భారతదేశ స్వంత ఆర్థిక మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లోని ఆర్థిక మండలాలు

భారతదేశానికి 2,305,143 km2 (890,021 sq mi) విస్తీర్ణమున్న స్వంత ఆర్థిక మండలం (ఇఇజెడ్) ఉంది. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ఆర్థిక మండలాల్లో ఇది 18 వ స్థానంలో ఉంది. [1] దేశానికి నైరుతి దిశలో ఉన్న లక్కదీవ్ సముద్రంలోని లక్షద్వీపాలు ద్వీప సమూహం, [2] బంగాళాఖాతం, అండమాన్ సముద్రాల్లో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు ఈ మండలంలో భాగం. [3] భారతదేశపు అర్థిక మండలానికి పశ్చిమాన పాకిస్తాన్, దక్షిణాన మాల్దీవులు, శ్రీలంక, తూర్పున బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియాల ఆర్థిక మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. కొత్తగా అందుబాటు లోకి వచ్చిన శాస్త్రీయ డేటా ఆధారంగా భారతదేశం, తన అర్థిక మండలాన్ని 200 నాటికల్ మైళ్ల నుండి 350 మైళ్లకు పొడిగించాలని ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది. [4]

చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్

[మార్చు]

భారతదేశం ఇఇజెడ్ భావనను "టెరిటోరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్, ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ అదర్ మారిటైమ్‌ జోన్స్ యాక్ట్, 1976" లో చట్టబద్ధంగా నిర్వచించింది. 1997 జూన్‌లో భారతదేశం UNCLOS ను ఆమోదించింది. లైసెన్సు లేకుండా భారతీయ ఇఇజెడ్‌లో విదేశీ నౌకల ద్వారా చేపలు పట్టడాన్ని నిషేధిస్తూ భారతదేశం "మారిటైమ్ జోన్స్ ఆఫ్ ఇండియా (విదేశీ నౌకలచే చేపలు పట్టడం నియంత్రణ) చట్టం, 1981" ని కూడా రూపొందించింది. అదనంగా, ఇఇజెడ్లో పనిచేస్తున్న భారతీయ ఫిషింగ్ ఓడలచే చేపలు పట్టడాన్ని, చేపల పెంపకాన్నీ నియంత్రించే చట్టాలను కూడా రూపొందించింది. [5]

ఇఇజెడ్ ప్రాముఖ్యత

[మార్చు]
గ్రేటర్ ఇండియా: ఇండోనేషియా, మలేషియా ( శ్రీవిజయ, మజాపహిత్, కళింగ, కుటై, సింఘాసరి, తరుమనగర, పాన్ పాన్, గంగా నెగరా, లంకాసుకా), ఇండోచైనా (చంపా, ఫునాన్, చెన్లా ), థాయిలాండ్ ( ద్వారావతి ), మయన్మార్ (పాగన్) వంటి సముద్ర సిల్క్ మార్గంలో అనేక భారతీయ హిందూ-బౌద్ధ రాజ్యాల ద్వారా ఆగ్నేయాసియా అంతటా చారిత్రక భారతీయ సాంస్కృతిక ప్రభావం విస్తరించింది. ఇది ఇఇజెడ్ భావనకి సంబంధించిన మార్గమే.

ఓ దేశం తన స్వంత ఆర్థిక మండలం ద్వారా చమురు, సహజ వాయువు, ఖనిజాలు, వాణిజ్య స్థాయిలో చేపలు పట్టడం, ఇతర సముద్ర వనరులను పొందడంలో స్వేచ్ఛను పొందడమే కాకుండా, నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్యం, జాతీయ భద్రత, ఇతర దేశాలపై వ్యూహాత్మక పరపతి వంటి అంశాల్లో ప్రయోజనం పొందుతుంది. [4] [5] 7,500 కి.మీ. తీరరేఖ, 23 లక్షల చ.కి.మీ. పైచిలుకు విస్తీర్ణమున్న ఆర్థిక మండలం, ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, రవాణా నౌకల నావిగేషన్లపై నియంత్రణతో పాటు తన ఇఇజెడ్లోని వనరులపై భారతదేశానికి ప్రత్యేక నియంత్రణ కలుగుతుంది. [5] 2014 అధ్యయనం ప్రకారం, భారతదేశపు ఆర్థిక మండలంలో ఏటా 39.2 లక్షల టన్నుల సముద్ర మత్స్య సంపదను వాడుకునే అవకాశం ఉండగా, 32 లక్షల టన్నులను మాత్రమే వాడుకుంటోంది. [5]

