మాయాబజార్ సినిమా పాత్రల జాబితా
Jump to navigation
Jump to search
మాయాబజార్ (1957) సినిమాలో నటించిన కొందరు కళాకారులు, వారు పోషించిన పాత్రల వివరాలు ఈ వ్యాసంలో ఉన్నాయి:
పాత్ర
పాత్రధారి వ్యాఖ్య కృష్ణుడు ఎన్.టి.ఆర్ అంతకు ముందు ఒక సినిమా (సొంతవూరు) లో వేసిన కృష్ణుని పాత్రకు మంచి స్పందన రాలేదు. కనుక ఈ సినిమాలో చాలా జాగ్రత్త తీసుకొని ఎన్.టి.ఆర్.కు ఈ పాత్ర, మేకప్ రూప కల్పన చేశారు. అభిమన్యుడు ఏ.ఎన్.ఆర్ శశిరేఖ (బలరాముని కుమార్తె) సావిత్రి ఘటోత్కచుడు ఎస్.వి.రంగారావు ఈ సినిమాలో పాత్ర చిత్రీకరణ వల్ల తెలుగువారికి ఘటోత్కచుడు చాలా ప్రియమైన వ్యక్తి అయిపోయాడు. లక్ష్మణ కుమారుడు రేలంగి లక్ష్మణ కుమారుని హాస్యగానిగా చూపడం మహాభారత కథలో అతని పాత్రకు అనుగుణంగా లేదు. రేలంగి పైజమా (పేంటు వంటిది) ధరించటం వింతగానే అనిపిస్తుంది. అయితే పాత్ర ఔచిత్యాన్ని గురించి మహారచయిత పింగళి నాగేంద్రరావు సమంజసనీయంగానే సమర్థించుకున్నారు. అంత పెద్ద విలన్ అయిన రారాజు కొడుకు ఇంత చీప్ గా ఉండడం ఏమిటి? అన్న విమర్శలకి పింగళి చెప్పింది ఏమిటంటే... నిజమే!రారాజు కొడుకు ఇంత అసమర్థుడిగా వెర్రివెంగళాయిలా ఉండడం కొందరికి నచ్చకపోవచ్చు. అయితే లక్ష్మణకుమారుడు నిజంగా కూడా అంత సమర్థుడేం కాదు... యుద్ధంలోకి అడుగుపెట్టీ పెట్టగానే చనిపోయాడు. భారతంలోని ఈ పాయింట్ని ఆధారంగా చేసుకుని వినోదం కోసం కొంత కల్పన చేశాను . - ఇదీ పింగళి చెప్పినది. ఏదేమైనా రేలంగి కేరక్టర్... ముఖ్యంగా దర్పం, అమాయకత్వం, బింకం, వెర్రితనం... అన్నీ కలసిన అతని సైకాలజీ న భూతో న భవిష్యతి... ముఖ్యంగా లక్ష్మణ కుమారుడి సంక్లిష్టమైన సైకాలజీని గుర్తెరిగి అతన్ని ఈజీగా డీల్ చేయగలిగే నేర్పు శకుని (సిఎస్ఆర్ ) చూపించడం ఇంకా హైలైట్.
పింగళి రేలంగి లక్ష్మణకుమారుడి కారెక్టర్ని ఇలా డీల్ చేయడాన్ని తిరుగులేని విధంగా యాక్సెప్ట్ చేశారు జనం. పవర్ ఫుల్ విలన్లకి వెర్రివెంగళప్ప లాంటి కొడుకులు ఉండే టైపు కామెడీకి శ్రీకారం చుట్టింది పింగళినాగేంద్రరావేనంటే అతిశయోక్తి కాదు. తరువాత చాలామంది దర్శకులు ఇదే ఫాలో అయ్యారు.
చిన్నమయ రమణారెడ్డి బలరాముడు గుమ్మడి వెంకటేశ్వరరావు కృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములన్న విషయానికి ప్రాముఖ్యతనివ్వడం కోసం ఒక సీనులో దర్శకుడు ఎన్.టి.ఆర్., గుమ్మడిల ముక్కులలో పోలికలను చూపడానికి ప్రయత్నించారట! దుర్యోధనుడు ముక్కామల శకుని సి.ఎస్.ఆర్ రేవతీ దేవి (బలరాముని భార్య) ఛాయా దేవి సుభద్ర ఋష్యేంద్రమణి ఋష్యేంద్రమణికి మొదట రేవతి పాత్ర ఇచ్చారట. కాని గర్విష్టి పాత్ర తనకు ఇష్టంలేక చక్రపాణిని సుభద్ర పాత్ర అడిగి తీసుకొన్నానని ఒకసారి ఋష్యేంద్రమణి టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది. రుక్మిణి సంధ్య ప్రముఖ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కుమారి జయలలిత తల్లి. సాత్యకి నాగభూషణం కర్ణుడు మిక్కిలినేని దుశ్శాసనుడు ఆర్.నాగేశ్వరరావు రథ సారథి వల్లూరి బాలకృష్ణ చిన్నారి శశిరేఖ సరస్వతి బాల నటి చిన్నారి అభిమన్యుడు ఆనంద్ బాల నటుడు లంబు చదలవాడ కుటుంబరావు జంబు నల్ల రామమూర్తి పల్లెటూరి పిల్ల చ్రిత్రంలో లప్పం పాత్రధారి ధూళిపాళ మోహన imdbలో మోహన గురించి భానుమతి (దుర్యోధనుని భార్య) రజని imdbలో రజని గురించి కృష్ణుడు కంచి నరసింహారావు కృష్ణుడు మాయా రూపంలో ఉండి అటు నేనే ఇటు నేనే పాట పాడే పాత్రధారి శర్మ అల్లు రామలింగయ్య దారుకుడు మాధవపెద్ది సత్యం శాస్త్రి వంగర వెంకటసుబ్బయ్య శంఖుతీర్థులు బొడ్డపాటి యశోద కాకినాడ రాజరత్నం విన్నావా యశోదమ్మా పాటలో చిన్ని కృష్ణుడు బాబ్జీ విన్నావా యశోదమ్మా పాటలో సీత సీత అలనాటి నటీమణి. imdbలో సీత పేజీ హిడింబి సూర్యకాంతం