%,25 నుండి 44 సంవత్సరాల ప్రజలు 33.2%, 45 నుండి 64 వయసు కలిగిన వారు 18.8%.65 సంవత్సరాల పైబడిన వారి సంఖ్య 8.1%.సరాసరి వివాహ వయసు 31 సంవత్సరాలు.ప్రతి 100 స్త్రీలకు పురుషుల నిష్పత్తి 103.5.18 సంవత్సరాల లోపు స్త్రీలకు పురుషుల నిష్పత్తి 102.7 పురుషులు.సరాసరి గృహాదాయం 41,207 అమెరికన్ డాలర్లు.పురుషుల సరాసరి ఆదాయం 32,820 అమెరికన్ డాలర్లు కాగా స్త్రీల సరాసరి ఆదాయం 27,466.సరాసరి తలసరి ఆదాయం 19,833 అమెరికన్ డాలర్లు.జనసంఖ్యలో 15.8% కుంటుంబ నివాసితులలో 11.5% దారిద్ర్య రేఖకు దిగువున ఉన్నారు.18 సంవత్సరాలకు లోపు వారిలో 21% 65 సంవత్సరాల పైబడిన వారిలో 10.3% దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నారు.

2000 సంవత్సరాల గణాంకాలను అనుసరించి ఫీనిక్స్ నగర జనాభాలో శ్వేతజాతీయుల శాతం 48.15%,ఆఫ్రికన్ అమెరికన్ల శాతం 5.1%,స్థానిక అమెరికన్ల శాతం 2%,ఆసియన్ల శాతం 2%,పసిఫిక్ ద్వీప వాసుల శాతం 0.13%,ఇతర జాతీయుల శాతం 16.4%,మిశ్రమ జాతీయుల శాతం 3.3%.జసంఖ్యలో అన్ని జాతులకు చెందిన హిస్పానికులు, స్పానిష్‌ల శాతం 34.1%.బ్రూకింగ్ ఇన్‌స్టిస్ట్యూషన్‌కు చెందిన గణాంక నిపుణుడు విలియమ్ ఎర్రీ అంచనా ప్రకారం 2000 నుండి జనసంఖ్యలో హిస్పానికుల సంఖ్య 50% శాతం పడిపోయినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

2000 జనాభా గణాంకాలను అనుసరించి జనాభాలో 45% కాధలిక్కులు,ఎల్.డి.ఏస్‌లు 13%,యూదులు 5%,మిగిలిన 37% జాతిని ప్రకటించని వారు.

ఆర్ధిక రంగం

[మార్చు]

ప్రారంభంలో ఫీనిక్స్ నగరం వ్యవసాయ ఆధారిత ఆర్థికపరిస్థితి కలిగిన నగరం.ప్రత్యేకంగా పత్తి, నిమ్మ,కమలా లాంటి పండ్ల తోటల పెంపకంలాంటివి అధికం. జనాభాసంఖ్య చురుకుగా అధికం కావడంతో ఆర్థికరంగంలో వివిధ మార్పులు సంభవించాయి.రెండు దశాబ్ధాల పైబడి ఆర్థిక రంగంలో మార్పులు పొడచూపాయి.ఫీనిక్స్ నగరంలో అత్యధికులు ప్రభుత్వోద్యాగాలపై ఆధారపడి జీవిస్తున్నారు.రాష్ట్ర రాజధాని కావడంతో అధికంగా ప్రభుత్వోద్యాగాలలో నియమితులు అయ్యారు.అరిజోనా స్టేట్ యూనివర్శిటీనగర ప్రజల విద్యాభివృద్దికి అధికంగా తోడ్పడింది.లెక్కించదగిన సంఖ్యలో సమాచార, సాంకేతిక సంస్థలు నగరంలో పున॰స్థాపించబడ్డాయి.శీతాకాల వెచ్చని వాతావరణం ఫీనిక్స్ నగర పర్యాటకరంగానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.నగరంలో గోల్ఫ్‌కు మరింత ప్రత్యేకత ఉంది.

