Jump to content

మనోజ్ తివారీ

వికీపీడియా నుండి
మనోజ్ తివారి
లోక్ సభ సభ్యుడు
Assumed office
2014 మే 16
అంతకు ముందు వారుజయప్రకాష్ అగర్వాల్
నియోజకవర్గంఉత్తర తూర్పు ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం
పార్లమెంటు సభ్యుడు
In office
2016 నవంబర్ 30 – 2020 జూన్ 2
అంతకు ముందు వారుసతీష్ ఉపాధ్యాయ
తరువాత వారుఆదేశ్ కుమార్ గుప్తా
వ్యక్తిగత వివరాలు
జననం (1971-02-01) 1971 ఫిబ్రవరి 1 (వయసు 53)
వారణాసి, ఉత్తరప్రదేశ్ , భారతదేశం
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ
పదవులు
సమాజ్ వాదీ పార్టీ
జీవిత భాగస్వామిరాణి తివారి సురభి తివారి
సంతానం3
నివాసంన్యూఢిల్లీ , భారతదేశం
కళాశాలబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం[1]
వృత్తినటుడు గాయకుడు తెలివిజన్ వ్యాఖ్యాత దర్శకుడు రాజకీయ నాయకుడు
  1. "Manoj Tiwari is new Delhi BJP chief". The Hindu. Retrieved 1 December 2016.

మనోజ్ కుమార్ తివారీ (జననం 1 ఫిబ్రవరి 1971) భారతీయ రాజకీయ నాయకుడు, గాయకుడు నటుడు , ఈశాన్య ఢిల్లీ నుండి 2019లో పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. మనోజ్ తివారి 2009 సార్వత్రిక ఎన్నికలలో గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బిజెపి అభ్యర్థి అయిన యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఓడిపోయాడు. 2014 భారత సాధారణ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఎంపీగా గెలుపొందాడు. మనోజ్ తివారి 2016లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు [1] మనోజ్ తివారి బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.[2]

బాల్యం విద్యాభ్యాసం

[మార్చు]

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని కబీర్ చౌరా ప్రాంతంలో , చంద్రదేవ్ తివారీ లలితా దేవి దంపతులకు 1971 ఫిబ్రవరి 1న మనోజ్ తివారి జన్మించాడు. మనోజ్ తివారికి ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. [3] [4] [5] మనోజ్ తివారి కుటుంబం బీహార్‌లోని కైమూర్ జిల్లాలోని అతర్వాలియా అనే గ్రామం నుండి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి వలస వచ్చింది. [6] మనోజ్ తివారి ఎంపీఈడీ పూర్తి చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి మనోజ్ తివారి డిగ్రీ పట్టా పొందారు.[3]

సినీ జీవితం

[మార్చు]

రాజకీయాల్లోకి రాకముందు, మనోజ్ తివారి సినిమా పరిశ్రమలో గాయకుడిగా నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. [7]

2003లో, మనోజ్ తివారి ససుర బడా పైసావాలా కీలక పాత్రను పోషించాడు. [8] [9] [10] అతను దరోగ బాబు ఐ లవ్ యు బంధన్ టూటే నా సినిమాలలో నటించి ప్రశంసలు అందుకున్నాడు [7]

2010లో, మనోజ్ తివారి రియాలిటీ టెలివిజన్ షో బిగ్ బాస్ నాల్గవ సీజన్‌లో పోటీదారుగా ఉన్నారు. [2]

మనోజ్ తివారీ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌ సినిమాలో "జియా హో బీహార్ కే లాలా జియా తు హాజర్ సాలా" పాడారు. [11]

రాజకీయ జీవితం

[మార్చు]

2009లో, మనోజ్ తివారి గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికలలో పోటీ చేశారు. నియోజకవర్గాల మార్పులు చేర్పులలో భాగంగా మనోజ్ తివారికి ఆస్థానం వచ్చింది. [12] అయితే మనోజ్ తివారి ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ చేతిలో ఓడిపోయాడు. [13]

ముంబైలోని అతని ఇంటిపై 2009 నవంబర్లో శివసేన నాయకులు మనోజ్ తివారీ ఇంటిపై దాడి చేశారు. మనోజ్ తివారి శివసేన నాయకులు తన ఇంటిపై చేసిన దాడిని ఖండించారు. [14]

