Jump to content

రాంచీ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 23°00′N 85°00′E / 23.000°N 85.000°E / 23.000; 85.000
వికీపీడియా నుండి
రాంచీ జిల్లా
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుదక్షిణ ఛోటానాగ్‌పూర్
విస్తీర్ణం
 • Total5,097 కి.మీ2 (1,968 చ. మై)
జనాభా
 (2011)
 • Total29,14,253
 • జనసాంద్రత572/కి.మీ2 (1,480/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-JH
Websitehttp://ranchi.nic.in/

రాంచీ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. జార్ఖండ్ రాష్ట్ర రాజధానీ నగరమైన రాంచీ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. ఈ జిల్లా 1899 లో ఏర్పడింది. 2011 జనగణన ప్రకారం, జార్ఖండ్ లోని జిల్లాల్లో ఇది అత్యధిక జనాభా కలిగిన జిల్లా.[1]

భౌగోళికం

[మార్చు]

శీతోష్ణస్థితి

[మార్చు]
Ranchi
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
23
 
23
4
 
 
30
 
26
13
 
 
27
 
31
17
 
 
32
 
36
22
 
 
55
 
37
24
 
 
199
 
34
24
 
 
346
 
29
23
 
 
329
 
29
22
 
 
282
 
29
22
 
 
89
 
28
19
 
 
8.7
 
26
14
 
 
6.1
 
23
4
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో రాంచీ జిల్లా ఒకటి.[2] బ్యాక్‌వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (BRGF) నుండి నిధులు అందుకుంటున్న జార్ఖండ్‌లోని జిల్లాలలో ఇది ఒకటి.[2]

జనాభా వివరాలు

[మార్చు]
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19014,77,249—    
19115,57,488+16.8%
19215,36,346−3.8%
19316,29,863+17.4%
19416,73,376+6.9%
19517,48,050+11.1%
19618,94,921+19.6%
197111,64,661+30.1%
198114,89,303+27.9%
199118,27,718+22.7%
200123,50,245+28.6%
201129,14,253+24.0%

2011 జనాభా లెక్కల ప్రకారం రాంచీ జిల్లా జనాభా 29,14,253.[3] ఇది జమైకా దేశ జనాభాకు సమానం.[4] అమెరికా లోని అర్కాన్సాస్ రాష్ట్ర జనాభాకు సమానం.[5] జనాభా పరంగా భారతదేశపు జిల్లాల్లో 130 వ స్థానంలో ఉంది.[3] జనసాంద్రత 557/చ.కి.మీ.[3] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా పెరుగుదల రేటు 23.9%.[3] రాంచీలో లింగనిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 950 మంది స్త్రీలు.[3] జిల్లాలో అక్షరాస్యత 77.13%.[3]

రాంచీ జిల్లాలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం జనాభాలో 5.2% కాగా, షెడ్యూల్డ్ తెగల ప్రజలు 35.8% ఉన్నారు.

భాషలు

[మార్చు]

2011 భారత జనగణన సమయంలో, జిల్లాలోని 30.23% జనాభా సాద్రి, 28.08% హిందీ, 11.88% కుర్మలి, 8.55% ఉర్దూ, 7.52% కురుఖ్, 4.79% సంతాలి, 4.70% ముండారి, 2.51% బెంగాలీ, 2.17 % భోజ్‌పురి, 1.17% మగహి తమ మొదటి భాషగా మాట్లాడుతారు.[6]

విద్య

[మార్చు]

రాంచీ జిల్లాలో అనేక ఉన్నత విద్యా సంస్థలున్నాయి. రాంచీ సగటు అక్షరాస్యత 77.13% (2011 జనాభా లెక్కల ప్రకారం). ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 85.63%, స్త్రీల అక్షరాస్యత 68.2%. రాంచీలో ఉన్న కొన్ని ప్రముఖ పాఠశాలలు లయోలా కాన్వెంట్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జవహర్ విద్యా మందిర్, కైరాలి స్కూల్, సెయింట్‌సేవియర్స్ స్కూల్, సెయింట్ థామస్ స్కూల్, బిషప్ వెస్ట్‌కాట్.