ఫీనిక్స్ నగరం ప్రస్తుతం ఫార్చ్యూన్ 1000 లో చేరిన ఏడు సంస్థలకు పుట్టిల్లు.మేనేజ్‌మెంట్ సంస్థ అలైడ్ మేనేజ్‌మెంట్,విద్యుత్ పరికరాల సంస్థ అవెంట్,యూనివర్శిటీ ఆఫ్ ఫీనిక్స్ను స్థాపించిన అప్పోలో గ్రూప్ ,గనుల సంబధిత సంస్థ ఫ్రీపోర్ట్-మెక్‌మోరన్,చిల్లర వ్యాపార సంస్థ పెట్ స్మార్ట్,విద్యుత్ సరఫరా సంస్థ పిన్నాకిల్ వెస్ట్,చిల్లర వ్యాపార సంస్థ సి ఎస్ కె ఆటో వీటితో హనీవెల్‌కి చెందిన ప్రధానకార్యాలయ విభాగం నగరంలో ఊపస్థితమై ఉన్నాయి.

సంస్కృతి

[మార్చు]

కళలు

[మార్చు]

అనేక సంగీత కళారూపాలు నగరంలో ప్రత్యేక పాత్ర వహిస్తున్నాయి.ముఖ్యంగా ప్రారంభంలో ఫీనిక్స్ నగర డౌన్ టౌన్, స్కాట్ డేల్లో సంగీతానికి ప్రాముఖ్యత అధికం. ఇక్కడ ఉన్న ప్రధాన వేదికలలో ఫీనిక్స్ సింఫోనీ హాల్ ఒకటి. ఇక్కడ తరచుగా బ్యాలెట్ అరిజోనా, అరిజోనా ఒపేరాలాంటి సాంస్కృతిక సంగాల ప్రదర్శనలు జరుగుతుంటాయి.ఫీనిక్స్ మెట్రో పాలిటన్ ప్రాంతంలో ఉన్న ఒర్‌ఫ్యూమ్ దియేటర్ మరొక ప్రధాన వేదిక.

ఉద్యానవనాలు వినోదాలు

[మార్చు]
Midtown Phoenix is visible to the left in this view from the Phoenix Mountain Preserve, December 2010.

ఫీక్స్ నగరం అనేక ఉద్యానవనాలకు, విహారస్థలాలకు ప్రసిద్ధి. నగరవాసులకు వేసవి తాపానికి పరిహారంగా లోయ పరిసర ప్రాంతాలలో ఉన్న అనేక జల ఉద్యానవనాలు (వాటర్ పార్క్స్) వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. టెంపెలో ఉన్న బిగ్ సర్ఫ్, గ్లెండేల్, మెసలో ఉన్న గోల్ఫ్ లాండ్ సన్ స్ఫాష్ అరిజోనా గ్రాండ్ రిసార్ట్ వద్ద ఉన్న ఒయాసిస్ వాటర్ పార్క్ నగరవాసులకు విహార స్థలాలు. ఇవి కాక నగరంలో రెండు అమ్యూజ్‌మెంట్ పార్కులు ఉన్నాయి. ఫీనిక్స్‌లో మెట్రో సెంటర్ సమీపంలోఉన్నకేస్టిల్ ఎన్ కేస్టర్స్, ఎన్‌కాంటర్ పార్క్ సమీపంలో ఉన్న ఎన్‌చాంటర్ ఐలాండ్ నగవాసులకు ప్రధాన ఉల్లాస కేంద్రాలు, అనేక పార్కులు ఎడారి సంరక్షణ నిమిత్తం స్థాపించ బడ్డాయి. లేని ఎడల అవి నివాస, వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెంది పరిసరాల సహజత్వం చెడగొట్టే ప్రమాదం ఉంది. అత్యధికంగా గుర్తింపు పొందిన పార్క్ సౌత్ మౌంటెన్ పార్క్. ఇది 16,500 ఎకరాల విస్తీర్ణం కలిగి అంతర్జాతీయంగా అతి పెద్ద నగరపాలిత పార్క్‌గా గుర్తింపు పొందింది. తరువాత కేమెల్ బ్లాక్ మౌంటెన్, ఎస్ మౌంటెన్‌గా పిలువబడే సన్నీస్లోప్ మౌంటెన్, ప్రపంచమంతా ఉన్న ఎడారి మొక్కల, ఎడారి వాతావరణం ప్రతిబింబింప చేసే ది డిసర్ట్ బొటానికల్ గార్డెన్ ఉన్నాయి. ఫీక్స్‌కు వాయవ్యంలో ఉన్న ఎన్ చాంటో పార్క్ ఫీనిక్స్ నగరప్రాంత అతి పెద్ద పార్క్‌గా గుర్తింపబడింది. తూర్పు ఫీనిక్స్‌లో ఉన్న పపాగోపార్క్ ఫీనిక్స్ బొటానికల్ పార్క్, ఫీనిక్స్ జూలకు మూల స్థానం. ఇక్కడ కొన్ని గోల్ఫ్ మైదానాలు శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.

