రఘురామ్ భట్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అద్వాయ్ రఘురామ్ భట్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పుత్తూరు, మైసూరు రాష్ట్రం | 1958 ఏప్రిల్ 16|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | స్లో ఎడమచేతి ఆర్థడాక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 165) | 1983 అక్టోబరు 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1983 అక్టోబరు 21 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2022 జూన్ 3 |
అద్వాయ్ రఘురామ్ భట్ (జననం 1958 ఏప్రిల్ 16) 1983లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్.
దేశీయంగా
[మార్చు]రఘురామ్ భట్ పాఠశాల, జూనియర్ స్థాయి ఆటలలో ఆధిపత్యం వహించాడు. కొన్ని చక్కటి ప్రదర్శనల తర్వాత, 1979-80 సీజన్‌లో తమిళనాడుకు వ్యతిరేకంగా M. చిన్నస్వామి స్టేడియంలో తన రంజీ ట్రోఫీ ప్రవేశం చేసాడు. [1] అతను తన తొలి ఆటలో ఒక వికెట్ తీసి తన కెరీర్‌ను నెమ్మదిగా ప్రారంభించాడు. అనతికాలంలోనే రంజీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. తన 6వ ఫస్ట్ క్లాస్ గేమ్‌లో దావణగెరెలో కేరళపై 9 వికెట్లు తీశాడు. [2] పంజాబ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో 9 వికెట్లు పడగొట్టి కర్ణాటక సెమీఫైనల్‌కు చేరడంలో దోహదపడ్డాడు.
1981-82 సెమీఫైనల్
[మార్చు]బొంబాయితో జరిగిన సెమీఫైనల్‌లో కర్ణాటక విజయంలో రఘురామ్ భట్ పోషించిన పాత్రను ప్రధానంగా గుర్తుండిపోతుంది. 1981-82 రంజీ సెమీఫైనల్ M. చిన్నస్వామి స్టేడియంలో బలమైన బాంబే జట్టుకు, కర్ణాటకకూ మధ్య జరిగింది. సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, అశోక్ మన్కడ్, సందీప్ పాటిల్, రవిశాస్త్రి, బల్విందర్ సంధులతో సహా భారత క్రికెట్ జట్టులోని అప్పటి ప్రస్తుత స్టార్లలో కొంతమంది బాంబే జట్టులో ఉన్నారు.
టాస్ గెలిచిన బాంబే కెప్టెన్ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గవాస్కర్ గులాం పార్కర్‌తో కలిసి బ్యాటింగ్ ప్రారంభించి 62 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌ను నెలకొల్పాడు. రఘురామ్ భట్ రంగంలోకి దిగి 41 పరుగుల వద్ద గవాస్కర్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంగ్‌సర్కార్‌ను 8 పరుగుల వద్ద ఔట్ చేశాడు. గులాం పార్కర్, సందీప్ పాటిల్ మధ్య 101 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. రఘురామ్ భట్ గులామ్ పార్కర్‌ను ఎల్‌బిడబ్ల్యూ చేసాడు. దీంతో అశోక్ మన్కడ్ క్రీజులోకి వచ్చాడు. బొంబాయి 5 వికెట్లకు 184 పరుగుల వద్ద రఘురామ్ భట్ వేసిన బంతిని మన్కడ్ బ్యాట్ అంచులో కొట్టి, స్లిప్ లో గుండప్ప విశ్వనాథ్ కు క్యాక్ష్చ్ ఇచ్చాడు. ఆ తరువాతి బంతికి సురు నాయక్‌ను అవుట్ చేసి రఘురామ్ భట్ తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. 123 పరుగులకు 8 వికెట్లతో అప్పటి అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. బాంబే 271 పరుగుల వద్ద ఆలౌటైంది.[3]
కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగింది. సుధాకర్ రావు ఒక చక్కటి సెంచరీ, బ్రిజేష్ పటేల్ 78 పరుగులు చేయడంతో కర్ణాటక మొదటి ఇన్నింగ్స్‌లో బొంబాయి స్కోరును అధిగమించింది. సయ్యద్ కిర్మాణి, రఘురామ్ భట్‌ల బ్యాటింగుతో కర్ణాటక 470 చేసింది.[4]
