Jump to content

బేరియం హైడ్రాక్సైడ్

వికీపీడియా నుండి
(బేరియం హైడ్రాక్సైడు నుండి దారిమార్పు చెందింది)
బేరియం హైడ్రాక్సైడ్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [17194-00-2]
పబ్ కెమ్ 28387
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32592
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య CQ9200000
SMILES [Ba+2].[OH-].[OH-]
ధర్మములు
Ba(OH)2
మోలార్ ద్రవ్యరాశి 171.34 g/mol (anhydrous)
189.39 g/mol (monohydrate)
315.46 g/mol (octahydrate)
స్వరూపం white solid
సాంద్రత 3.743 g/cm3 (monohydrate)
2.18 g/cm3 (octahydrate, 16 °C)
ద్రవీభవన స్థానం 78 °C (172 °F; 351 K) (octahydrate)
300 °C (monohydrate)
407 °C (anhydrous)
బాష్పీభవన స్థానం 780 °C (1,440 °F; 1,050 K)
mass of BaO (not Ba(OH)2):
1.67 g/100 mL (0 °C)
3.89 g/100 mL (20 °C)
4.68 g/100 mL (25 °C)
5.59 g/100 mL (30 °C)
8.22 g/100 mL (40 °C)
11.7 g/100 mL (50 °C)
20.94 g/100 mL (60 °C)
101.4 g/100 mL (100 °C)
ద్రావణీయత in other solvents low
Basicity (pKb) -2.02
వక్రీభవన గుణకం (nD) 1.50 (octahydrate)
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
octahedral
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−944.7 kJ/mol
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు మూస:R20/22
S-పదబంధాలు (S2), S28
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Calcium hydroxide
Strontium hydroxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

బేరియం హైడ్రాక్సైడ్ ఒక రసాయన సమ్మేళనపదార్థం.ఇది ఒక ఆకర్బన సమ్మేళనం.బేరియం, హైడ్రోజన్, ఆక్సిజన్ మూలకాల సంయోగం వలన బేరియం హైడ్రాక్సైడ్ ఏర్పడినది.రసాయన ఫార్ములా ఫార్ములా Ba (OH) 2 (H2O) x.ఫార్ములాలోని x=1 లేదా 8 అయ్యిఉండును. x అణువులోని నీటి అణువుల సంఖ్యను తెలుపును.. బేరియం హైడ్రాక్సైడ్ అణువు ఒక నీటి బిందువు/అణువును కలిగిఉన్న (monohydrate (x =1) ), దానిని baryta లేదా baryta-waterఅందురు, బేరియం యొక్క సమ్మేళన పదార్థాలలో మోనోహైడ్రెట్బేరియం హైడ్రాక్సైడ్ ముఖ్యమైనది.

భౌతిక గుణాలు

[మార్చు]

బేరియం హైడ్రాక్సైడ్ తెల్లని ఘన పదార్థం.నిర్జల బేరియం హైడ్రాక్సైడ్ యొక్క అణుభారం 171.34 గ్రాములు/మోల్. సమ్మేళనం అణువులో ఒకనీటిఅణువు (Monohydrate) కలిగిన బేరియం హైడ్రాక్సైడ్ అణుభారం 189.39 గ్రాములు/మోల్, ఎనిమిది నీటి అణువులను (octahydrate) కలిగిన బేరియం హైడ్రాక్సైడ్ అణు భారం315.46 గ్రాములు/మోల్.అలాగే ఈ సమ్మేళనం యొక్క సాంద్రత విలువ కుడా, బేరియం హైడ్రాక్సైడ్ అణువులోని నీటి అణువుల సంఖ్యను బట్టి మారును.నీటి అణువు కలిగిన బేరియం హైడ్రాక్సైడ్ (monohydrate) ) యొక్క సాంద్రత 3.743 గ్రాములు/సెం.మీ3.కాగా ఎనిమిదినీటి అణువులు ( octahydrate) కలిగిన బేరియం హైడ్రాక్సైడ్ సాంద్రత2.18 గ్రాములు/సెం.మీ3,16 °C వద్ద.నీటి లోకరుగుతుంది.ఇతర ద్రావణులలో కరుగదు.ఆక్టాహైడ్రేట్ బేరియం హైడ్రాక్సైడ్‌ యొక్క వక్రిభవన సూచిక 1.5.

ఉత్పత్తి –అణునిర్మాణం

[మార్చు]
Coordination sphere about an individual barium ion in Ba (OH) 2.H2O.

బేరియం ఆక్సైడ్ (BaO) ను నీటిలో కరిగించడం వలన బేరియం హైడ్రాక్సైడ్ ఏర్పడును.