ప్రచార మాద్యమం

[మార్చు]

ఫీనిక్స్ నగర మొదటి సమాచార వార పత్రిక సాల్ట్ రివర్ వ్యాలీ హెరాల్డ్. ఇది 1880 వరకు ఫీక్స్ హెరాల్డ్ పేరుతో నడుపబడి ఆతరువాత నామాంతరం చెందింది. ప్[రస్థుతం నగరంలో రెండు ప్రధాన పత్రికలను అందిస్తున్న సంస్థలు అరిజోనా రిపబ్లిక్, ఏస్ట్ వ్యాలీ ట్రిబ్యూట్. ఇవి మెట్రో ప్రాంతమంతా తమ సేవలను అందిస్తున్నాయి. ఇవి కాక అనేక ప్రాంతీయ పత్రికలు, వార పత్రికలు నగరంలో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నడుపుతున్నది స్టేట్ ప్రెస్, కాలేజ్ టైమ్స్,ది ఫీనిక్స్ న్యూ టైమ్స్ లకు 40 సంవత్సరాల చరిత్ర ఉంది. వెల ఇచ్చి కొనుక్కునే ది బాచిలర్‌స్ బీట్ లో ప్రాంతీయ రాజకీయాలు, ప్రకటనలు చోటు చేసుకున్నాయి. ఫీనిక్స్ మహానగర ప్రాంత నివాసులు అనేక దూరదర్శన్ సేవలను అందుకుంటున్నారు. అమెరికాలో ఫీనిక్స్ నగర దూరదర్శన్ సంస్థలు 1,802,550 గృహాలకు తమ సేవలను అందిస్తూ వ్యూహాత్మక వ్యాపార ప్రాంతంగా 12 వ స్థానంలో ఉంది. ప్రధాన దూరదర్శన్ కేంద్రాలు వరుసగా కె పి ఎన్‌ ఎక్స్ 12 (ఎన్ బి సి), కె ఎన్ ఎక్స్ వి15 (ఎ బి సి), 'కె పి హెచ్ ఒ 5 (సి బి ఎస్), కె ఎస్ ఎ జెడ్ 10 (ఎఫ్ ఒ ఎక్స్), కె యు టి పి 45 (ఎమ్ ఎన్ టి వి), కె ఎ ఎస్ డబ్ల్యు 61 (సి డబ్ల్యు), కె ఎ ఇ టి 8 (పి బి ఎస్, ఇది ఎ ఎస్ యు చే నిర్వహించబడుతుంది). స్వతంత్రంగా మహానగర ప్రాంతంలో నిర్వహించబడుతున్న దూరదర్శన్ వరుసగా కేంద్రాలు కె పి ఎ జెడ్ 21 (టి బి ఎన్), కె టి వి డబ్ల్యు 33 (యునివిషన్), కెటి ఏ జెడ్ 39 (టెలెమన్డొ), కె డి పి హెచ్ 48 (డే స్టార్), కె పి పి ఎక్స్ 51 (ఐ ఒ ఎన్). కె టి వి కె 3 (3 టి వి) మరియుకె ఎ జెడ్ టి 7 (ఎ జెడ్ టి వి) . కె ఎ జెడ్ టి డిజిటల్ ఫార్మేట్‌లో మాత్రమే ప్రసారాలను అందిస్తుంది . ఫీనిక్స్ ఆకాశవాణి అధికంగా సంగీత, చర్చా కార్యక్రమాలను అందిస్తుంది.

