Jump to content

బహదూర్‌పల్లి

అక్షాంశ రేఖాంశాలు: 17°34′02″N 78°26′17″E / 17.567325°N 78.437985°E / 17.567325; 78.437985
వికీపీడియా నుండి

బహదూర్‌పల్లి, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, దుండిగల్ గండిమైసమ్మ మండలంలోని గ్రామం.[1]

బహదూర్‌పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
బహదూర్‌పల్లి is located in తెలంగాణ
బహదూర్‌పల్లి
బహదూర్‌పల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°34′02″N 78°26′17″E / 17.567325°N 78.437985°E / 17.567325; 78.437985
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం దుండిగల్ గండిమైసమ్మ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,051
 - పురుషుల సంఖ్య 2,582
 - స్త్రీల సంఖ్య 2,469
 - గృహాల సంఖ్య 1,195
పిన్ కోడ్ 08692
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 5,051 - పురుషుల సంఖ్య2,582 - స్త్రీల సంఖ్య 2,469 - గృహాల సంఖ్య 1,195.[2]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం. 2435 పురుషులు 1262 స్త్రీలు 1173 గృహాలు 485 విస్తీర్ణము 578 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు.

పాఠశాలలు

[మార్చు]

ఇక్కడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఉంది.

కళాశాల భవనాలు

[మార్చు]

బహుదూర్‌పల్లిలో 2.5 కోట్ల రూపాయలతో నిర్మించిన జూనియర్‌ కళాశాల భవనాన్ని 2022, జూలై 16న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు, ఒకేషనల్‌ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక-ఉపాధికల్పన శాఖామంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రావుల శ్రీధర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[3]

ఈ గ్రామంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ తన తండ్రి కేఎం.పాండు పేరిట కోటి రూపాయల సొంత నిధులతో నిర్మించిన కేఎం.పాండు మెమోరియల్‌ ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల భవనం 2023, ఆగస్టు 17న కేఎం పాండు 78వ జయంతి సందర్భంగా ప్రారంభించబడింది.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Quthbullapur/Bhadurpally[permanent dead link]
  3. telugu, NT News (2022-07-17). "మన పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య". Namasthe Telangana. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "Govt vocational college launched". The Times of India. 2023-08-18. ISSN 0971-8257. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.
  5. telugu, NT News (2023-08-18). "రూ.కోటితో ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల". www.ntnews.com. Archived from the original on 2023-08-18. Retrieved 2023-08-18.

మూలాల జాబితా

[మార్చు]