Jump to content

వన భోజనాలు

వికీపీడియా నుండి
(వనభోజనము నుండి దారిమార్పు చెందింది)
వన భోజనాలు

కార్తీకమాసములో బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో (ప్రత్యేకించి ఉసిరి చెట్టు నీడన) కలసి భోజనం చేయటాన్ని వన భోజనం అంటారు. ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. జపానులో కూడా హనామి (హన - పువ్వు, మిమస్ - చూడటం) పేరుతో మార్చి చివరి వారంలో బంధువులు స్నేహితులతో కలసి ఇదే విధమైన వేడుక చేసుకుంటారు. ఇది జపానులో విశేషమైన ఆదరణ పొందిన వేడుకలలో ఇది ఒకటి.

అవలోకనం

[మార్చు]

కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. బంధు,మిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భాలు గా సమాజంలో మనము చూస్తున్నాము. ఆధ్యాత్మిక విషయానికి వస్తే కార్తీక పురాణంలో వనభోజనాల ప్రసక్తి ఉంటుంది. ప్రజలు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉన్న వనంలో, విష్ణుమూర్తి ని అర్చించి వనభోజనం చేసినవారి సకల పాపాలూ తొలగిపోతాయన్నది పురాణంలోని మాట.

విగ్రహారాధన ఏర్పడక ముందు, మన పూర్వీకులు ప్రకృతినే పూజించేవారు. వారి దృష్టిలో తమకు ఆహారాన్నీ, నీడనూ, నారబట్టలనూ అందించే వృక్షాలు గొప్ప దేవతలు. అందుకే వృక్షాలను కూడా దేవతార్చనలో భాగం చేశారు ఇందులో ప్రజలు చేసే పూజలలో ఫలం, పుష్పం, పత్రం లేకుండా సంపూర్ణం కావు. వినాయక చవితి, క్షీరాబ్ది ద్వాదశి వంటి పూజలలో వృక్షాల ప్రాముఖ్యత మనము గమనించ వచ్చును. వృక్షాలలో ప్రధానమైన ఉసిరికి కార్తీక మాసంలో వీలైనంత ప్రాధాన్యత గమనిస్తే ఉసిరి చెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తిగా భావిస్తారు. ఈ మాసం లో శివ,కేశవులను ఆరాధిస్తారు. కుటుంబాలతో వినోదం, ఆధ్యాత్మికంగా, పిల్లల ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు[1]

ప్రయోజనం

[మార్చు]

వన భోజనాల్లో ప్రజలకు కలిగే లాభాలను గమనిస్తే ఉసిరి చెట్టు నీడన భోజనం చేయడంలో మనుషుల ఆరోగ్య కరముగా ఉండటం గమనిస్తాము. ఉసిరి చెట్టు నుండి వీచే గాలి కారణంగా శరీరం లో ఉన్న అనేక రుగ్మతలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మన ఆహారంలో ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన ఆరోగ్యవంతులుగా తయారవుతాము. ఉసిరికాయ తినడం ద్వారా మన శరీరం మరింత కాంతివంతంగా తయారవుతుంది. వానా కాలం తర్వాత వచ్చే శీతాకాలంలో వచ్చే కార్తీక మాసంలో వచ్చే శ్వాసకోస వ్యాధులు, జ్వరాలు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి. వనభోజనం కారణంగా వివిధ రకాల ఆయుర్వేద మొక్కలు, వృక్షాల నుండి వచ్చే గాలి అందరికి దివ్య ఔషధంగా పనిచేస్తోంది. వన భోజనాలు చేయడంవలన మన ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. పర్యావరణ పరిరక్షణ అనే భావన ఈ వనభోజనాలలో అంతర్లీనంగా ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుందనే సందేశం ఈ వనభోజనాలలో దాగి ఉంది. వన భోజనాలు వంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన నాయకత్వ లక్షణాలు రావడం, బాధ్యతలు ఏర్పడటం, బంధు మిత్రుల మధ్య సాన్నిహిత్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుంది అని పేర్కొంటున్నారు. ప్రజలు వనభోజనాలలో వెళ్లే ముందు అవసరమైన జాగ్రత్తలు పాటించవలెను[2].

ప్రస్తుతం

[మార్చు]

హిందూ సంప్రదాయాల ప్రకారం, చెట్లు / మొక్కలు భూమి లో కీలక పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే అవి మానవులతో సహా సమస్త జీవరాశులకు అనేక విధాలుగా ఉపయోగ పడుతున్నాయి. మన పూర్వీకులు ప్రకృతిని భగవంతుడిగా భావించి ఎల్లప్పుడూ గౌరవం చూసే వారు 'వృక్షో రక్షతి రక్షితః' (చెట్లను కాపాడేవాడే రక్షింపబడతాడు) భావంలో ఉండే వారు. ప్రస్తుత తరంలో, ఈ పవిత్రమైన పండుగ సంప్రదాయం సమాజంలోని కొన్ని వర్గాలు దీనిని సెలవు దినముగా భావిస్తూ, ఇతర కార్య కలాపాలను చేస్తున్నారు. కొన్ని సంస్థలు కుటుంబాలు, కార్యాలయ సిబ్బంది, స్నేహితులను ఈ సంప్రదాయంలో భాగం చేస్తారు. అయితే ప్రస్తుతం 'వారాంతపు విహారయాత్ర' లాగా కనిపిస్తుంది. కార్తీక మాసం నిజమైన అర్థాన్ని, వన భోజన ప్రాముఖ్యత గమనించి, ఈ వన భోజనాల సాంప్రదాయాన్ని గౌరవించి, రక్షించి, అందరూ ఆనందంగా ఉండాలి[3].



-

మూలాలు

[మార్చు]
  1. "మన భోజనం- వన భోజనం". TeluguOne Devotional. Retrieved 2023-12-22.
  2. Telugu, 10TV; chvmurthy (2019-11-03). "వన భోజనాలు.. విశిష్టత". 10TV Telugu (in Telugu). Retrieved 2023-12-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "Significance of 'Kartika Masa Vana Bhojanam' - Telugu Bullet". telugubullet.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-10-30. Retrieved 2023-12-22.