చలన చిత్ర చిత్రణ

[మార్చు]

నగరంలో చిత్రీకరించబడిన విశేష చలన చిత్రాలు, దూరదర్శన్ కార్యక్రమాలు వరుసగా, వెయిటింగ్ టు ఎక్సేల్, వార్ ఆఫ్ ది వరల్డ్స్ (1953), డేశ్ ఆఫ్ తన్‌డర్, అనెస్తీషియా (ఫాక్స్ అనిమేషన్‌ స్టూడియోస్), అమెరికన్ ఏనితమ్, 24, డి కింగ్‌డమ్, ట్రాన్స్ అమెరికా, డి అన్‌ఇన్వైటెడ్, వాట్ ప్లానెట్ ఆర్ యు ఫ్రమ్, ఎంగ్ అమెరికన్స్, టైటన్ ఏ ఈ ఓ సి. స్టిగ్స్, పార్డెన్స్, ప్రైవేట్ లెస్సన్స్ (1981 చిత్రం),సాంగ్ ఆఫ్ ది సౌత్, ది గన్‌ట్ లెట్, ఫిజికో, రైజింగ్ అరిజోనా, జెర్రీ మ్యాగ్యూర్, బారకా, లిటిల్ మిస్ సన్‌షైన్, ఇంటర్ స్టేట్ 60, గన్ ఫైట్ ఎట్ ది ఒ.కె కార్నర్, బియాండ్ ది లా, ఎ హోమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్,ది ప్రొఫెసి, ఏ బాయ్ ఎండ్ హీస్ డాగ్, యూస్డ్ కార్స్, బిల్స్ అండ్ టెల్స్ ఎక్సలెంట్ అడ్వెంచర్ (యూస్డ్ ఏజ్ ఏ శాండ్-ఇన్ ఫర్ శాన్ డిమాస్, కలి ఫోర్నియా), యు టర్న్, ఏయిట్ లెగ్స్ ఫ్రీక్స్, బస్ స్టాప్స్, ది గేట్ వే, ది గ్రిఫ్టర్స్, ఎలెక్ట్రా గ్లైడ్ ఇన్ బ్లూ, ప్రైవేట్ లెస్సన్స్, బ్లూ కాలర్ కామెడీ టూర్: ది మూవీ, నెవర్ బీన్ ది వెడ్, జస్ట్ ఒన్‌ ఆఫ్ ది గై, అవే వి గో తెర్మినల్ వెలోసిటీ, టాక్సీ, టిలైట్ అండ్ ది బాంగర్ సిస్టర్స్.[50]

ప్రభుత్వం

[మార్చు]
The Arizona State Capitol, which used to house the state legislature, is now a museum.
Phoenix City Hall, showing the city's logo, the phoenix bird.

ఫీనిక్స్ నగరం మేయర్, పాలనలో ఎనిమిది మంది కౌన్సిల్ సభ్యుల సహాయంతో నిర్వహించబడుతుంది. నగరమంతా ఉన్న ప్రజలచేత నాలుగు సంవత్సరాలకు ఒక సారి మేయర్ ఓటింగ్ మూలంగా ఎన్నుకోబడతాడు. ఎనిమిది ప్రత్యేక డిస్ట్రిక్‌లుగా విభజింపబడిన నగరంలో ప్రతినిద్ధులుగా ఒక్కొక్క డిస్ట్రిక్‌కు ఒక్కొక్కరు చొప్పున కౌన్సిల్ సభ్యులు నాలుగు సంవత్సరాలకు ఒక సారి ఎన్నుకొన బడతారు.

విద్యాసౌకర్యాలు

[మార్చు]

ఫీనిక్స్ నగరం 30 విద్యావిభాగాలుగాలుగా విభజించి ప్రభుత్వరంగ పాఠశాలను నడుపుతూ విద్యాసేవలను అందిస్తుంది. ది ఫోనిక్స్ యూనియన్ ఉన్నత పాఠశాల డిస్ట్రిక్ ఫీనిక్స్ నగరంలోని అధిక పాఠశాలల నిర్వహణా బాధ్యతను వహిస్తుంది. నార్త్ పాయింట్ ప్రిపరేటరీ స్కూల్, సొనోరమీ సైన్స్ అకాడమీ లాంటి చారిటీ సంస్థలు నడుపుతున్న పాఠశాలలు కూడా విద్యా సేవలు అందిస్తున్నాయి.

The campus of ASU from Tempe Butte in nearby Tempe.
  • ఉన్నత విద్యలను అందిస్తున్న విశ్వవిద్యాలయాల్లో నగరానికి వాయవ్యంలో 'కెంపెలో ఉన్నఅరిజోనా స్టేట్ యూనివర్శిటీ ప్రథమ స్థానాన్ని అలంకరించింది. దీనికి ఏ ఎస్ యు వెస్ట్ కేంపస్, ఎ ఎస్ యు పాలిటెక్నిక్ కేంపస్ అనే రెండు విభాగాలు ఉన్నాయి. దీనిలో విభాగంగా భాగస్వామ్య పద్ధతిలో యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఫీనిక్స్ డౌన్ టౌన్‌లో ఉంది. ఏ ఎస్ యు అమెరికాలో ఉన్న అతి పెద్ద యూనివర్శిటీలలో ఒకటి. ఇక్కడ చదుకున్న విద్యార్థుల సంఖ్య 2007 లో 64, 394.

