Jump to content

బంజారా భాష

వికీపీడియా నుండి

బంజారా భాష

[మార్చు]

బంజారా భాష ప్రాచీన భాషలలో ఒకటి. భారతీయ భాషలైన హిందీ భాషతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. దేశంలో సుమారు పదిహేను కోట్ల మంది మాట్లాడుతారు. బరోపియాన్ కుటుంబానికి చెందిన ఇండో ఆర్యుల భాషకు దగ్గర సంబంధం ఉంది. ఈ భాషకు లిపి లేదు.బంజారా లు దేశమంతట ఒకే భాషను మాట్లాడుతారు.బంజారా భాషను దేవనగరి లిపిని అనుసరిస్తున్నారు[1].ఈ భాషను గోర్ బోలి అని కూడా అంటారు.

బంజారా భాష,(GOR BOLI)
బంజారా భాష
స్థానిక భాషభారత దేశము
ప్రాంతంభారత దేశంలోని 17 రాష్ట్రాలు
స్వజాతీయతబంజారా,లంబాడీ,సుగాలి,లమ్మాణీ ప్రజలు
స్థానికంగా మాట్లాడేవారు
దేశంలో 15 కోట్లు (లిపి లేదు)
బరోపియా కుటుంబము (ఇండో-ఆర్యుల భాషకు సంబంధం)
  • హిందీ -ఇరానీ భాషలు
    • హిందీ-అర్య భాషలు
      • పశ్చిమీ- హిందీ భాషలు
        • రాజస్థాని -మార్వడి
          • లంబాడీ,సుగాలి-లమ్మాణి
            • బంజారా భాష,(GOR BOLI)
దేవనగరి లిపి (బంజారా భాషకు లిపి లేదు)
అధికారిక హోదా
నియంత్రణబంజారా సేవా సంఘం తీర్మాణం
భాషా సంకేతాలు
ISO 639-3లంబాడీ
Glottologసుగాలి

భాష ప్రత్యేకత

[మార్చు]

బంజారా,లంబాడీ,సుగాలి గిరిజనులు ప్రత్యేకమైన బంజారి లేదా గోర్ బోలి భాషను మాట్లాడుతారు.అందువలన వీరిని గోర్ మాటి అని కూడా అంటారు.ఈ గోర్ బోలి భాషకు లిపి లేదు.ఇది బరోపియా కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యులభాషకు దగ్గర సంబంధం ఉంది. భారతీయ భాషలైన హిందీ, మార్వాడీ, మేవాతి,జయపురి మరాఠీ పంజాబీ, భోజ్ పురి,అవధీ, మొదలగు భాషలకు దగ్గర సంబంధం ఉంది. ఈ గోర్ బోలి భాషను దేశంలో సుమారుగా 15 కోట్ల మంది బంజారా ప్రజలు మాట్లాడుతున్నారు. భారత దేశంలో ఏ తాండకు వెళ్ళిన ఏ పట్టణానికి వెళ్ళిన ఏ జిల్లాకు వెళ్ళిన ఏ రాష్ట్రానికి వెళ్ళిన స్థానిక భాషలోని కొన్ని పదాలు తప్ప భాషలో పెద్దగా మార్పు ఏమి లేదు. దేశమంతటా ఒకే భాష ఒకే జాతి అందుకే అంటారు బంజారా సమాజ పెద్దలు ఏకజ్ జాత్ ఏకజ్ వాత్ ప్రస్తుత కాలంలో భారతీయ భాషల పై ఆంగ్లభాష ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండటం వలన భారతీయ రాజభాష యైనహిందీ భాష, రాష్ట్ర మాతృ భాష యైన తెలుగు భాష చాలా వరకు కల్పితమవుతున్నాయి. దానితో పాటు లిపి లేని బంజారా భాష (గోర్ బోలి) కూడా ఆంగ్లభాష ప్రభావానికి లోనవుతుంది.

