రజ్మ్ నామా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్రూక్లిన్ మ్యూజియంలో గల రజ్మ్ నామా ప్రతి.

రజ్మ్ నామా : Razmnama (Book of War) ، ( رزم نامہ ) : పర్షియన్ భాషలో "రజ్మ్" అనగా పోరాటం, నామా అనగా గాథ. రజ్మ్ నామా అనగా "పోరాట గాధ". మహాభారత పర్షియన్ అనువాదమే ఈ రజ్మ్ నామా.

1574 లో అక్బర్ ఒక మక్తబ్ ఖానా లేదా అనువాద శాలను ఫతేపూర్ సిక్రీలో ప్రారంభించాడు. ఇందులో చక్రవర్తి యొక్క ముఖ్యమైన అధికారులకు అనువాదాలు చేసే కార్యక్రమాలను అప్పజెప్పాడు. సంస్కృత గ్రంథాలైన రాజతరంగిణి, రామాయణం, మహాభారతము మొదలగు గ్రంథాలను పర్షియన్ భాషలో అనువదించుటకు శాసించడమైనది.[1]

మొదటి ప్రతి[మార్చు]

1582 లో మహాభారతాన్ని పర్షియన్ భాషలో అనువదించుటకు ఆజ్ఞాపించడం జరిగింది. లక్ష శ్లోకాలుగల మహాభారత అనువాదం 1584 - 1586 ల మధ్య పూర్తి గావింప బడింది. నేటికినీ దీని ప్రతి జైపూర్లో గల "సిటీ పాలస్ మ్యూజియం"లో గలదు.[2] ఈ రజ్మ్ నామా ప్రత్యేకత దీనిలో గల చిత్రాలు.[3]

రెండవ ప్రతి[మార్చు]

రజ్మ్ నామకు చెందినా రెండవ ప్రతి 1598 - 1599 పూర్తి చేయబడింది. మొదటి ప్రతితో బేరీజు చేస్తే, రెండవ ప్రతిలో చాలా విపులంగానూ విశదీకరణలతో నిండిన ప్రతిగా కానవస్తుంది. ఇందులో గల 161 చిత్రాలు మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయి. ఇందులో గల చిత్రాలు, వాటి చిత్రకారుల చరిత్ర, అక్బర్ కాలపు నాటి కళాపోషణ, ఆనాటి సంస్కృతులకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఈ రజ్మ్ నామా యొక్క కాపీలు, రాజవంశీకులకు బహూకరణల కోసం, చాలా బాగా ఉపయోగ పడినవి. బహూకరణలు గౌరవంగా ఉండేవి, అలాగే స్వీకరణలు కూడాను. మొఘల్ దర్బారుకు చెందిన 'అబ్దుల్ ఖాదిర్ బదాయూనీ' ప్రకారం, సామ్రాజ్యమంతటా వీటి కాపీలను అందరికీ అందజేయాలని, అమీర్లందరూ వీటిని "అల్లాహ్ యొక్క ప్రసాదితం"గా భావించి స్వీకరించాలని అక్బర్ చే అజ్ఞాపింపబడింది. వీటిని విశాలంగా పంపిణీ చేసేటందుకు అన్ని ఏర్పాట్లు చేయాలనీ ఆజ్ఞాపించడమైనది. అబుల్ ఫజల్ ప్రకారం, వీటిని, అనేక సదుద్దేశ్యాలతో పంచడమైనది.[1]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 http://muse.jhu.edu/login?auth=0&type=summary&url=/journals/manoa/v022/22.1.rice.html
  2. http://www.kamat.com/database/?CitationID=10432
  3. http://www.brooklynmuseum.org/opencollection/tags/Razm-nama