రూపిందర్ పాల్ సింగ్
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం |
పంజాబ్ | 1990 నవంబరు 11||||||||||||||||
ఎత్తు | 1.94 m | ||||||||||||||||
ఆడే స్థానము | డిఫెండర్ | ||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||
2010–ప్రస్తుతం | భారత జాతీయ పురుషుల మైదాన హాకీ జట్టు | 216 | (115) | ||||||||||||||
సాధించిన పతకాలు
|
రూపిందర్ పాల్ సింగ్(జననం 1990 నవంబరు 11) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2014 కామన్వెల్త్ ఆటలు, 2016 ఒలింపిక్ ఆటలు, 2018 కామన్వెల్త్ ఆటలు అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత హాకీ జట్టులో ఆడాడు.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]రూపిందర్ పాల్ సింగ్ పంజాబ్ రాష్ట్రం ఫరిద్కోట్ లోని ఒక సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఇతను తన 11వ ఏటా నుండి హాకీ ఆడటం మొదలెట్టాడు. చండీగఢ్ హాకీ అకాడెమీకి ఎంపికైనప్పటినుండి ఆట పై ఇతనికి మరింత మక్కువ పెరిగింది. [2]
కెరీర్
[మార్చు]సింగ్ 2010 మేలో మొట్టమొదటి సారి సుల్తాన్ అజ్లాన్ షాహ్ కప్ అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాడు. ఆ మరు సంవత్సరం 2011 లో జరిగిన అజ్లాన్ కప్ పోటీల్లో ప్రత్యర్థి అయినా బ్రిటన్ జట్టుపై రూపిందర్ హ్యాట్రిక్ గోల్స్ చేసాడు. 2014 పురుషుల మైదాన హాకీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.[3][4] 2020 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టులో ఆడి, జట్టు విజయానికి తనదైన పాత్ర పోషించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Drag-flick glory beckons Rupinder Pal". 2011-07-08. Retrieved 2014-08-03.
- ↑ "Men's Rabobank Hockey World Cup 2014". 2014-05-24. Archived from the original on 2014-07-02. Retrieved 2014-08-04.
- ↑ "Men's Rabobank Hockey World Cup 2014". 2014-05-24. Archived from the original on 2014-07-02. Retrieved 2014-08-04.
- ↑ "Sultan Azlan Shah Cup: Rupinder Pal Jubilant After Hat-rick Against Great Britain". 2011-05-06. Retrieved 2014-01-08.
బయటి లింకులు
[మార్చు]- రూపిందర్ సింగ్(భారత హాకీ జాలస్థలి) Archived 2021-08-11 at the Wayback Machine
- రూపిందర్ సింగ్(ఒలింపియాడ్)