BaO + 9 H2O → Ba(OH)2•8H2O

ఏర్పడిన బేరియం హైడ్రాక్సైడ్ ఆక్టా హైడ్రేట్^గా స్పటికరణ చెందుతుంది. ఆక్టాహైడ్రేట్ బేరియం హైడ్రాక్సైడ్‌ను గాలిలో వేడి చేసిన మోనోహైడ్రేట్‌గా మారును.మోనో హైడ్రేట్ బేరియం హైడ్రాక్సైడ్, వాక్యుంలో (పీడన రహిత స్థితిలో),100 °C వద్ద బేరియం ఆక్సైడును విడుదల చేయును. Ba2+ కేంద్రాలు స్క్వేర్ అంటి ప్రిస్మాటిక్ క్షేత్రస్థితి (geometryపొంది యుండును. ప్రతి Ba2+ కేంద్రం రెండు నీటి లిగండ్స్ (ligands), 6 హైడ్రాక్సైడ్ లింగడ్సు చేత ఆవృతమై ఉండును. ఇవిరెండింతలు, మూడింతలుగా పొరుగు Ba2+కేంద్రంలకు సేతు బంధాన్ని కల్పించును.ఆక్టా హైడ్రేట్ లో విడి Ba2+ కేంద్రకాలు, లిగండ్స్ గా కాకుండ ఎనిమిది కోఅర్డినేట్‌లుగా ఉండును.

ఉపయోగాలు

[మార్చు]

పారిశ్రామికంగా బేరియం సంయోగ పదార్థాల ఉత్పత్తికి బేరియం హైడ్రాక్సైడ్ పుర్వగామి (precursor) గా ఉపయోగిస్తారు.మోనోహైడ్రేట్ బేరియం హైడ్రాక్సైడ్‌ను, వివిధ ఉత్పత్తులను నిర్జలం (dehydrate) చెయ్యుటకు, వాటిలోని సల్ఫేట్‌లను తొలగించుటకు ఉపయోగిస్తారు.

విశ్లేషణ రసాయనశాస్త్రం (analytical chemistry) లో బలహీన ఆమ్లాలను, ముఖ్యంగా సేంద్రియ ఆమ్లాలను టైట్రెసను (titration) చెయ్యుటకు ఉపయోగిస్తారు. బేరియం కార్బోనేట్ నీటిలో కరుగదు కనుకబేరియం హైడ్రాక్సైడ్ సజలద్రావణం, కార్బోనేట్‌ను మలినంగా కలిగి ఉండదు.అందువలన టైట్రెసను సమయంలో పినాఫ్తలిన్ లేదా థయ్‌మోప్తలిన్‌లను ఇండికేటరులుగా ఉపయోగించవచ్చును.

బేరియం హైడ్రాక్సైడ్‌ను బలమైన క్షారముగా సేంద్రియ సంశ్లేషణ (organic synthesis) లో ఉపయోగిస్తారు.ఉదాహరణకు ఎస్టరులు, నైట్రైల్స్‌ల హైడ్రాలిసిస్ చెయునప్పుడు బేరియం హైడ్రాక్సైడ్‌ను క్షారముగా ఉయోగిస్తారు.

అమినో ఆమ్లాలను డికార్బోక్సిలేసన్ చెయ్యుటకు బేరియం హైడ్రాక్సైడ్‌ను ఉపయోగిస్తారు, ఈ చర్యలో బేరియం కార్బోనేట్ విడుదల అగును.బేరియం హైడ్రాక్సైడ్‌ను సైక్లో పెంటానొన్, డైఅసిటోన్ ఆల్కహాల్, D-గులోనిక్ γ-లాక్టోన్‌ల తయారిలో ఉపయోగిస్తారు.

రసాయన చర్యలు

[మార్చు]

బేరియం హైడ్రాక్సైడ్ ను 800 °C వరకు వేడిచేసిన బేరియం ఆక్సైడ్‌గా విఘటన చెందును. బేరియం హైడ్రాక్సైడ్‌తో కార్బన్ డై ఆక్సైడ్ /బొగ్గుపులుసు వాయువు రసాయాన చర్య వలన బేరియం కార్బోనేట్ ఏర్పడును. బేరియం హైడ్రాక్సైడ్ యొక్క సజల ద్రావణంఅధిక క్షారతత్త్వం కలిగి ఉన్నందున ఇది ఆమ్లాలతో తటస్థి కరణ (neutralization) రసాయన చర్య జరుపును. అందువలన సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య వలన బేరియం సల్ఫేట్, ఫాస్ఫారిక్ ఆమ్లంతో చర్య వలన బేరియం ఫాస్పేట్‌ను ఏర్పరచును. హైడ్రోజన్ సల్ఫైడ్‌తో రసాయనచర్య వలన బేరియం సల్ఫైడ్ ఉత్పన్నమగును.

బేరియం హైడ్రాక్సైడ్ యొక్క సజల ద్రవాలను, లోహ లవణాల సజల ద్రవణాలో మిశ్రమంచేసినప్పుడు ద్వంద బదిలీ చర్య (double replacement reaction) వలన కరుగని, అవక్షేపపాలుగా బేరియం లవణాలు ఉత్పన్నమగును.అమ్మోనియం లవణాలతో బేరియం హైడ్రాక్సైడ్ శక్తివంతమైన, బలీయమైన ఉష్ణ గ్రాహక (endothermic) చర్య జరుపును.

రక్షణ/భద్రత

[మార్చు]

బలమైన క్షారాలు, నీటిలో కరుగు బేరియం లవణాలు ఎటువంటి హాజర్డ్ లక్షణాలు కలిగి ఉన్నాయో బేరియం హైడ్రాక్సైడ్‌కుడా అటువంటి లక్షణాలు పొంది ఉంది.ఇది ఇతర పదార్థాలను తినివేయు గుణంకలిగిన, విషగుణం ఉన్న సమ్మేళన పదార్థం.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]