మౌనశ్రీ మల్లిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mounasri Mallik
మౌనశ్రీ మల్లిక్
మౌనశ్రీ మల్లిక్
మాతృభాషలో పేరుమౌనశ్రీ మల్లిక్
జననం(1974-03-04) 1974 మార్చి 4
పట్టణం:వర్ధన్నపేట
జిల్లా:వరంగల్
రాష్ట్రం:తెలంగాణ
నివాసంహైదరాబాదు
జాతీయతభారతీయుడు
చదువుఎం.సి.జె"(MCJ) (శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం)
వృత్తికవి, రచయిత, జర్నలిస్టు
మతంహిందూ
తల్లిదండ్రులువెంకటమ్మ, బక్కయ్య

మౌనశ్రీ మల్లిక్ (జననం. మార్చి 4, 1974) ప్రముఖ కవి, జర్నలిస్టు, సినిగేయ రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1974, మార్చి 4 తేదీన వరంగల్ జిల్లా, వర్ధన్నపేట లో వెంకటమ్మ, బక్కయ్య దంపతులకు జన్మించారు. తన ప్రాధమిక విద్య ను వర్థన్నపేటలో, ఇంటర్మీడియట్ విద్యను SVVRNR కళాశాలలో పూర్తి చేసారు. వరంగల్ లోని సి.కె.జయం (CKM) కళాశాల నుండి బి.కాం(B.COM) డిగ్రి పట్టాను పొందారు. హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి "ఎం.సి.జె"(MCJ) పట్టాను పొందారు. ఆయన "గౌరువాస్తు" అనే మాసపత్రికకు 2005 నుండి 2015 వరకు సహసంపాదకునిగా పనిచేశారు.[1]

సినిమా జాబితా[మార్చు]

మౌనశ్రీ ఇప్పటికే చాలా సినిమాలకు పాటలు రాశారు. మాటీవీలో ప్రసారం అవుతున్న కోయిలమ్మ అనే సీరియల్ కు 100 పాటలు రాశారు. ఒక టీవీ సీరియల్ కు వంద పాటలకు పైగా రాసి చరిత్ర సృష్టించారు.

సం. సినిమా
2007 నాలో తొలిసారిగా
2010 చేతిలో చెయ్యేసి
2011 థ్రిల్లింగ్
2012 గుడ్ మార్నింగ్
2015 చెంబు చినసత్యం
2017 పోరాటం
2018 జంక్షన్ లొ జయమాలిని

IPC సెక్షన్ భార్యబందు

బిలాస్ పూర్ పోలీస్ స్టేషన్

రచనలు[మార్చు]

 1. దిగంబర - కవితా సంపుటి
 2. గరళం - కవితా సంపుటి
 3. సమున్నత శిఖరం
 4. తప్తస్పృహ

అవార్డులు[మార్చు]

 1. రంజని కుందుర్తి అవార్డు
 2. యువసాహితీ అవార్డు (సిఎఓయు)
 3. ఎక్స్ రే అవార్డు
 4. రాధేయ కవితా పురస్కారం
 5. కలర్స్ అవార్డు(ఉత్తమ సినీ గీతరచయిత..(గుడ్ మర్నింగ్ సినిమా)
 6. జీవిఆర్ ఆరాధన 5 సార్లు ప్రథమ బహుమతి.
 7. అభ్యుదయ ఫౌండేషన్ అవార్డు
 8. షీ ఫౌండేషన్ అవార్డు
 9. ఆసరా అవార్డు
 10. జనరంజక సహజకవి అవార్డు
 11. పెన్నా అవార్డు
 12. సృజన ఉగాది అవార్డు
 13. సృజన సాహితీ సమితి
 14. యంవి నర్సింహారెడ్డి సాహిత్య పురస్కారం
 15. బోవేరా అవార్డు
 16. కిన్నెర-ద్వానా అవార్డు
 17. అస్తిత్వం అవార్డు
 18. ఆర్వీ రమణమూర్తి సాహిత్య పురస్కారం
 19. దాస్యం వెంకట స్వామి సమైఖ్యసాహితీ పురస్కారం
 20. ఘంటసాల బంగారు తెలంగాణ పురస్కారం
 21. భారతీయ సాహిత్య పరిషత్ జాతీయ పురస్కారం - 2018

మూలాలు[మార్చు]

మౌన్యశ్రీ మల్లిక్[permanent dead link] మౌన్యశ్రీ మల్లిక్ యూట్యూ[permanent dead link] monyasri mallik,youtube interview[permanent dead link]

ఇతర లింకులు[మార్చు]