ఫీనిక్స్ నగరంలో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ అరిజోనా (టక్సన్), నార్తెన్ అరిజోనా యూనివర్సిటీ (ఫ్లాగ్ స్టాఫ్) కు చిన్న శాటిలైట్ కార్యాలయాలు కూడా ఉన్నాయి.

  • దేశంలోనే లాభార్జర్నార్ధం మాత్రమే నడపబడే ఒకే ఒక యూనివర్శిటీ గ్రాండ్ కేన్్‌యాన్ యూనివర్శిటీ మాత్రమే, ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనం ఆశించకుండా 1949లో స్థాపించబడిన క్రిస్టియన్ యూనివర్శిటీ నిర్వహణా భారాన్ని భరించ లేని స్థితిలో ముగ్గురు పెట్టుబడి దారుల చేత కొనుగోలు చేయబడింది, తరువాతి కాలంలో ఇది 2004 లో స్వాధీన పరచుకొనబడిన తరువాత విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా అభివృద్ధిని సాధించింది. ఇందులో ప్రస్తుతం 10,000 మంది విద్యార్థులు ఉన్నారు.
  • గ్లాండేల్ ఉన్న మిడ్ వెస్ట్రన్ యూనివర్శిటీ- గ్లాండేల్, ఇల్లినోయిస్‌లో డౌనర్స్ గ్రోవ్ కాపస్‌కు అనుబంధ పాఠశాలగా ఫీనిక్స్‌ నగరంలో స్థాపించబడిన నార్త్ వెస్ట్ ఆఫ్ ఫీనిక్స్ ప్రాపర్, ఇది అనేక హెల్త్ క్లేర్ విద్యార్థులైన డాకటరేట్, మాస్టర్ లెవల్ వృత్తి విద్యార్థులకు నిలయం, డాక్టర్ ఆఫ్ ఆస్తోపతిక్ మెడిసిన్ (డి ఓ ), మాస్టర్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎమ్ ఎమ్ ఎస్) ఇన్ ఫిజీషియన్ అసిస్టెంట్ స్టడీస్, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్ డి),మాస్టర్ ఆఫ్ అక్యుపేషనల్ దెరఫీ (ఎమ్ ఓ టి), డాక్టర్ ఆఫ్ డెంటల్ మెడిసిన్ (డి ఎమ్ డి), డాక్టర్ ఆఫ్ పీడియాట్రిక్ మెడిసిన్ (డి పి ఎమ్), డాక్టర్ ఆఫ్ అక్టోమెట్రీ (ఓ డి).
Students at Arizona State University in Phoenix.
  • గ్లోమల్ మేనేజర్ విద్యాసన అందించడంలో ప్రపంచలోనే ప్రథమ స్థానంలో ఉన్న తండర్ బర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అమెరికాలోని గ్లెండేల్ లోనూ, స్విడ్జర్ లాండ్, ది జెక్ రిపబ్లిక్ లోనూ, రష్యా, మెక్సికోమధ్య, దక్షిణ అమెరికా, చైనాలలో విద్యను అందిస్తుంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్స్ పోల్ ఆఫ్ కార్పొరేట్ రెక్రూటీస్, యు.ఎస్ న్యూస్ ‍అండ్ వరల్డ్ పరిపోర్ట్, ఫైనాన్‌షియల్ టైమ్స్‌ లాంటి పత్రికలు ఈ స్కూలును అంతర్జాతీయ వాణిజ్య విద్యలో ప్రథమ శ్రేణిలో ఉన్నట్లు పేర్కొన్నాయి.
  • ప్రైవేట్ కాలేజ్ అయిన అమెరికన్ ఇండియన్ కాలేజ్, క్రిస్టియన్ కాలేజ్ ఫీనిక్స్ నగర వాయవ్య భాగంలో ఉన్నాయి. ది ఆర్ట్ ఇష్టిట్యూట్ ఆఫ్ ఫీనిక్స్ డిజైన్, ఫాషన్, మీడియా, కల్నరీ కళలు లాంటి వివిధ విద్యలను అందిస్తుంది. ఇది 1996లో తన మొదటి పాఠాలను ప్రారంభించింది.
  • వెస్ట్రన్ గవర్నర్స్ యూనివర్శిటీ (డబ్ల్యూ జి యు)తమ కార్యాలయాన్ని 2006న ఫీనిక్స్లో ప్రారంభించి ఆన్‌లైన్‌లోనే పాఠాలను బోధిస్తుంది. ఇది లాభాపేక్ష లేని విద్యా సంస్థ.

