భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రాచీన శిలాయుగం (Paleolithic Age) లో చివరి దశ (మూడవ దశ) ను "ఉత్తర ప్రాచీన శిలాయుగం" (Upper Paleolithic Age) గా పేర్కొంటారు. భారతదేశంలో ఈ దశ సుమారు క్రీ.పూ. 35,000 సంవత్సరాల కాలం నుండి క్రీ.పూ. 10,000 సంవత్సరాల వరకూ కొనసాగింది.[1] ఈ దశ అంతిమ ప్లీస్టోసిన్ శకం (Late Pleistocene Age) లో కొనసాగింది. ఈ దశలో మనుగడలో వున్న మానవజాతి హోమో సేపియన్స్. క్రీ.పూ. 10,000 నాటికి ప్లీస్టోసిన్ శకం ముగియడం, దానితో పాటు ఉత్తర ప్రాచీన శిలాయుగం కూడా ముగియడం జరిగింది. అంటే క్రీ.పూ. 10,000 నాటికి భారతదేశంలో ప్రాచీన శిలాయుగ సంస్కృతి (Paleolithic Age) అంతమై మధ్య శిలాయుగ సంస్కృతి (Mesolithic Age) ప్రారంభమైంది.


భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగానికి చెందిన ఇతర స్థావరాలు[మార్చు]

భారత దేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగపు మానవులు ఉపయోగించిన శిలా పరికరాలు భారతదేశంలో పలు ప్రదేశాలలో కనిపించాయి. ముఖ్యంగా బెలాన్, నర్మదా, చంబల్, సోన్, సబర్మతి, కృష్ణా, గోదావరి, బ్రాహ్మణీ మొదలగు నదీ పరివాహక ప్రాంతాల లోను, తూర్పు కనుమలలోను, చోటా నాగపూర్, రాయలసీమ పీఠభూములలోను విసృతంగా లభించాయి. భారతదేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతికి సంబందించిన ప్రదేశాలు 566 కు పైగా గుర్తించారు.

భారత దేశంలో ఉత్తర ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన కొన్ని ముఖ్య ప్రదేశాలు

రాష్ట్రం ఉత్తర ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు
జమ్మూ & కాశ్మీర్ పహల్గామ్ (pahalgam)
ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ లోని లెఖానియ (Lekhania), బెలాన్ లోయ (Belan Valley), సింగ్రౌలి (Singrauli)
రాజస్తాన్ దిద్వానా (Didwana), 
గుజరాత్ సబర్మతీ లోయ, ఇసుక దిబ్బల ప్రాంతాలు
మహారాష్ట్ర నెవాసా
మధ్యప్రదేశ్ భీమ్ బేత్క (Bhimbetka), చంబల్ బేసిన్ లోని పహార్‌ఘర్ (Pahargarh), హాత్‌నోరా (Hathnora), ఆదంగర్ (Adamgarh)
ఒరిస్సా చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతాలు, మయూర్‌భంజ్ (Mayurbhang)
తెలంగాణ భద్రాచలం (ఖమ్మం), ఏలేశ్వరం (నల్గొండ), పాకాల, ఘనాపూర్ (వరంగల్), గౌరిగుండం (కరీంనగర్), చంద్రగుప్త పట్టణం [2] (అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా), బుర్జుంగల్ (అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా), వాంకిడి (నేరడిగొండ, ఆదిలాబాద్), బోథ్ (ఆదిలాబాద్)
ఆంధ్రప్రదేశ్ నాగార్జునకొండ, రేణిగుంట, యర్రగొండపాలెం, కడప జిల్లా, బేతంచెర్ల, కేతవరం
కర్నాటక  హునసగి-బైచ్బాల్ లోయ (Hunasagi-Baichbal Valley)
తమిళనాడు కొర్తాళయార్ లోయ (kortallayar valley), అత్తిరాంపక్కం (Attirampakam)

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభించిన కొన్ని ముఖ్య ప్రదేశాలు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గోదావరి, పెన్నా సువర్ణముఖి మొదలగు పరివాహక ప్రదేశాలలోనూ, నాగులేరు, సాగిలేరు, గుండ్లకమ్మ, పాలేరు, మున్నేరు, ఏలేరు, కుందేరు, రాల్లకాలువ మొదలగు వాగుల తీర భూములలోను, రాయలసీమ పీఠభూమి ప్రాంతాలలోను, తూర్పు కనుముల (Eastern Ghats) ప్రాంతాలలోను విసృతంగా లభించాయి.

జిల్లా ఎగువ ప్రాచీన శిలాయుగ సంస్కృతికి చెందిన పనిముట్లు బయల్పడిన ప్రదేశాలు
గుంటూరు కారంపూడి (పల్నాడు), నాగార్జునసాగర్, నాగార్జునకొండ, వినుకొండ
ప్రకాశం సింగరాయకొండ, కనిగిరి, వెలిగండ్ల, యర్రగొండపాలెం, గుండ్ల బ్రహ్మేశ్వరం
నెల్లూరు భోగసముద్రం, కావలి 
కడప ముద్దనూరు, వేముల, పెద్దరాజుపల్లి, బెళ్ళు, నాగవరం
కర్నూలు కేతవరం (దొన్), బేతంచెర్ల (దొన్), ముచ్చట్ల చింతమాను గవి గుహలు (Muchchatla Chintamanu Gavi), శ్రీశైలం, వెల్దుర్తి, రామళ్లకోట
చిత్తూరు రేణిగుంట, ఏర్పేడు (కాళహస్తి), జింకలమిట్ట, వెదుళ్లచెరువు, నల్లగుండ్లు
అనంతపురం  ఉదిరిపికొండ, దొరిగల్లు

రిఫరెన్స్‌లు[మార్చు]

  • History of India, Vol. I, Romila Thapar
  • Studies in Ancient Indian Social history by Romila Thapar
  • Ancient India by Ram Sharan Sharma
  • India's Ancient Past by R.S. Sharma, Oxford University Press.2016 Ed
  • The birth of Indian Civilization by Allchin, B&R
  • An Introduction to Indian archaeology by HD Sankalia
  • The Stone Age in India by P.T. Srinivasa Iyengar
  • Pre-historic South India by V R Ramachandra Dikshitar
  • The lower Paleolithic of the Indian subcontinent by Parth R. Chauhan
  • దక్షిణ భారత దేశ చరిత్ర, వి. సుందర రామశాస్త్రి, తెలుగు అకాడమి
  • The Indian Paleolithic Encyclopedia Britanica
  • ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర-సంస్కృతి (ప్రాక్ పురాయుగం - క్రీ.పూ. 500 వరకు), MLK మూర్తి, AP History Congress
  • Indian Archaeology 1988-89 A Review [1],1993 Edited by M.C.Joshi, Published by Director general of Archaeolgical Survey of India, Government of India, New Delhi

మూలాలు[మార్చు]

  1. R.S, Sharma. India's Ancient Past (2016 ed.). New Delhi: Oxford University Press. p. 56.
  2. M.C., Joshi (1993). Indian Archaeology 1988-89 A Review. New Delhi: Director general of Archaeolgical Survey of India, Government of India. p. 2.