Jump to content

ముత్తంశెట్టి శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
(ముత్తంసెట్టి శ్రీనివాసరావు నుండి దారిమార్పు చెందింది)
అవంతి శ్రీనివాస్
ముత్తంశెట్టి శ్రీనివాసరావు


భీమిలి శాసనసభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – 2022 ఏప్రిల్ 10[1]
ముందు గంటా శ్రీనివాసరావు
నియోజకవర్గం భీమిలి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 జూన్ 1967
ఏలూరు,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ఎం.జ్ఞానేశ్వరి
సంతానం ప్రియాంక, వెంకట శివనందేష్‌
నివాసం విశాఖపట్నం
మతం హిందూ

ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్ గా సుపరిచితులు) భారతీయ రాజకీయవేత్త, విద్యావేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ నందలి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అవంతి విద్యా సంస్థలు నడుపుతున్నాడు. ఈ విద్యా సంస్థలు విశాఖపట్నం నకు చెందిన అవంతీ ఎడ్యుకేషన్ సొసైటీ చే నడుపబడుచున్నవి. ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందాడు.2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈయన వైఎస్సార్సీపీ లో చేరి నియోజకవర్గం నుంచి గెలిచాడు.అనంతరం ఈయనకు మంత్రి పదవి వర్చింది[2][3].అతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన జూన్ 12, 1967 లో వెంకటనారాయణ, నాగేశ్వరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎం.జ్ఞానేశ్వరిని జూన్ 20, 1986న వివాహమాడాడు. వారికి కుమార్తె ప్రియాంక, కుమారుడు వెంకట శివనందేష్‌ ఉన్నారు.[5][6]

సెక్స్ ఆడియో టేప్ లీక్‌లు :

[మార్చు]

అవంతి శ్రీనివాసరావు ఆడియో టేపు లీకేజీ అవంతి అతనిని ఇబ్బందికి గురి చేసింది."లవ్ యు డార్లింగ్", "లవ్ యు బంగారమ్" అంటూ అవంతి శ్రీనివాస్, మరో మహిళల మధ్య ఆరోపించిన ఆడియో టేప్.టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, అతను కనికరం లేకుండా ట్రోల్ చేయబడ్డాడు.టేప్‌పై స్పందిస్తూ, తాను పరువు నష్టం కేసు పెడతానని, ఆ ఆడియో తనది కాదని ఆరోపించాడు[7].

రాజకీయ జీవితం

[మార్చు]

అవంతి శ్రీనివాస్ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో భీమిలి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాక ఆ పార్టీలో చేరి రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాడు. ఆయన 2014 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.

అవంతి శ్రీనివాస్ 2019 ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరి భీమిలి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై గెలిచి జగన్ మంత్రివర్గంలో 2019 మే 23 నుండి 2022 ఏప్రిల్ 10 వరకు రెండున్నరేళ్ల పాటూ మంత్రిగా పని చేశాడు. ఆయన 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున భీమిలి నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓడిపోయాడు.

అవంతి శ్రీనివాస్ 2024 డిసెంబర్ 12న వ్యక్తిగత కారణాలతో వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేశాడు.[8]

జనవరి 21, 2016 న ఆయన రైల్వేమంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాసి తన నియోజకవర్గంలోని తుని, కొత్తవలస జంక్షన్ (వయా నర్శీపట్నం, చోడవరం, మాడుగుల) రైల్వే మార్గాన్ని రూ.16.82 కోట్లతో బడ్జెట్ లో కేటాయించేట్లు చేశాడు.[9]

మూలాలు

[మార్చు]
  1. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  2. "Constituencywise-All Candidates". Archived from the original on 18 మే 2014. Retrieved 17 May 2014.
  3. TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Bhattacharjee, Sumit (2019-03-27). "Caste factor to play a crucial role in Bhimili". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-02-02.
  5. "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-04.
  6. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ దళపతులు". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
  7. Arikatla, Venkat (2022-11-14). "Sex talk audio lands Avanti in tight spot again!". greatandhra.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-01.
  8. Hindustantimes Telugu (12 December 2024). "Avanti Srinivas Resignation: వైసీపీని వీడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ తీరుపై విమర్శలు". Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.
  9. "Funds sanctioned for DPR on Tuni-KTV line". The Hindu (in Indian English). 2016-02-27. ISSN 0971-751X. Retrieved 2016-03-04.