2008 వరకు మునుపటి గవర్నర్ అయిన జానెట్ నెపోలిటానో ఈ సంస్థ సభ్యుడుగా ఉన్నాడు. మునుపటి ఎన్ ఏ యు అధ్యక్షుడు క్లారా లోవెట్ డబ్ల్యూ జి యు కార్యక్రమాల్లో ప్రారంభ స్థాయిలో అత్యంత చురుగ్గా పాల్గొన్నాడు. డబ్ల్యూ జి యు ఉద్యోగులు, విద్యార్థు ఫీనిక్స్‌లోనే కాక అరిజోనా అంతటా ఉన్నారు. 2008 జూను ఆరంభంలో డబ్ల్యూ జి యుకు చెందిన విద్యార్థులు 10.000 మంది విద్యార్థులను అమెరికా అంతటి నుండి చేర్చుకుంది.

  • అమెరికా అంతటానే కాక ప్యూర్‌టో, రికోలలో, కెనడా, మెక్సికో నెదర్‌లాండ్స్‌లలో కాంపస్‌లు కలిగి ఆన్‌లై్‌లో 13,000 మంది విద్యార్థులు కలిగిన యూనివర్శిటీ ఆఫ్ ఫీనిక్స్ తమ ప్రధాన కార్యాలయాన్ని ఫీనిక్స్ నగరంలో నెలకొల్పి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
  • లాభాపేక్షతో నడుపబడుతున్న యూనివర్శిటీ ఆఫ్ అడ్వాంసింగ్ టెక్నాలజీ సాంకేతికంగా ప్రాధాన్యత కలిగిన విద్యలందిస్తున్న చిన్న విద్యా సంస్థ. ఫీనిక్స్ సరిహద్దులో ఉన్న టెంపెలో సరి కొత్త శాఖను స్థాపించింది,2009 నుండి ఆన్‌లైన్ విద్యతో నాలుగు కాలేజీలలోవయోజన విద్యా పధకంలో భాగంగా 1200 మందికి డిగ్రీ స్థాయి లోనూ 50 మందికి పోస్ట్ గ్రాఝ్యుఏట్ విద్యార్థులకు విద్యను అందిస్తుంది.
  • విషయుయల్ ఆర్ట్స్ మీద దృష్టి సారించి లాభాపేక్షతో స్థాపించబడిన కళాశాల కోలిన్స్ కాలేజ్ దీనికి ఫీనిక్స్‌లో ఒకటి, టేంపోలో ఒకటి శాఖలు ఉన్నాయి. ఇవి విద్యార్థులకు

వసతి గృహాలు లేని అతి చిన్న కళాశాలలు, కోలిన్స్ విద్యార్థులు ఇక్కడ అపార్ట్‌మెంట్‌లు తీసుకుని విద్యను కొనసాగిస్తున్నారు. ఫీనిక్స్ బిజినెస్ జర్నల్ 2007 లో దీనిని కంప్యూటర్ శిక్షణ అందించే కళాశాలలో ప్రథమ శ్రేణిలో ఉన్నట్లు పేర్కొంది.

