మంచిరేవుల అటవీ పార్కు
మంచిరేవుల అటవీ పార్కు | |
---|---|
రకం | పట్టణ పార్కు |
స్థానం | మంచిరేవుల, గండిపేట్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ |
సమీప పట్టణం | హైదరాబాదు |
విస్తీర్ణం | 250 ఎకరాలు |
నవీకరణ | 2022 |
నిర్వహిస్తుంది | తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ |
తెరుచు సమయం | 2023, ఆగస్టు 26 |
స్థితి | వాడులో ఉంది |
మంచిరేవుల అటవీ పార్కు (ఐటీ కారిడార్ అటవీ పార్కు) అనేది తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, గండిపేట్ మండలంలోని, మంచిరేవులలో ఉన్న పార్కు.[1] హైదరాబాదు నగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని 250కి పైగా ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఈ అటవీ పార్కు, ఐటీ కారిడార్‌లోని నివాసం ఉంటున్న వారికి పేవరేట్ హాట్ స్పాట్‌గా మారింది.[2]
ఆధునీకరణ
[మార్చు]మంచిరేవులకు సమీపంలో కోకాపేట, పుప్పాల్‌గూడ, నానక్‌రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి ప్రాంతాలు ఉన్నాయి. పట్టణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ 250కి పైగా ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని పట్టణ అటవీ పార్కుగా తీర్చిదిద్దింది.
సదుపాయాలు
[మార్చు]- ఎత్తయిన రాళ్ళ గుట్టలు ఉన్న ప్రాంతంలో కొన్ని కి.మీ.ల ట్రెక్కింగ్ రూట్
- 4 కి.మీ.ల సైకిల్ ట్రాక్, సైకిళ్ళ షెడ్డు
- 4 కి.మీ.ల వాకింగ్ ట్రాక్
- చెట్లకింద రచ్చబండ
- పెద్ద చెరువు కట్ట, వ్యూ పాయింట్, చెక్ డ్యాం
- అటవీ పార్కు మొత్తాన్ని, నగరాన్ని చూసేలా ఎత్తయిన వాచ్ టవర్
- సుమారు 44 రకాల అటవీ జాతి మొక్కలతో 45 వేల మొక్కలు
- పిల్లల కోసం ఓపెన్ ఎయిర్ స్కూలు వేదిక
ప్రారంభం
[మార్చు]స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు 2023 ఆగస్టు 26న అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పి. మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరలు కోటి వృక్షార్చన (ఒక రోజు- కోటి మొకలు) కార్యక్రమంతో ఈ పార్కును ప్రారంభించి, సఫారి వాహనంలో తిరుగుతూ పార్కును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జి. రంజిత్‌రెడ్డి, సంతో్‌షకుమార్, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణీదేవి, తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్లొన్నారు.[3][4]
సందర్శన వేళలు
[మార్చు]ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉండే ఈ పార్కుకు మామూలు రోజుల్లో 3 నుంచి 4 వందల దాకా సందర్శకులు వస్తుండగా... శని, ఆదివారాల్లో దాదాపు వెయ్యిమందికిపైగా సందర్శిస్తున్నారు.
బర్డ్ వాక్
[మార్చు]చెట్లు, గుట్టలు, నీటి కుంటలు, చెరువు ఉండటంతో ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పక్షులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్కులోని రకరకాల పక్షులను గుర్తించేందుకు బర్డ్ వాక్ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ "Forestrek Park Manchirevula". fdc.telangana.gov.in. Archived from the original on 2023-04-16. Retrieved 2023-04-16.
- ↑ telugu, NT News (2023-03-26). "ఐటీ కారిడార్‌లో అటవీ పార్కు". www.ntnews.com. Archived from the original on 2023-03-26. Retrieved 2023-04-16.
- ↑ krishna (2023-08-26). "మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు". Mana Telangana. Archived from the original on 2023-08-26. Retrieved 2023-08-30.
- ↑ ABN (2023-08-27). "అడవులను పెంచడమే సర్కారు లక్ష్యం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-08-30. Retrieved 2023-08-30.
- ↑ "ఉత్సాహంగా వరల్డ్ స్పేరో బర్డ్‌వాక్". EENADU. 2023-03-27. Archived from the original on 2023-03-27. Retrieved 2023-04-16.
- ↑ Tilaru, Chandu (2023-03-27). "ఐటీ కారిడార్‌లో అందమైన అటవీ పార్క్ ఎక్కడుందో తెలుసా?". www.telugu.nativeplanet.com. Archived from the original on 2023-04-16. Retrieved 2023-04-16.