మనోజ్ తివారి 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఈశాన్య ఢిల్లీ (లోక్‌సభ నియోజకవర్గం) నుండి భారతీయ జనతా పార్టీ తరపున గెలిచాడు. ఆప్‌ నుంచి పోటీ చేసిన ఆనంద్‌కుమార్‌పై మనోజ్ తివారి 1,44,084 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మనోజ్ తివారి 2019 సార్వత్రిక ఎన్నికలలో, న్యూ ఢిల్లీలోని ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి షీలా దీక్షిత్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ 3.63 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. [15] [16]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మనోజ్ తివారీ తన మొదటి భార్య రాణి తివారీని 1999లో వివాహం చేసుకున్నాడు. [17] ఈ దంపతులకు రితి అనే కూతురు ఉంది. 2011లో, మనోజ్ రాణి పెళ్లయిన 11 సంవత్సరాల తర్వాత విడిపోయారు. [3] [8] మనోజ్ రాణి దంపతులు 2012లో విడాకులు తీసుకున్నారు [3] [17]

తరువాత మనోజ్ తివారి సురభిని వివాహం చేసుకున్నాడు, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె 2020 డిసెంబర్ 30న రెండవ కూతురు 2022 డిసెంబర్ 12న జన్మించింది. [17] [18] [19]

  1. "Manoj Tiwari appointed chief of Delhi BJP". Hindustan Times. 30 November 2016.
  2. 2.0 2.1 "Exclusive: Meet the Bigg Boss 4 contestants". Rediff. 2 October 2010. Archived from the original on 12 February 2020. Retrieved 18 December 2010.
  3. 3.0 3.1 3.2 3.3 "Members : Lok Sabha". 164.100.47.194. Archived from the original on 10 May 2019. Retrieved 2 November 2019.
  4. "Biography". Manoj Tiwari Official Website. Retrieved 5 January 2012.
  5. "My Neta Info". myneta.info.
  6. "Actor Manoj Tiwari to build temple for Tendulkar and Dhoni". Indian Express. 8 July 2011. Retrieved 30 March 2017.
  7. 7.0 7.1 Raman, Anuradha (5 June 2005). "Bollywood's trying to read Bhojpuri". Indian Express. Retrieved 5 January 2012.
  8. 8.0 8.1 Jha, Giridhar (11 July 2011). "Manoj Tiwari appeals for help to persuade wife to drop divorce plan". India Today. Retrieved 5 January 2012.
  9. Tewary, Amarnath (15 December 2005). "Move over Bollywood, here's Bhojpuri". BBC. Retrieved 4 January 2012.
  10. "Bhojpuri cinema edges its way to success". The Hindu. IANS. 28 August 2010. Retrieved 5 January 2012.
  11. Vohra, Meera (6 January 2012). "Manoj Tewari croons for Anurag Kashyap". The Times of India. Archived from the original on 3 January 2013. Retrieved 22 March 2022.
  12. "Bhojpuri actor Manoj Tiwari to contest LS polls from Gorakhpur". Zeenews. 7 January 2009. Archived from the original on 22 February 2014. Retrieved 5 January 2012.
  13. "Manoj Tiwari, Samajwadi party, Gorakhpur, UP, Key Contenders for India Election 2009". Archived from the original on 11 September 2018. Retrieved 20 December 2019.
  14. "Manoj Tiwari's residence attacked in Mumbai". The Times of India. PTI. 17 November 2009. Archived from the original on 15 July 2012. Retrieved 5 January 2012.
  15. "Deve Gowda, Sheila Dikshit, Mehbooba: Saffron Wave Swept Away a Dozen Ex-CMs, 8 of Them From Cong". News18. 24 May 2019. Retrieved 24 May 2019.
  16. "Buoyed after winning all seven Lok Sabha seats in Delhi, BJP expresses confidence in wresting power from AAP in Assembly polls". Firstpost. 24 May 2019. Retrieved 24 May 2019.
  17. 17.0 17.1 17.2 "मनोज तिवारी के घर गूंजी किलकारी,आई नन्ही परी, बेटी को गोद में उठाते ही नहीं रहा खुशी का ठिकाना". Asianet News Network Pvt Ltd (in హిందీ). 31 December 2020. Retrieved 31 December 2020.
  18. "Manoj Tiwari blessed with a baby girl, fans pour in wishes". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 31 December 2020. Retrieved 31 December 2020.
  19. "'Saraswati has arrived': BJP MP Manoj Tiwari, wife Surabhi welcome second child". www.hindustantimes.com (in ఇంగ్లీష్). 12 December 2022. Retrieved 12 December 2022.