జిల్లాలో ఉన్న కొన్ని ఉన్నత విద్యా సంస్థలు:

  • రాంచీ విశ్వవిద్యాలయం, 1960 లో స్థాపించారు. దాని అనుంబంధ కళాశాలైన రాంచీలోని సెయింట్ జేవియర్స్ కళాశాలను 1944 లో స్థాపించారు.
  • రాంచీలోని మెస్రాలోని బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1955 లో స్థాపించబడింది.
  • రాంచీలోని బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని 1981 లో స్థాపించారు.
  • ఐఐఎం రాంచీ, దేశంలో ఎనిమిదవ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంటు. 2010 లో రాంచీలో స్థాపించారు.
  • నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా, రాంచీ భారతదేశంలోని పద్నాలుగో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం
  • జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (XISS), రాంచీలో 1955 సంవత్సరంలో యువ గ్రాడ్యుయేట్‌లకు సామాజిక పని నిర్వహణ కార్యక్రమాలలో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రారంభమైంది.
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్‌మెంట్ అని పిలువబడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & మేనేజ్‌మెంట్ (ISM) 1985 లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలోని యువతకు మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అందించాలనే ఆలోచనతో ఏర్పడింది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫౌండ్రీ & ఫోర్జ్ టెక్నాలజీ (NIFFT) తయారీ, మెటలర్జికల్, ఫౌండ్రీ, ఫోర్జ్ పరిశ్రమలకు నాణ్యమైన ఇంజనీర్లు, సుశిక్షితులైన నిపుణులను అందించడానికి UNDP-UNESCO సహకారంతో భారత ప్రభుత్వం 1966 లో ఏర్పాటు చేసింది.
  • రాంచీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS), 1960 లో స్థాపించబడింది.
  • సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ, రాంచీ వైద్య విద్యలో ఉన్నత స్థాయి అధ్యయనం అందించే ఒక సంస్థ. ఈ సంస్థ అన్ని వయసుల రోగులకు మనోరోగచికిత్స విభాగంగా కూడా పనిచేస్తుంది.
  • జార్ఖండ్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది సెంట్రల్ యూనివర్సిటీ. దీన్ని 2009 లో ఇండియన్ పార్లమెంట్ చట్టం (2009 నం. 25) ద్వారా స్థాపించారు.

పరిపాలన

[మార్చు]

బ్లాకులు

[మార్చు]

రాంచీ జిల్లాలో 18 బ్లాకులున్నాయి.[7] రాంచీ జిల్లాలోని బ్లాకుల జాబితా ఇది:

  1. అంగారా బ్లాక్
  2. బెరో బ్లాక్
  3. బుండు బ్లాక్
  4. బుర్ము బ్లాక్
  5. చాన్హో బ్లాక్
  6. కాంకే బ్లాక్
  7. ఓరంజి బ్లాక్
  8. ఇట్కి బ్లాక్
  9. నగ్రి బ్లాక్
  10. ఖేలారి బ్లాక్
  11. లాపుంగ్ బ్లాక్
  12. మందార్ బ్లాక్
  13. నామ్కుమ్ బ్లాక్
  14. రాతు బ్లాక్
  15. సిల్లీ బ్లాక్
  16. రహే బ్లాక్
  17. సోనాహతు బ్లాక్
  18. తమర్ బ్లాక్

మూలాలు

[మార్చు]

  23°00′N 85°00′E / 23.000°N 85.000°E / 23.000; 85.00023°00′N 85°00′E / 23.000°N 85.000°E / 23.000; 85.000{{#coordinates:}}: cannot have more than one primary tag per page

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 April 2012. Retrieved 27 September 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Jamaica 2,868,380 July 2011 est
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Arkansas 2,915,918
  6. 2011 Census of India, Population By Mother Tongue
  7. http://www.mapsofindia.com/maps/jharkhand/tehsil/ranchi.html

వెలుపలి లంకెలు

[మార్చు]