హిందీ భాషతో సంబంధం

[మార్చు]

భారతీయ రాజభాష యైన హిందీ తో గోర్ బోలి భాషకు చాలా దగ్గర సంబంధం ఉన్నాయి. ఉదాహరణకు దాదా=దాదా,ఫూపా=ఫూపా,మామా=మామా,బెటా=బెటాహాతి=హాతి, ఏక్ =ఏక్, ఇలా సంఖ్యలు,వారాలు,ఆహార ధాన్యాలు కూరగాయలు, పండ్లు,కుటుంబం సభ్యులు శరీర అవయవాలు, జంతువులు, పక్షులు మొదలగు పేర్లతో చాలా శబ్దాలు,పదాలు, వాక్యాల ఉచ్చారణ ఒకేలా ఉండటం వలన వీరు స్థానిక తెలుగు భాష కంటే కూడా హిందీ భాషలోకి సరళంగా మాట్లాడుతూ సులభంగా భాషను అర్థం చేసుకోగల్గుతున్నారు. విద్యార్థులు ఇంటర్, డిగ్రీ యందు హిందీ భాషను సెకండ్ లాంగ్వేజ్ గా తీసుకోవడం‌ జరుగుతుంది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో హిందీ భాషను ఎంపిక చేసి చాలా వరకు హిందీ ఉపాధ్యాయులుగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం గోర్ బోలి భాషయే అని చేప్పక తప్పదు. గోర్ బోలి భాష ను ఎక్కువగా దేవనగరి లిపిలోనే అనుసరిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో బంజారా భాష

[మార్చు]

బంజారా భాష మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గోవా, గుజరాత, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ మొదలగు [2]రాష్ట్రాల్లో ఈ భాషను స్థానిక లిపిలో చాలా మంది భజన కీర్తనలు గాయకులు రాస్తున్నారు.బంజారా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలను హిందీ,తెలుగు,ఆంగ్లం, మరాఠీ,కన్నడ భాషల్లో కవులు రచయితలు అనేక బంజారా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు రచించి వివిధ రాష్ట్రాల విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టాను అందుకుంటున్నారు.

బంజారా భాషకు అరుదైన గౌరవం

[మార్చు]

హిందూవుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీత లోని 701శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించినందుకు గాను క్రేంద్ర ప్రభుత్వం కేతావత్ సోమ్లాల్ కు 2024 సంవత్సరానికి సాహిత్య విభాగంలో భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిం లోది[3].

8వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్

[మార్చు]

నేనుభారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 344(1) మరియు 351 ప్రకారం రాజ్యాంగం లోని ఎనిమిదవ షెడ్యుల్ గోర్ బోలిభాషను చేర్చాలని వీరి డిమాండ్కొ నసాగుతున్నాది[4].రాజ్యంగంలోని ఎనిమిదో షెడ్యుల్ చేర్చాలని తొలి సారిగా పార్లమెంటులో డిమాండ్ చేసిన మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎవత్మాల్ లోకసభ పార్లమెంటు సభ్యులు శ్రీ హరిభాహు రాథోడ్, ఆ తరువాత కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా లోక సభ నియోజక వర్గనికి చెందిన పార్లమెంటు సభ్యులు శ్రీ డా.ఉమేష్ జాదవ్, తెలంగాణ రాష్ట్రలోని మహబూబాబాద్ లోక సభ నియోజకవర్గం సభ్యురాలు శ్రీమతి మాలోత్ కవిత మొదలగు వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ గోర్ బోలి ఐన లంబాడీ భాషలో అనర్గళంగా ప్రశ్నల వర్షం కురిపించడం లంబాడీ బాష మరింత ప్రాధాన్యతను ఇవ్వడం హర్షించదగ్గ విషయం.దేశంలో 15 కోట్ల జనాభా కలిగి దాదాపు 40 పేర్లతో పిలువబడుతున్న బంజారాలు దేశమంతా ఒకే భాష, ఒకే జాతి, ఒకే వస్త్రధారణ, ఒకే సంస్కృతి సాంప్రదాయాలున్న వీరిని కేంద్ర ప్రభుత్వాలు ఒకే భాష బంజారా భాష ఒకే జాతి బంజారా జాతిగా గుర్తించాల్సిన అవసరం ఉంది.వీరికంటే తక్కువ జనాభా కలిగిన భాషకు గుర్తించిన ప్రభుత్వాలు బంజారా భాషను విస్మరించడం వలన భాష పట్టుత్వాన్ని కోల్పోతుంది.

మూలాలు

[మార్చు]
  1. Correspondent, Special (2022-09-10). "Giving a push to Banjara language". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-03-10.
  2. "Odisha State Tribal Museum | Banjara" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-03-10.
  3. ABN (2024-01-26). "Hyderabad: బంజారా భాషలో భగవద్గీత". Andhrajyothy Telugu News. Retrieved 2024-03-10.
  4. "Inclusion of Banjara language in 8th Schedule sought". The Hindu (in Indian English). 2012-03-04. ISSN 0971-751X. Retrieved 2024-03-13.