విదేశీ నౌకల ద్వారా పైరసీ, వేట లేదా అక్రమ చేపల వేట, నౌకాయాన స్వేచ్ఛ, విదేశీ నౌకలను భారతీయ ఇఇజెడ్లోకి అతిక్రమించడం, పరస్పర విరుద్ధమైన వాదనలు ఇఇజెడ్లో ప్రధాన సమస్యలు. మలక్కా జలసంధిలో ఉన్న పైరసీ అన్ని దేశాలకు ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. వ్యవస్థీకృతంగా జరుగుతున్న అక్రమ చేపల వేట కారణంగా భారతీయ ఇఇజెడ్లో చేపల నిల్వలు క్షీణించడం, అనేక సముద్ర పర్యావరణ ప్రాంతాలు నాశనం కావడం జరుగుతోందని అధ్యయనాలు చూపించాయి. ఫలితంగా అనేక అంతరించిపోతున్న, అంతరించే ముప్పున్న జాతుల జీవులలో క్షీణత ఏర్పడింది. పైరసీ కారణంగా నావిగేషన్ స్వేచ్ఛ ఆందోళన కలిగిస్తోంది. భారత ఇఇజెడ్ చుట్టూ చైనా చేపడుతున్న చర్యల వల్ల జాతీయ భద్రతకు ముప్పు కూడా వాటిల్లుతోంది. దేశాల ద్వారా ఇఇజెడ్ పై వివాదాల వాదనలు భారతదేశం-పాకిస్తాన్ సర్ క్రీక్ వివాదం వంటి వివాదాలకు దారితీసాయి. గతంలో UNCLOS, కాంటినెంటల్ షెల్ఫ్ పొడవుకు సంబంధించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఇఇజెడ్ విస్తీర్ణాన్ని పెంచుతూ అనేక పరస్పర విరుద్ధమైన వాదనలను ఆమోదించింది. ఈ UNCLOS వైరుధ్యాల కారణంగా విస్తరించిన ఇఇజెడ్లోని వనరుల కోసం అనేక దేశాలు పోటీ పడుతూ ఒకే ప్రాంతంపై పలు వాదనలు చేస్తున్న పరిస్థితి తలెత్తింది. [5]

తీరానికి సమీపంలో భారత తీర రక్షక దళం, తీరం నుండి సముద్రం లోపలి ప్రాంతంపై భారతీయ సైన్యానికి చెందిన సమీకృత అండమాన్ నికోబార్ కమాండ్లు భారతదేశపు ఇఇజెడ్ ను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

భారతదేశపు ప్రస్తుత ఇఇజెడ్ ప్రాంతం

[మార్చు]
ఇఇజెడ్ విస్తీర్ణం (కిమీ 2 / మై 2 )
దేశపు ప్రధాన భూభాగం, లక్షద్వీపాలు కలిసి 1,641,514 square kilometres (633,792 sq mi)
అండమాన్ నికోబార్ దీవులు 663,629 square kilometres (256,229 sq mi)
మొత్తం 2,305,143 square kilometres (890,021 sq mi)

పెరిగిన భారతదేశపు ఇఇజెడ్ ప్రాంతం - భారత వాదన

[మార్చు]

2010లో, కొత్తగా వెలుగు లోకి వచ్చిన అవక్షేపణను బట్టి, శాస్త్రీయ ఆధారాలను బట్టీ, భారతదేశ ఇఇజెడ్ని 200 నాటికల్ మైళ్ల నుండి 350 నాటికల్ మైళ్లకు పెంచాలని కోరుతూ భారతదేశం, ఐక్యరాజ్యసమితిని అభ్యర్థించింది. ఇఇజెడ్ని 200 నుండి 350 నాటికల్ మైళ్లకు పొడిగించడం వల్ల భారతదేశపు ప్రస్తుత ఇఇజెడ్ దాదాపు రెట్టింపు అవుతుంది. కాంటినెంటల్ షెల్ఫ్ 200 నాటికల్ మైళ్లకు మించి విస్తరించి ఉన్నట్లు ఆధారాలు చూపితే, UNCLOS సాధారణ 200 నాటికల్ మైళ్ల పరిమితిని మించి గరిష్టంగా 350 నాటికల్ మైళ్ల వరకు ఇఇజెడ్ పొడిగింపును అనుమతిస్తుంది. ఇఇజెడ్ కు సంబంధించి ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్, మ్యాపింగ్ కోసం, భారతదేశ భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ (MoES) 1999లో ఒక ప్రాజెక్టును ప్రారంభించింది. 2018 నాటికి ఇది 30% పూర్తయింది. అనేక జాతీయ సంస్థల నుండి 60 మంది శాస్త్రవేత్తల బృందం జియో-సైంటిఫిక్ మ్యాపింగ్, ఫిజియోగ్రఫీ, సెడిమెంటాలజీ, పాలియోక్లిమాటాలజీ, హిమాలయన్ టెక్టోనిక్స్, హైడ్రాలజీ ఆఫ్ ఇండియా, దక్షిణాసియా ఋతుపవనాలు, ఖనిజ వనరుల లభ్యతలపై బహుళ-రంగ అధ్యయనాలను చేపట్టడం ప్రారంభించింది. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ (NCPOR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (NIO), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) వంటి అనేక సంస్థలు, విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ అధ్యయనాలలో పాల్గొన్నారు. ఈ అధ్యయనాల వలన దేశపు తీర ప్రాంతంలో నివసించే ప్రజలు పర్యావరణ ప్రమాదాల సమయంలో సంసిద్ధులయ్యేందుకు వీలు కలిగిస్తాయి. [5]

