Jump to content

బీరేంద్ర లక్రా

వికీపీడియా నుండి
బీరేంద్ర లక్రా
వ్యక్తిగత వివరాలు
జననం (1990-02-03) 1990 ఫిబ్రవరి 3 (వయసు 34)
ఒడిషా , భారత్
ఎత్తు 1.67 m
ఆడే స్థానము డిఫెండర్
Club information
ప్రస్తుతం ఆడుతున్న క్లబ్బు రాంచి రేస్
క్రీడా జీవితము
సంవత్సరాలు Team Apps (Gls)
2012 చండీగఢ్ కామెట్స్
BPCL
0000–2008 ఒరిస్సా స్టీలర్స్
2013–2014 రాంచి రైనోస్ 15 (0)
2015– రాంచి రేస్
జాతీయ జట్టు
2012– భారత హాకీ పురుషుల జట్టు 197 (10)

బీరేంద్ర లక్రా(జననం 1990 ఫిబ్రవరి 3) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. ఇతను 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు ఆడాడు.[1] 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. లక్రా సోదరుడు బిమల్ భారత జట్టులో మిడ్-ఫీల్డర్ గా ఆడేవాడు. లక్రా సోదరి అసుంటి లక్రా భారత మహిళల జట్టు మైదాన హాకీ క్రీడాకారిణి.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బీరేంద్ర లక్రా 1990 ఫిబ్రవరి 3న ఒడిషా రాష్ట్రం సుందర్ఘర్హ్ జిల్లాలోని లచ్చ్చాడా గ్రామంలో జన్మించాడు. ఇతని కుటుంబం ఒరన్ తెగకి చెందినది.[3]

కెరీర్

[మార్చు]

బీరేంద్ర లక్రా రూర్కెలా స్టీల్ ప్లాంట్ సెయిల్ హాకీ అకాడమీకి క్రీడాకారుడు. 2007 లో సింగపూర్ పర్యటన కోసం అతను మొదటిసారిగా భారత జూనియర్ జట్టుకి ఎంపిక చేయబడ్డాడు. అతను 2012 లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, 2011 లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఛాంపియన్స్ ఛాలెంజ్ టోర్నమెంట్‌లో, ఢాకాలోని SAAF గేమ్స్‌లో పాల్గొన్నాడు. 2010, 2009 లో సిడ్నీలో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో 2009 లో సింగపూర్‌లో జరిగిన జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టులో ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "London Olympics 2012: Player profile". Archived from the original on 2013-05-11. Retrieved 2021-08-29.
  2. "New Indian women's hockey captain: Asunta from Lakra family of Simdega!". Bihar Days. 2011-12-01. Retrieved 2013-01-17.[permanent dead link]
  3. "Profile: Birendra Lakra". NDTV. 2012-07-20. Archived from the original on 2013-02-16. Retrieved 2013-01-17.

బయటి లంకెలు

[మార్చు]