యల్లాప్రగడ సుదర్శన్‌రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యల్లాప్రగడ సుదర్శన్‌రావు
జననంయల్లాప్రగడ సుదర్శన్‌రావు
మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్
నివాస ప్రాంతంన్యూఢిల్లీ
ప్రసిద్ధిచరిత్ర ఆచార్యులు
మతంహిందూ
భార్య / భర్తశారద
తండ్రిరామకోటేశ్వరరావులు
తల్లిసత్యవతి

యల్లాప్రగడ సుదర్శన్‌రావు మహబూబ్ నగర్ జిల్లా, కొల్లాపూర్ ప్రాంతానికి చెందినవారు. ప్రస్తుతం ఇండియన్ కౌన్‌సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ సంస్థకు చైర్మెన్‌గా పనిచేస్తున్నారు.

పూర్వికులు

[మార్చు]

సుదర్శన్‌రావు పూర్వికులు సురభి వారి కొల్లాపూర్ సంస్థానంలో పనిచేసేవారు. వీరి తాత ఉమామహేశ్వరరావు సంస్థానంలోని ఖజనా విభాగంలో పనిచేసేవారు[1]... వీరి తండ్రి కూడా సంస్థానంలోనే పనిచేసినా, అది ప్రజాప్రభుత్వంలో విలీనం కావడంతో నిరుద్యోగిగా మారారు.

బాల్యం

[మార్చు]

సుదర్శన్‌రావు తల్లిదండ్రులు సత్యవతి, రామకోటేశ్వరరావులు. వీరి బాల్యం కొల్లాపూర్‌లో గడిచింది.

విద్యాభ్యాసం

[మార్చు]

సుదర్శన్‌రావు 1959లో కొల్లాపూర్‌లోని ఆర్.ఐ.డి. ప్రభుత్వ పాఠశాలలో హెచ్. ఎస్. ఇ. పూర్తిచేశారు. ఇండోర్, భోపాల్‌లో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, పి. హెచ్.డి.,లు పూర్తిచేశారు.

కుటుంబం

[మార్చు]

సుదర్శన్‌రావుకు భార్య, ముగ్గురు కుమారైలు ఉన్నారు. భార్య పేరు శారద.

ఉద్యోగ జీవితం

[మార్చు]

సుదర్శన్‌రావు హెచ్. ఎస్. ఇ. పూర్తిచేశాకా ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని కొనసాగిస్తూనే, దూర విద్యలో ఉన్నత చదువులు పూర్తిచేశారు. తర్వాత తాను చదువుకున్న పాఠశాలలోనే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఒక సంఘాన్ని స్థాపించి, విశేష కృషిచేశారు. అనంతరం వరంగల్లోని ఎల్. బి. కళాశాలలో చరిత్ర విభాగంలో అధ్యాపకుడిగా చేరారు. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా 2005 వరకు పనిచేశారు.

ప్రస్తుతం

[మార్చు]

చరిత్ర విభాగంలో విశేష కృషి చేసి, ఎంతో అనుభవం గడించిన సుదర్శన్‌రావు ప్రస్తతం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఇండియన్ కౌన్‌సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, న్యూఢిల్లీ సంస్థకు చైర్మెన్‌గా పనిచేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, జిల్లా ప్రత్యేకంలో మధ్యపేజి, తేది.27.06.2014