అప్పటికి పిచ్ క్షీణించింది. స్పిన్‌కు సహాయపడుతుందని భావించారు. 2వ ఇన్నింగ్స్‌లో బాంబే బ్యాటింగ్ ప్రారంభించిన గులాం పార్కర్, వెంగ్‌సర్కార్ 72 పరుగులు సాధించారు. భట్ వెంగ్‌సర్కార్‌ను అవుట్ చేశాడు. వెంటనే సురు నాయక్ అతనికి రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో స్కోరు 2 వికెట్లకు 107 అయింది. భట్, సహచర స్పిన్నర్ బి. విజయకృష్ణ మిడిల్ ఆర్డర్ వికెట్లు తీసి, బాంబే స్కోరును 6 వికెట్లకు 160 కి చేర్చారు. సునీల్ గవాస్కర్ అసాధారణంగా 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వెళ్లాడు. వెంటనే రఘురామ్ భట్ స్పిన్ నుండి ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. గవాస్కర్ ఇంతకుముందు భట్‌పై ఎడమ చేతితో బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు, కానీ బాంబే టీమ్ మేనేజర్ శరద్ దివాద్కర్ దానిని తిరస్కరించాడు. భట్‌పై తనకు ఎలాంటి అవకాశం లేదని భావించిన సునీల్ గవాస్కర్ అతనిపై ఎడమ చేతి వాటం బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సునీల్ గవాస్కర్ భట్‌కు వ్యతిరేకంగా ఎడమచేతితో, విజయకృష్ణకు వ్యతిరేకంగా కుడిచేతితో బ్యాటింగ్ చేశాడు. గవాస్కర్ ఎడమచేతి వాటం ఆటగాడిగా 60 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి బొంబాయి పూర్తిగా ఓడిపోకుండా చూసుకున్నాడు. దీంతో బాంబే 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కర్ణాటక ఫైనల్‌కు చేరుకుంది. రఘురామ్ భట్ 13 వికెట్లు పడగొట్టాడు. [5]
ఫైనల్లో
[మార్చు]తొలి ఇన్నింగ్స్‌లో 705 పరుగులు చేసినప్పటికీ ఫైనల్‌లో ఢిల్లీ చేతిలో కర్ణాటక ఓడిపోయింది. [6] తర్వాతి రంజీ సీజన్లో భట్‌కు మంచి ఫలితాలొచ్చాయి. కర్ణాటక మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న బొంబాయిని ఓడించి 3వ సారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. అతను ఫైనల్‌లో 4 వికెట్లు పడగొట్టి అద్భుతమైన రంజీ ట్రోఫీ పోటీలను ముగించాడు.[7] అతను ఆ సంవత్సరం ఇరానీ ట్రోఫీలో 7 వికెట్లు తీశాడు. [8] సీజన్‌లో అతని ప్రదర్శనలు అతన్ని జాతీయ స్థాయిలో వెలుగులోకి తెచ్చాయి. అతను పాకిస్తాన్‌తో జరగబోయే సిరీస్‌కి ఎంపికయ్యాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]రఘురామ్ భట్ తన మొదటి టెస్టును నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో ఆడాడు. అతని తొలి టెస్టు వికెట్ జావేద్ మియాందాద్. తర్వాత ముదస్సర్ నాజర్ వికెట్ కూడా తీశాడు. భారత్ గేమ్‌ను డ్రా చేసుకుంది. సిరీస్‌ను కూడా సమంగా పంచుకున్నారు. [9] రఘురామ్ భట్ తదుపరి టెస్టు, వెస్టిండీస్‌తో కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగింది. భట్ క్లైవ్ లాయిడ్, గస్ లోగీల వికెట్లు తీశాడు. ఈ టెస్టులో భారత్, ఇన్నింగ్స్ 83 పరుగుల తేడాతో ఓడిపోయింది. [10] ఈ టెస్ట్ తరువాత భట్‌ను భారత జట్టు నుండి తొలగించడంతో అతని అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
తరువాతి దేశీయ కెరీర్
[మార్చు]రఘురామ్ భట్ కర్నాటకకు అండగా నిలిచిన వారిలో ఒకరు. అతను బి. విజయకృష్ణతో కలిసి కర్ణాటక బౌలింగ్ పనిలో ఎక్కువ భాగం భరించాడు. రంజీ ట్రోఫీలో 343 వికెట్లు సాధించాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన 1992-93 ప్రీ-క్వార్టర్ ఫైనల్ తర్వాత అతను రిటైరయ్యాడు [11]
క్రికెట్ తర్వాత
[మార్చు]ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటి నుండి భట్ అంపైర్, అడ్మినిస్ట్రేటర్, కోచ్ వంటి అనేక హోదాలలో పనిచేశాడు. 2011 జూలైలో అతను గోవా క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితుడయ్యాడు. [12]
మూలాలు
[మార్చు]- ↑ Scorecard of Karnataka vs Tamil Nadu
- ↑ Scorecard of Karnataka vs Kerala
- ↑ Scorecard of Karnataka vs Bombay
- ↑ 'Sunny was middling the ball, no edges, no tension'
- ↑ When Sunny batted left handed
- ↑ Scorecard of Karnataka vs Delhi
- ↑ Scorecard of Karnataka vs Bombay
- ↑ Scorecard of Karnataka vs Rest of India
- ↑ Scorecard of India vs Pakistan
- ↑ Scorecard of India vs West Indies
- ↑ Scorecard of Karnataka vs Madhya Pradesh
- ↑ Raghuram Bhat appointed Coach of Goa