Coordinates: 16°29′48″N 77°29′36″E / 16.496666°N 77.49321°E / 16.496666; 77.49321

మాగనూరు మండలం

వికీపీడియా నుండి
(మాగనూరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మాగనూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1][2]

మాగనూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మాగనూరు స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మాగనూరు స్థానాలు
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మాగనూరు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°29′48″N 77°29′36″E / 16.496666°N 77.49321°E / 16.496666; 77.49321
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట జిల్లా
మండల కేంద్రం మాగనూరు
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 195 km² (75.3 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 47,957
 - పురుషులు 23,851
 - స్త్రీలు 24,106
అక్షరాస్యత (2011)
 - మొత్తం 33.65%
 - పురుషులు 44.71%
 - స్త్రీలు 22.70%
పిన్‌కోడ్ 509208

ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 33 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  18  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఇది మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన మార్గంలో ఉంది.గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[4]

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 47,957 - పురుషులు 23,851 - స్త్రీలు 24,106. అక్షరాస్యుల సంఖ్య 19269.[5]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 195 చ.కి.మీ. కాగా, జనాభా 24,824. జనాభాలో పురుషులు 12,314 కాగా, స్త్రీల సంఖ్య 12,510. మండలంలో 4,876 గృహాలున్నాయి.[6]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. మాగనూర్
  2. గురురావులింగంపల్లి
  3. ఓబ్లాపూర్
  4. వర్కూరు
  5. కొత్తపల్లి
  6. పుంజనూర్
  7. నేరడిగాం
  8. పెగడబండ
  9. తలంకేరి
  10. వడ్వాట్
  11. అడివిసత్యవరం
  12. ఉజ్జెల్లి
  13. గజరన్‌దొడ్డి
  14. అడివిఖానాపూర్
  15. భైరంపల్లి
  16. కొల్పూర్
  17. పర్మన్‌దొడ్డి
  18. మండిపల్లి

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 241, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/NARAYANPET.PDF
  3. "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
  4. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.
  5. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  6. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]