Jump to content

మన్ ప్రీత్ సింగ్

వికీపీడియా నుండి
మన్ ప్రీత్ సింగ్
వ్యక్తిగత వివరాలు
జననం (1992-06-26) 1992 జూన్ 26 (వయసు: 34)
జలంధర్, పంజాబ్
ఎత్తు 1.71 m
ఆడే స్థానము మిడ్ ఫీల్డర్
సాధించిన పతకాలు
పురుషుల మైదాన హాకీ
ఒలింపిక్ క్రీడలు
Representing భారతదేశం
Bronze medal – third place2020 టోక్యో ఒలింపిక్స్భారత మైదాన హాకీ పురుషుల జట్టు
ఆసియా క్రీడలు
Bronze medal – third place2018 ఆసియా క్రీడలు
Infobox last updated on: 5 August 2021

మన్ ప్రీత్ సింగ్ సంధు (జననం 1992 జూన్ 26) భారతదేశానికి చెందిన మైదాన హాకీ క్రీడాకారుడు. 2017 మే నుండి భారత జాతీయ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత మైదాన హాకీ జట్టులో కాంస్య పతక విజయానికి కెప్టెన్‌గా తనదైన పాత్ర పోషించాడు.[1][2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

మన్ ప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రం జలంధర్ పట్టణం దగ్గరలోని మితాపూర్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.

కెరీర్

[మార్చు]

మన్ ప్రీత్ సింగ్  తన గ్రామనికి  చెందిన మాజీ మైదాన హాకీ  క్రీడాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత పర్గత్ సింగ్ నుండి ప్రేరణ పొంది హాకీ ఆటలో రాణించడం మొదలెట్టాడు.

జూనియర్ హాకీలో

[మార్చు]

2013లో భారత మైదాన హాకీ పురుషుల జట్టుకు కెప్టెన్ గా అతనిని ఎంపిక చేసారు.   2013  పురుషుల హాకీ కప్(జూనియర్) లో భారత జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఈ పోటీలో భారత జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. "Manpreet Singh". Hockey India. the original నుండి 8 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2016.
  2. "Manpreet Singh Profile". Glasgow 2014. the original నుండి 20 ఆగస్టు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 July 2016.

బయటి లంకెలు

[మార్చు]