హార్దిక్ సింగ్
వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జననం | 1998 సెప్టెంబరు 23 | ||||||||||||||||
ఎత్తు | 1.76 m | ||||||||||||||||
ఆడే స్థానము | మిడ్ ఫీల్డర్ | ||||||||||||||||
జాతీయ జట్టు | |||||||||||||||||
2010–ప్రస్తుతం | భారత జాతీయ పురుషుల మైదాన హాకీ జట్టు | 39 | (1) | ||||||||||||||
సాధించిన పతకాలు
|
హార్దిక్ సింగ్ (జననం:1998 సెప్టెంబర్ 23) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. ఇతను భారత జాతీయ జట్టులో మిడ్ ఫీల్డర్ గా ఆడుతాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]వృత్తిరీత్యా పోలీసు అధికారి అయిన హార్దిక్ సింగ్ తండ్రి ఒకప్పుడు భారత జాతీయ హాకీ జట్టులో క్రీడాకారుడు. అతని తాత ప్రీతమ్ సింగ్ భారత నౌకా దళంలో హాకీ కోచ్ గా వ్యవహరించాడు.[2] హార్దిక్ తన మామ జుగరాజ్ సింగ్(భారత మాజీ హాకీ క్రీడాకారుడు)ని గురువుగా అభివర్ణిస్తాడు. ఇతని అత్తమ్మ రజబీర్ కౌర్ 1980 ఒలింపిక్స్ లో భారత్ జాతీయ జట్టులో మైదాన హాకీ క్రీడాకారిణి, ఈ ఒలింపిక్స్ లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.[3]
కెరీర్
[మార్చు]భారత మైదాన హాకీ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన హార్దిక్, 2018 ఆసియా పురుషుల హాకీ చాంపియన్‌షిప్ తో మొట్టమొదటి సారి అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత జట్టులో ఆడాడు, ఈ పోటీల్లో భారత జట్టు కాంస్య పతకం సాధించింది.
మూలాలు
[మార్చు]- ↑ "HARDIK SINGH". hockeyindia.org. Hockey India. Archived from the original on 27 జూలై 2019. Retrieved 15 July 2019.
- ↑ Das, Tanmay (1 December 2018). "Hockey World Cup: 'Home' support for Hardik Singh". The New Indian Express. Retrieved 14 July 2019.
- ↑ "Vice-captain Hardik Singh is fifth in family to win laurels in hockey". The Tribune. 1 October 2016. Archived from the original on 14 జూలై 2019. Retrieved 14 July 2019.
బయటి లంకెలు
[మార్చు]- హార్దిక్ సింగ్(ఒలింపియాడ్)
- హార్దిక్ సింగ్(భారత హాకీ) Archived 2019-08-28 at the Wayback Machine