  • దేశమంతటా చిన్న చిన్న కాంపస్‌లతో నడుస్తున్న డెవ్‌రీ యూనివర్సిటీ, అర్గొసి యూనివర్శిటీ లు రెండూ సెకండరీ, పోస్ట్ సెకండరీ స్థాయి విద్యలను అందిస్తున్నాయి. ఇది నగరానికి పడమటి వైపున ఉంది.
  • ది మారికోపా కౌంటీ కమ్యూనిటీ కాలేజ్ డిస్ట్రిక్ పది కమ్యూనిటీ కాలేజులనూ రెండి స్కిల్ కేంద్రాలనూ మారికోపాలో స్థాపించి నడుపుతుంది. ఇది ఫీనిక్స్‌ కాలేజ్ లాగే డిస్ట్రిక్ లో మొదటి కమ్యూనిటీ కాలేజ్.
  • ఫీనిక్స్ డౌన్ టౌన్‌లో ఉన్న ప్రైవేట్ సంస్థ చేత నడుపబడుతున్న లా కాలేజ్ పేరు ది ఫీనిక్స్ స్కూల్ ఆఫ్ లా. ఇది అరిజోనా రాష్ట్రంలోప్రైవేట్ సంస్థ చేత నడుపబడుతూ పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ తరగతులు జరుపుతున్న ఒకే ఒక లా కాలేజ్. ఈ కాలేజ్ 2008 లో 97% విద్యార్థులను ఉత్తీర్ణులను చేసింది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]
An aerial view of the control tower at Phoenix Sky Harbor that began operations on January 17, 2007.

ఫీనిక్స్ నగరం విమానమార్గం, రహదార్లు, ఫ్రీ వేలు, రైలు మార్గాల ద్వారా ప్రజలకు ప్రయాణ, రవాణాసౌకర్యం కలిగిస్తుంది. విమానాలు, బస్సులు, సైకిల్స్, కార్లు, ప్రభుత్వ వాహనాలు ప్రజల ప్రయాణాలకు సౌకర్యం కలిగిస్తున్నాయి.

ఆకాశ మార్గాలు

[మార్చు]

నగరం నడి బొడ్డున ఉపస్థితమై ఉన్నఐ ఏ టీ ఏ అని క్లుప్తంగా పిలువబడుతున్న స్కై హార్బర్ ఇంటనేషనలు ఎయుర్ పోర్ట్ ఫీక్స్ నగర డౌన్ టౌన్ నుండి అనేక ఫ్రీవేలతో అనుసంధానించబడి ప్రజలకు అందుబాటులో ఉంది. అమెరికాలోనే అత్యంత చురుకైన విమానాశ్రయాలలో ఇది తొమ్మిదవ స్థానంలో ఉంది. ప్రయాణీకుల సంఖ్యలో ఇది అంతర్జాతీయంగా 17 వ స్థానంలో ఉంది. ఈ విమానాశ్రయం ద్వారా 2007 న 42 మిలియన్ల ప్రజలు ప్రయాణించినట్లు అంచనా. ఇక్కడ నుండి 100 నగరాలకు అవిశ్రాంత విమాన సౌకర్యం ఉంది. ఎయిరో మెక్సికో, ఎయిర్ కెనడా, బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ జెట్ విమాన సర్విసులు ఈ విమానాశ్రయం ద్వారా సేవలు అందిస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలతో జాతీయంగా సేవలందిస్తున్న యు ఎస్ ఎయిర్ వేస్ తమ సేవలను తమసేవలను ఇరిగు పొరుగున ఉన్న కెనడా, మెక్సికో, కోస్టారికా వరకు విస్తరించింది. మెసా సామీపాన ఉన్న ఫీనిక్స్ మెసా గేట్ వే ఎయిర్ పోర్ట్ నగరానికి వాణిజ్యపరమైన రవాణా సేవలను అందిస్తుంది. 1993 లో మూయబడిన విలియమ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ ను ఫీనిక్స్ మెసా గేట్ వే ఎయిర్ పోర్ట్ గా రూపు దిద్దుకుంది. ప్రభుత్వేతర, వాణిజ్య సౌకర్యార్ధం నడుపబడుతున్న చిన్న విమానాశ్రయమైన ఫీనిక్స్ డీర్ వ్యాలీ ఎయిర్ పోర్ట్ ఫీనిక్స్ నగరానికి వాయవ్యంలో ఉన్న డీర్ వ్యాలీలో ఉంది. అలాగే నగరపాలక సంస్థకు చెందిన గ్లాండేల్ మునిసిపల్ ఎయిర్ పోర్ట్, ఫీనిక్స్ గుండ్ ఇయర్ ఎయిర్ పోర్ట్ ఉన్నాయి.

రైలు, బస్సు మార్గాలు

[మార్చు]
Opening day of the light rail, December 27, 2008.

