బూర నర్సయ్య గౌడ్

వికీపీడియా నుండి
(బూర నరసయ్యగౌడ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బూర నర్సయ్య గౌడ్
బూర నర్సయ్య గౌడ్


ఎంపి
పదవీ కాలము
2014 -
ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నియోజకవర్గము భువనగిరి

వ్యక్తిగత వివరాలు

జననం (1959-03-02) 1959 మార్చి 2 (వయస్సు: 60  సంవత్సరాలు)
సూర్యాపేట, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందు

బూర నర్సయ్య గౌడ్ భారతీయ రాజకీయ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యులు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నరసయ్య వృత్తిరిత్యా వైద్యుడు. లాప్రోస్కోపిక్, స్థూలకాయం, జీర్ణశయాంతర మొదలైనదానిలో వైద్యం చేశారు. నరసయ్య 20,000 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ లోని సూర్యాపేట జన్మించారు. అతను ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తిచేశారు.

వృత్తి జీవితం[మార్చు]

ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ లాప్రోస్కోపిక్ సర్జరీ (HILLS) కి డైరెక్టర్ గా ఉన్నారు. అందేకాకుండా ఆదిత్య హాస్పిటల్, కేర్ హాస్పిటల్ లలో వైద్య సేవలు అందిస్తున్నారు. బూర లక్ష్మయ్య, రాజమ్మ ఫౌండేషన్ ను స్థాపించి వ్యవస్థాపక చైర్మెన్ గా ఉంటూ పిల్లలు లేని జంటలకు ఉచిత లాప్రోస్కోపిక్ సేవలు అందిస్తున్నారు. తెలంగాణ లోని గ్రామ ప్రాంతాలలో లాప్రోస్కోపిక్ సర్జరీపై అవగాహన కల్పిస్తున్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు. ఆయన టీఆర్‌ఎస్‌లో 2013 జూన్‌ 2న చేరి, 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందాడు. స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్‌ వెల్ఫేర్‌ ఆఫ్‌ ఓబీసీస్, కన్సల్టేటì వ్‌ కమిటీ ఆన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సభ్యుడిగా ఉన్నాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఫెల్లోషిప్స్[మార్చు]

బూర నర్సయ్య గౌడ్ వివిథ సంస్థలనుండి ఫెల్లోషిప్స్ పొందారు:[1]

  • ఫెల్లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ సర్జన్స్ (ఎఫ్.ఎ.ఐ.ఎస్)
  • ఫెల్లో ఇంటర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (ఎఫ్.ఎ.సి.ఎస్)
  • ఫెల్లో మినిమల్ ఆక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎమ్.ఎ.ఎస్)

పురస్కారాలు[మార్చు]

  • 1989 లో కేంద్ర ఆరోగ్య శాఖ నుండి ప్రత్యేక సర్జికల్ నైపుణ్యము అవార్డు[1]
  • 1990 లో ఉత్తమ సర్జన్ అవార్డు[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "Laparoscopy :: Dr.B.Narsaiah". Web.archive.org. 2011-07-13. మూలం నుండి 13 July 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-07-01. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)