లాఠీ (సినిమా)
స్వరూపం
(లాఠీ నుండి దారిమార్పు చెందింది)
లాఠీ (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుణశేఖర్ |
---|---|
తారాగణం | ప్రశాంత్, సంయుక్త సింగ్, రఘువరన్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | మురళీకృష్ణ మూవీస్ |
భాష | తెలుగు |
లాఠీ 1992లో గుణశేఖర్ దర్శకత్వంలో ప్రశాంత్, సంయుక్త సింగ్, రఘువరన్ ప్రధాన పాత్రధారులుగా వెలువడిన తెలుగు సినిమా[1] . ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఓటమి చవిచూసినా ఈ సినిమాద్వారా దర్శకుడికి ఉత్తమ నూతన దర్శకుడిగా నంది పురస్కారం లభించింది.
నటీనటులు
[మార్చు]- ప్రశాంత్ - శ్రీనివాస్
- సంయుక్త సింగ్ - సంగీత
- రఘువరన్ - అవినాష్
- అలీ
- బ్రహ్మాజీ -బ్రహ్మాజీ
- బ్రహ్మానందం
- కిట్టీ - సర్కిల్ ఇన్స్పెక్టర్
- చిన్నా -బాబ్జీ
- జె.డి.చక్రవర్తి - రమణ
- నర్రా వెంకటేశ్వరరావు - హెడ్ కానిస్టేబిల్
- సాయి కుమార్ - పృథ్వీ
- వినోద్ బాల - భాస్కర్
- అంబిక - ఆశ
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: గుణశేఖర్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి
- ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్
- కళ: చంటి
- నృత్యాలు: సుందరం, సుచిత్ర, దిలీప్
- కూర్పు: ఎ.శ్రీకర్ ప్రసాద్
- నిర్మాత: మేడికొండ రామచంద్రరావు
సంక్షిప్తకథ
[మార్చు]శ్రీను(శ్రీనివాస్)కు చిన్నతనం నుండే పోలీస్ కావాలని ఆశ. ఎట్టకేలకు అతడు పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో చేరతాడు. ట్రైనింగ్ తర్వాత కానిస్టేబుల్‌గా డాన్ దావూద్ ఉన్న ప్రాంతానికి పోస్ట్ చేయబడతాడు. డాన్ దావూద్‌పై ఎలా విజయం సాధించింది మిగిలిన చిత్రకథ. ఈ లోగా అతడు సంగీతతో ప్రేమలో పడతాడు.
పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయనీగాయకులు |
---|---|---|
1 | "గొప్ప కథే" | ఎం.ఎం.కీరవాణి |
2 | "ఇక్కడున్నావా" | చిత్ర |
3 | "మధుర పరాగం" | ఎం.ఎం.కీరవాణి |
5 | "పరుగులు పెట్టే" | ఎం.ఎం.కీరవాణి |
6 | "పరుగులు పెట్టే" | చిత్ర |
7 | "ఉలికిపడ్డ గుండెలోన" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Watch Lathi (1992) Free Online". ovguide. Archived from the original on 2015-11-22. Retrieved 2015-11-21.