Jump to content

మురళీధర్ తేజోమూర్తుల

వికీపీడియా నుండి
మురళీధర్ తేజోమూర్తుల
జననంఆగష్టు 8, 1980
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల టీవీ, సినీ నటుడు, రచయిత, దర్శకుడు

మురళీధర్ తేజోమూర్తుల రంగస్థల, టీవీ, సినీ నటుడు, రచయిత, దర్శకుడు. ఈటీవిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమంలో దాదాపు 150 ఎపిసోడ్స్ లో నటించి, జబర్దస్త్ మురళీగా పేరుతెచ్చుకున్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

మురళీ 1980, ఆగష్టు 8న విజయనగరం జిల్లా, పార్వతీపురం మండలంలోని సంతోషపురంలో జన్మించాడు.[2] డిగ్రీ పూర్తిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

[మార్చు]

మురళీ తండ్రి ఉపాధ్యాయుడు, ఆయన ప్రోత్సాహంతో 7వ తరతగతిలో రంగస్థల ప్రవేశంచేసిన మురళీ దాదాపు మూడువేల నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. దాదాపు 50 నాటికలకు దర్శకత్వం వహించాడు. రవీంద్రభారతిలో నాటక ప్రదర్శన ఇవ్వాలన్న కోరికతో హైదరాబాదు వచ్చిన మురళీ, డి.యస్. దీక్షితులు నిర్వాహణలో నడుస్తున్న అక్కినేని నట శిక్షణశాలలో చేరి నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. అక్కడ మొదటిసారిగా అమ్మంటే ఏంటి మమ్మీ అనే నాటికలో నటించాడు.

పౌరాణికాలు

[మార్చు]
  1. శశిరేఖా పరిణయం
  2. పాదుకా పట్టాభిషేకం
  3. సత్య హరిశ్చంద్ర
  4. గయోపాఖ్యానం
  5. వేణీ సంహారం
  6. శ్రీకృష్ణ రాయబారం
  7. శ్రీకృష్ణదేవరాయలు

సాంఘీకాలు

[మార్చు]
  1. ప్రేమ పక్షులు
  2. రసరాజ్యం
  3. నారీమేధం
  4. గాంధీ జయంతి
  5. బాపూ చెప్పిన మాట
  6. సీకట్లో సెంద్రుడు[3]
  7. వర విక్రయం
  8. ముగింపు లేని కథ
  9. మారని సంసారం
  10. కన్యాశుల్కం
  11. వెన్నెలోచ్చింది
  12. అద్దంలో చంద్రుడు
  13. అమ్మంటే ఏంటి మమ్మీ
  14. రాయి సాయి సారాయి
  15. గో టు హెల్
  16. ప్రతిబింబం
  17. మనస్తత్వాలు
  18. జజ్జనకరి జనారే
  19. పీపీలికం
  20. షాడో లెస్ మాన్
  21. నేనేడుస్తున్న మీరు నవ్వుకోండి
  22. గబ్బర్ సింగ్

బహుమతులు

[మార్చు]
  1. నంది అవార్డులు - రెండు
  2. జ్యూరీ నటుడు - మయూర కళాపరిషత్‌ 15వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు, రామచంద్రపురం[4]

సినిమారంగం

[మార్చు]

రంగస్థల అనుభవంతో సినిమారంగంలోకి ప్రవేశించిన మురళీ పలు చిత్రాలలో నటించడమేకాకుండా దాదాపు 25 చిత్రాలకు రచన సహకారం అందించాడు.

నటించినవి

[మార్చు]
  1. దీక్ష
  2. ఒక విచిత్రం
  3. గౌతమ్ ఎస్.ఎస్.సి.
  4. అనసూయ
  5. [[ఎర్ర సముద్రం]]
  6. అమరావతి
  7. నక్షత్రం
  8. టైటానిక్
  9. కృష్ణార్జున యుద్ధం
  10. తపన
  11. ఇది నా బయోపిక్[5]

టీవీరంగం

[మార్చు]
  1. సీరియల్స్ క్రేజీ కాపురం
  2. దటీజ్ మహాలక్ష్మి
  3. జబర్దస్త్ (150 ఎపిసోడ్స్) - స్కిట్స్ కూడా రాశాడు
  4. పటాస్

మూలాలు

[మార్చు]
  1. నమస్తే తెలంగాణ (9 November 2016). "విజయలో జబర్దస్త్ టీమ్ సందడి". Retrieved 8 August 2018.[permanent dead link]
  2. I Prefer Stage to Cinema, The Hindu, 3rd November 2015.
  3. ఆకట్టుకున్న సీకట్లో చంద్రుడు, సాక్షి, శ్రీకాకుళం ఎడిషన్, 2 మే 2015.
  4. ఈనాడు, గుంటూరు (18 May 2018). "ఉత్తమ నాటికగా గుర్తు తెలియని శవం". Retrieved 8 August 2018.
  5. ఆంధ్రప్రభ (25 June 2018). "మొద‌లైన ఇది నా బ‌యోపిక్." Retrieved 8 August 2018.[permanent dead link]

ఇతర లంకెలు

[మార్చు]