అక్షాంశ రేఖాంశాలు: 31°33′18″N 75°15′56″E / 31.55500°N 75.26556°E / 31.55500; 75.26556

బాబా బకాలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాబా బకాలా
పట్టణం
బాబా బకాలా is located in Punjab
బాబా బకాలా
బాబా బకాలా
పంజాజ్ పటంలో పట్టణ స్థానం
బాబా బకాలా is located in India
బాబా బకాలా
బాబా బకాలా
బాబా బకాలా (India)
Coordinates: 31°33′18″N 75°15′56″E / 31.55500°N 75.26556°E / 31.55500; 75.26556
దేశం భారతదేశం
రాష్ట్రంపంజాబ్
విభాగంపంజాబ్ ప్రాంతం
జిల్లాఅమృత్‌సర్ జిల్లా
మండలంబాబా బకాలా
జనాభా
 (2011)
 • Total8,946
భాషలు
 • అధికారికపంజాబ్
 • ప్రాంతంపంజాబీ భాష
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
143201[1]
Vehicle registrationపిబి-17
అమృత్‌సర్అమృత్‌సర్
శాసనసభ నియోజకవర్గం25

బాబా బకాలా అనేది పంజాబ్‌ రాష్ట్రం, అమృత్‌సర్ జిల్లాలోని ఒక చారిత్రాత్మక పట్టణం.[2] గురుద్వారా బాబా బకాలా సాహిబ్ ఉన్న ప్రదేశంగా ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది.

చరిత్ర

[మార్చు]

సాహిబ్ సిక్కుల 9వ గురువు గురు తేజ్ బహదూర్‌, ఈ పట్టణంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అతను ఇక్కడ 26 సంవత్సరాల 9 నెలల 13 రోజులపాటు ధ్యానం చేసినట్లు చెబుతారు. దీనికి గుర్తుగా ఆ స్థలంలో గురుద్వారా కూడా ఉంది.[3]

బాబా బకాలా సాహిబ్‌ని మొదట బక్కన్-వాలా (పర్షియన్ భాషలో 'జింకల పట్టణం' అని అర్థం) అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది బకాలాగా స్థిరనడిపోయింది. ఈ పట్టణం మొదట ఒక మట్టిదిబ్బగా ఉండేది, ఇక్కడ జింకలు మేపుతూ ఉండేవి. గురు తేజ్ బహదూర్‌ ఢిల్లీలో మరణించే సమయంలో గురు హర్ క్రిషన్ "బాబా బకాలే" అని పలికాడు. బకాలా పట్టణంలో గురు వారసుడు కనుగొనబడతారని అర్థం. తదుపరి గురువు కనుగొనబడిన తర్వాత, "బాబా బకాలే" అనే పదం పట్టణపు అధికారిక పేరు, బాబా బకలా సాహిబ్‌గా పరిణామం చెందింది.

భౌగోళికం

[మార్చు]

ఈ బాబా బకాలా పట్టణం 31°33′18″N 75°15′56″E / 31.55500°N 75.26556°E / 31.55500; 75.26556 అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది. అమృత్‌సర్ నగరంలోని గోల్డెన్ టెంపుల్ నుండి 43 కి.మీ.ల (26.7 మైళ్ళు) దూరంలో, [3] జలంధర్‌కు వాయవ్యంగా 46.5 కి.మీ.ల (28.9 మైళ్ళు) దూరంలో, రాష్ట్ర రాజధాని చండీగఢ్‌కు వాయవ్యంగా 93 కి.మీ.ల (120.5 మైళ్ళు) దూరంలో ఈ పట్టణం ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బాబా బకాల పట్టణంలో 1,834 గృహాలు ఉండగా 8,946 జనాభా ఉంది. ఇందులో పురుషులు 4,697 మంది, స్త్రీలు 4,249 మంది ఉన్నారు. లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 905 మంది స్త్రీలుగా ఉంది.[4]

ఇక్కడ సిక్కు మతం అత్యంత ప్రముఖమైన మతం. హిందూ మతం, జైనమతం కూడా ఉన్నాయి. ఈ పట్టణం ఏర్పడినపుడు భుల్లర్ జాట్‌లు, శుక్లా పండిట్‌లు నివాసులుగా ఉండేవారు. 1947 భారత విభజన సమయంలో వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు కూడా ఉన్నాయి.

రాజకీయం

[మార్చు]

ఈ పట్టణం బాబా బకాలా అసెంబ్లీ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Baba Bakala PIN code". sulekha.com. n.d. Retrieved 2022-11-19.[permanent dead link]
  2. "Baba Bakala, Amritsar, Punjab". maplandia.com. n.d. Retrieved 2022-11-19.
  3. 3.0 3.1 "Baba Bakala Sahib, Amritsar, Punjab". Official website of Amritsar district. amritsar.nic.in. n.d. Retrieved 2022-11-19.
  4. "GOI Census 2011". n.d. Retrieved 2022-11-19.