రావూరు వెంకట సత్యనారాయణరావు
(రావూరు సత్యనారాయణ రావు నుండి దారిమార్పు చెందింది)
రావూరు వెంకట సత్యనారాయణరావు (1913-) తెలుగు సినిమా మాటల, పాటల రచయిత.
విశేషాలు
[మార్చు]ఇతడు కృష్ణా జిల్లా, ముచ్చిలిగుంట గ్రామంలో జన్మించాడు. ఇతడు కృష్ణా పత్రికలోను, ఆంధ్రప్రభ దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్ణాపత్రికలో "వడగళ్ళు" అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలను, ఆంధ్రప్రభ దినపత్రికలో "ఆషామాషీ" అనే శీర్షికలో హాస్య వ్యాసాలను వ్రాశాడు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని అందుకున్నాడు. ఆంధ్ర నాటక కళాపరిషత్తుకు పది సంవత్సరాలపాటు కార్యదర్శిగా పనిచేశాడు.
రచనలు
[మార్చు]ఇతడు వ్రాసిన గ్రంథాలలో కొన్ని:
- వెన్నెల తెరచాప-నారాయణరెడ్డి
- ముట్నూరు కృష్ణారావు వ్యాసాలు (పరిష్కర్త)
- రాయప్రోలు వారి సాహిత్య సౌందర్య దర్శనం
- మన పట్టాభి (1980)[1]
- ఆషామాషీ[2] (రెండు సంపుటాలు)
- పొదరింటి కో పువ్వు
- పొంగిన తుంగభద్ర
- ఇచట వీచిన గాలి (నవలిక)
- హంసలదీవి (నవలిక)
- వెన్నెల ఏమన్నది
- మన ముట్నూరి
- ప్రియ జనని
- తెలుగు వీణ
- వడగళ్ళు
- అన్నిట నీవెరా...
- పాలవెల్లి
- నెలవంక
చిత్రసమాహారం
[మార్చు]ఇతడు భరణి పిక్చర్స్ అధినేత రామకృష్ణ ప్రోత్సాహంతో సినిమారంగంలోనికి అడుగుపెట్టాడు.
- డా.చక్రవర్తి (1964) (uncredited)
- చదువుకున్న అమ్మాయిలు (1963) (uncredited)
- బడిపంతులు (1958)
- పులి చేసిన పెళ్లి (1958)
- వరుడు కావాలి (1957) (సంభాషణలు)
- సొంతవూరు (1956)
- చింతామణి (1956) (సంభాషణలు)
- నాగ పంచమి (1956)
- చెరపకురా చెడేవు (1955)
- సతీ సక్కుబాయి (1954)
- చక్రపాణి (1954) (సంభాషణలు)
- లక్ష్మి (1953)
- శ్రీకృష్ణ తులాభారం
- సతీ సావిత్రి
- శ్రీకృష్ణమాయ