1996 నుండి ఫీనిక్స్ నగారానికి అమ్‌ట్రాక్ సర్వీసులు తమ సేవలను అందించడం ప్రారంభించింది. నగరాంతర రైలు సౌకర్యం లేని నగరం అమెరికాలో ఫీనిక్స్ నగరం ఒక్కటే. ఫీనిక్స్ నగర డౌన్ టౌన్‌కు దక్షిణంలో ఉన్న మారికో వద్ద ది సన్ సెట్ లిమిటెడ్, టెక్సాస్ ఏగిల్ తమ సేవలను వారానికి మూడు సార్లు మాత్రమే ఇస్తుంది. ఇక్కడ వారి రైళ్ళు వారానికి మూడు ఆగుతుంది. అమ్‌ట్రాక్ త్రూ వే బస్సులు స్కై హార్బర్ నుండి ఫ్లాగ్ స్టాఫ్ వరకు బస్సులను నడుపుతూ ప్రయాణీకులకు దూరప్రాంత సేవలను అందించే సౌత్ వెస్ట్ చీఫ్ సేవలను పొందే వసతి కల్పిస్తుంది. ఈ మార్గం ఫీనిక్స్ నగరాన్నిలాస్ ఏంజలెస్, చికాగో నగరాలతో అనుసంధానిస్తుంది. విమానాశ్రయం 24 వ వీధిలో ఉన్న బస్టాండు స్థాపించి గ్రేహౌండ్ బసు సేవలను నగర ప్రజలకు అందిస్తుంది.

ప్రభుత్వ ప్రయాణ సేవలు

[మార్చు]

మహానగరమంతా ప్రభుత్వరంగానికి చెందిన వ్యాలీ మెట్రో సంస్థ తమ బస్సులు, రైళ్ళు, రైడ్ అండ్ షేర్ ప్రోగ్రాముల ద్వారా తమ సేవలను అందిస్తుంది. 3.38% ఉద్యోగులు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణిస్తున్నారు. వేసవి వాతారణంలోని వేడికి బస్సుల కొరకు ఎదురు చూడటం ప్రయాణీకులకు అతిశ్రమతో కూడుకున్న కార్యమే. నార్త్ సెంట్రల్ ఫీనిక్స్ నుండు తూర్పు భాగం వరకు మెసె, టెంపె లను కలుపుతూ వ్యాలీ మెట్రో 20 మైల్ ప్రాజెక్ట్ మెట్రో పేరుతో 2008 డిసెంబరు నుండి తమ సేవలను అందించడం ప్రారంభించింది. ముప్పై మైళ్ళ వరకు తమ సేవలను విస్తరించే ప్రణాళిక పరిశీలనలో ఉంది. ఇది 2025లో ముగియనున్నదని ఊహిస్తున్నారు.

సైకిల్

[మార్చు]

నగరంలోం.89% ప్రజలు తమ ప్రయాణాలకు సైకిల్‌ను ఉపయోగిస్తున్నారు. దశాబ్ధానికి ముందు ఇది 1.12% ఉంది. ది మారికోపా అసోసేషన్ ఆఫ్ గవర్నమెంట్ నగర సైకిల్ ప్రయాణీకులకు

మూలాలు

[మార్చు]
  1. Leatherman, Benjamin (2009-04-08). "Phoenix - Up on the Sun - AZPunk.com Returns". Archived from the original on 2009-05-03. Retrieved 2009-04-30. For those of you unfamiliar with AZPunk, it functioned as an information resource and meeting ground for P-Town's punk and hardcore community since being launched back in 2002 by founders Chris Lawson and Micah Elliot
  2. Lemons, Stephen (2007-10-10). "Pitiless P-Town". ఫీనిక్స్ న్యూస్. p. 1. Archived from the original on 2009-05-03. Retrieved 2009-04-30. The cranky cockatoo slams callous P-towners, pecks away at (sigh . . .) another bogus "plot" to off Sheriff Joe, and profiles the "Mexican Mutant"
  3. "[1] Archived 2010-03-29 at the Wayback Machine." United States Census Bureau. 2005. Retrieved on June 27, 2007.
  4. "Population Estimates for the 25 Largest U.S. Cities based on July 1, 2006 Population Estimates" (PDF). Archived from the original (PDF) on 2008-04-05. Retrieved 2009-05-04.
  5. "Annual Estimates of the Population for Incorporated Places in Arizona". United States Census Bureau. 2008-07-10. Archived from the original on 2008-08-04. Retrieved 2008-07-14.