పొరుగున ఉన్న ఇఇజెడ్‌లు

[మార్చు]

పొరుగున ఉన్న ఇతర దేశాల ఇఇజెడ్‌లు- పశ్చిమం నుండి తూర్పుగా:

ఇఇజెడ్ వివాదం (Y/N) దూరం వ్యాఖ్యలు
పాకిస్తాన్ ఉంది ఆనుకుని ఉన్నాయి సర్ క్రీక్ వివాదం
శ్రీలంక లేదు ఆనుకుని ఉన్నాయి ఇండో-శ్రీలంక మారిటైమ్ ఒప్పందం (కచ్చతీవు ద్వీపం) ప్రకారం పరిష్కరించబడింది.
మాల్దీవులు లేదు ఆనుకుని ఉన్నాయి భారతదేశం-మాల్దీవులు సముద్ర జలాల ఒప్పందం (మినికాయ్ ద్వీపం) కింద పరిష్కరించబడింది.
బంగ్లాదేశ్ లేదు ఆనుకుని ఉన్నాయి భారతదేశం-బంగ్లాదేశ్ సముద్ర జలాల మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించబడింది.
మయన్మార్ లేదు భారతదేశపు ల్యాండ్‌ఫాల్ ద్వీపం మయన్మార్‌కు చెందిన కోకో దీవుల నుండి 40 కి.మీ కలదన్ మల్టీ-మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా భారతదేశం, మయన్మార్‌లో సిట్వే పోర్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. [6] [7]
ఇండోనేషియా లేదు భారతదేశపు దక్షిణ కొన ఇందిరా పాయింటు, ఇండోనేషియా ఉత్తర భూభాగం రోండో ద్వీపానికి ఉత్తరాన 135 కి.మీ. దూరంలో ఉంది [8] [9] భారతదేశం తన వ్యూహాత్మక ఆర్థిక సైనిక భాగస్వామ్య కార్యక్త్రమంలో భాగంగా ఇండోనేషియాలోని సబాంగ్ డీప్‌సీ ఓడరేవును అభివృద్ధి చేస్తోంది. [10]
థాయిలాండ్ లేదు నికోబార్‌లోని కమోర్టా ద్వీపానికి ఉత్తరాన ఉన్న తిల్లాంగ్‌చాంగ్ ద్వీపం, థాయ్‌లాండ్‌లోని సిమిలాన్ దీవుల సమూహంలోని కో హుయాంగ్ నుండి 440 కి.మీ. దూరంలో ఉంది)
గ్రేట్ నికోబార్ ద్వీపం లోని కాంప్‌బెల్ బే, థాయిలాండ్‌ ఫుకెట్ ప్రావిన్స్‌లోని కో రాచా నోయి (రాచా నోయి ద్వీపం) నుండి 488 కి.మీ. దూరంలో ఉంది.
థాయిలాండ్‌కు భారతదేశం, మయన్మార్, ఇండోనేషియా, మలేషియాలతో స్పష్టంగా నిర్వచించిన సముద్ర సరిహద్దులు ఉన్నాయి.
మలేషియా లేదు గ్రేట్ నికోబార్ ద్వీపంలోని కాంప్‌బెల్ బే, మలేషియా సమీప ద్వీపం లంకావి నుండి 630 కి.మీ. దూరంలో ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sea Around Us – Fisheries, Ecosystems and Biodiversity". Retrieved 1 April 2017.
  2. "Lakshadweep". encyclopedia.com. Archived from the original on 27 January 2010. Retrieved 1 August 2012.
  3. Sawhney, Pravin (30 January 2019). "A watchtower on the high seas". The Tribune. Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
  4. 4.0 4.1 Sunderarajan, P. (12 June 2011). "India hopes to double its EEZ". The Hindu. Retrieved 1 April 2017.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 The Exclusive Economic Zone of the Seas around India, 24 January 2018.
  6. Purushothaman, Vakkom. "Kaladan Multi Modal Transit Transport Project to link sea route in Myanmar with Mizoram". The Northeast Times. Archived from the original on 15 April 2012. Retrieved 11 August 2012.
  7. India starts construction of ₹1,600-cr Mizoram-Myanmar Kaladan road , Business Line, 17 April 2018.
  8. James Horsburgh, 1852, The India Directory, Or, Directions for Sailing to and from the East Indies, Page 63.
  9. "Rondo Island, The Rich Uninhabited Island". Archived from the original on 3 November 2012. Retrieved 5 July 2020.
  10. Eyeing Southeast Asia, India builds port in Indonesia, Economic Times, 20 March 2019.