Jump to content

రఘునాథ్ పాణిగ్రాహి

వికీపీడియా నుండి
రఘునాథ్ పాణిగ్రాహి

రఘునాథ్ పాణిగ్రాహి ప్రఖ్యాత భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సంగీత దర్శకుడు. ఇతడు ఆలపించిన జయదేవుని గీతాగోవిందం ఇతనికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది.

విశేషాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం

ఇతడు 1935, ఆగస్టు 10న ఒరిస్సాలోని రాయగడ జిల్లా గునుపూర్‌లో జన్మించాడు. ఇతడు తన తండ్రి నుండి సంగీతం నేర్చుకున్నాడు. గీతా గోవిందం ఆలాపనా విధానాన్ని కూడా తండ్రి నుండే పుణికిపుచ్చుకున్నాడు. ఫ్రెంచి ప్రభుత్వ సత్కారం పొందిన తొలి ఒడియా గాయకుడు ఇతడే[1]. 2010లో ఇతడిని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడి భార్య ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి సంయుక్త పాణిగ్రాహి[1]. ఈమె 1997లో మరణించింది. ఇతడు తన భార్య పేరుతో సంయుక్త పాణిగ్రాహి ట్రస్టును ప్రారంభించి ఒడిస్సి నృత్య కారులకు ఎంతో చేయూతనిచ్చాడు. వారి ద్వారా ఒడిస్సీ నాట్యానికి ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చాడు.

సినిమా రంగం

[మార్చు]

ఇతడు 1950వ దశకం నుండి తెలుగు, కన్నడ, ఒరియా సినిమాలకు నేపథ్య సంగీతాన్ని అందించాడు.

ఇతడు పనిచేసిన తెలుగు సినిమాల వివరాలు[2]:

క్రమ సంఖ్యసినిమా పేరుపాట పల్లవిసహ గాయకుడు/ గాయనిసంగీత దర్శకుడుగేయ రచయితసినిమా విడుదలైన సంవత్సరం
1అమర సందేశంమానస లాలస సంగీతం మధుమయ జీవనఎ.ఎం.రాజాప్రసాదరావు, కేల్కర్1954
2సంఘంఆడదంటే అలుసు కాదోయి అవనిలో దేవతోయ్ఆర్.గోవర్ధనంతోలేటి1954
3సంతోషంనిలుపరా మదిలోన హరిని నిరామయుని దయాకరునిఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తిసముద్రాల సీనియర్1955
4సంతోషంయువతి మోహన మూర్తి నీ ప్రియసఖి చెరగ రారాజిక్కిఎమ్మెస్ విశ్వనాథన్, వి.రామ్మూర్తిసముద్రాల సీనియర్1955
5ఇలవేల్పుఏనాడు కనలేదు ఈ వింత సుందరినిసుసర్ల దక్షిణామూర్తి1956
6ఇలవేల్పుచల్లని రాజా ఓ చందమామపి.సుశీల, పి.లీలసుసర్ల దక్షిణామూర్తిశ్రీశ్రీ1956
7సంకల్పంతప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబుపిఠాపురం బృందంసుసర్ల దక్షిణామూర్తి1957
8సంకల్పంవెన్నెల తెలికాంతులలో చల్లగాలి దారులలోసుసర్ల దక్షిణామూర్తి1957
9గంగా గౌరీ సంవాదంభలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళిఎస్.జానకి, ఎం.ఎస్.రామారావు బృందంపెండ్యాలపరశురామ్1958
10జయభేరిమది శారదాదేవి మందిరమేఘంటసాల, పి.బి.శ్రీనివాస్పెండ్యాలమల్లాది రామకృష్ణశాస్త్రి1959
11మైరావణమెల్ల మెల్లగా మేను తాకకోయీ చల్లగా చల్లగాఎస్.జానకిఎస్.రాజేశ్వరరావుఆరుద్ర1964

మరణం

[మార్చు]

ఇతడు తన 80వ యేట 2013, ఆగస్టు 13వ తేదిన గుండెపోటుతో భువనేశ్వర్ లోని స్వగృహంలో మరణించాడు[1].

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 విలేఖరి (26 August 2013). "పండిట్‌ రఘునాథ్‌ పాణిగ్రాహి మృతి". విశాలాంధ్ర. Retrieved 12 October 2016.[permanent dead link]
  2. కొల్లూరి, భాస్కరరావు. "రఘునాథ్ పాణిగ్రాహి". ఘంటసాల గళామృతము. Retrieved 12 October 2016.[permanent dead link]