వాడుకరి:Pavan (CIS-A2K)/నా పని/2018-19
స్వరూపం
2018-2019లో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై నిర్వహించిన కార్యక్రమాలు, కార్యకలాపాలు విడివిడిగా దేనికదే అన్న తరహాలో కాకుండా ఒకదానికొకటి అల్లికలా, ఒక్కో కార్యక్రమం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టేట్టు, ఒకదానిలో జరిగిన తప్పు మరోదానిలో దిద్దుకుంటూ మెరుగుపరిచేట్టు చేయడం జరిగింది. కాబట్టి వాటిని నాలుగు ప్రధానమైన అంశాలుగా విడదీసి దానిలో లంకెలు అందిస్తూ చేయడం జరిగింది. కింద తెలుగు బయట ఉద్యోగిగా అన్న విభాగం, పూర్తి స్వచ్ఛంద కార్యకలాపాలు అన్న విభాగం చేస్తున్న కార్యకలాపాల్లో ఏవేవి ఏ2కెకి చెందినవన్న విషయంలో మరోసారి స్పష్టత ఇవ్వడం కోసం రాస్తున్నది. పూర్తి స్వచ్ఛంద కార్యకలాపాలను సంస్థాగతంగా నివేదించడం జరగదు, జరగలేదు.
తెలుగులో కార్యకలాపాలు
[మార్చు]సమాచార విస్తరణ
[మార్చు]- వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం ప్రాజెక్టులో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల పరంగా తొలి దశ పూర్తైంది. ఏ2కె సహకారం, శిక్షణల ద్వారా తెలుగు వికీపీడియాలో చురుకుగా కార్యకలాపాలు ప్రారంభించిన వాడుకరి:యర్రా రామారావు దీనిలో కీలకమైన పాత్ర వహించారు. నాణ్యతాభివృద్ధి కోసం ఏ2కె నిర్వహించిన నాణ్యతాభివృద్ధి కార్యశాల, ఆన్‌లైన్ శిక్షణా తరగతులు, వ్యక్తిగత శిక్షణ వంటివాటిలో పాల్గొన్న రామారావు ఏ2కె సహకారంతో తోటి వాడుకరి:Ajaybanbiకి వ్యక్తిగత శిక్షణ అందించారు. తద్వారా వాడుకరి:Ajaybanbiతో కలిసి తెలంగాణ గ్రామాల పేజీ నుంచి మండలాల వ్యాసాలు విడదీసి, ఇతర సంబంధిత మార్పుచేర్పులు చేసే రెండవ దశ ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేశారు.
- అమ్మనుడి పత్రిక గతంలో ఏ2కె పూర్వ ఉద్యోగులు రహ్మానుద్దీన్ షేక్, తన్వీర్ హాసన్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేసేలా ఒప్పించారు. ఐతే, కాపీహక్కుల పరంగా పాత సంచికలు వేర్వేరు రచయితల హక్కుల్లో ఉంటాయనే సాంకేతిక సమస్య వల్ల దాని స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారంగా ఆర్కైవుల సంగతి ప్రస్తుతానికి పక్కనపెట్టి, నడుస్తున్న పత్రిక విషయంలో ఆ పత్రికలోనే స్వేచ్ఛా లైసెన్సులో పత్రిక వెలువడుతోందన్న నోటీసుతో పత్రిక విడుదల చేయించడంతో ఆ పత్రికల పునర్విడుదల పనులు జరిగాయి. తెలుగు వికీసోర్సులో కొన్ని పూర్తైన పుస్తకాల లైసెన్సుల సమస్యలు పరిష్కరించేందుకు ఆయా పుస్తకాలను స్వేచ్చా లైసెన్సుల్లోకి విడుదల చేయించడానికి ప్రయత్నించాం, ఫలించలేదు.
నాయకత్వం వృద్ధి
[మార్చు]- వికీపీడియా:డిజిటల్ మాధ్యమాల్లో తెలంగాణ సాహిత్యం, కళలు, సంస్కృతి, పండుగలు - సదస్సు సహ నిర్వహణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తెలుగు వికీపీడియా కార్యకలాపాలకు అందిస్తున్న సహకారానికి కొనసాగింపుగా భాషా సాంస్కృతిక శాఖ, డిజిటెల్ తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో సీఐఎస్-ఎ2కె సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వాడుకరి:Pranayraj1985 వ్యవహరించారు. కార్యక్రమంలో ఎ2కె వ్యక్తిగత శిక్షణతో వికీమీడియా కామన్సులో కృషిచేసిన వాడుకరి:Adbh266, ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమానికి హాజరైన వాడుకరి:Ajaybanbi నిర్వహణలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వపరమైన సహకారం, కార్యక్రమాల నిర్వహణ భవిష్యత్తులో కార్యకలాపాలను స్థిరీకరించడానికి ఉపకరించేందుకు అవకాశం ఉంది.
నాణ్యతాభివృద్ధి
[మార్చు]- వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతుల ద్వారా ఆసక్తి గల వికీపీడియన్లకు ఆన్‌లైన్ క్లాసుల్లో మౌలికాంశాల నుంచి శైలి, నమ్మదగ్గ మూలాలు వంటి పలు అంశాల వరకు శిక్షణనిచ్చాము. గతంలో నిర్వహించిన వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాలకు స్పందన తక్కువగా రావడంతో భౌతిక కార్యశాల నుంచి ఆన్లైన్లోకి, తగినంత ఫాలో-అప్ కి, టాస్కులను ప్రణాళికలో చేర్చి ఈ నాణ్యతాభివృద్ధి కార్యశాలలు నిర్వహించాము. వికీపీడియా:మంచి వ్యాసం ప్రమాణాలు, వికీపీడియా:మెరుగైన వ్యాసాలు, వికీపీడియా:శైలి వంటివాటిపై అవగాహన ఏర్పడడం, వాటిపై పనిచేయగలగడం దీని లక్ష్యాల్లో ఒకటి.
కొత్తవారి నిలుపుదల
[మార్చు]- వ్యక్తిగత కార్యశాలలు: తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో రాయడంపై ఆసక్తి, అసలంటూ తెలుగులో రాయడం, డిజిటల్ గా రచనలు చేయడం వంటివాటిపై కొంత అవగాహన ఉన్నవారిని తీసుకుని వ్యక్తిగత కార్యశాలల ద్వారా, వారికి అవసరమైన వనరుల మద్దతును అందించడం ద్వారా నిలపడం జరిగింది. వికీసోర్సులో గతంలో ఏ2కె ప్రయత్నం ద్వారా తెలుగు వికీసోర్సులో ప్రారంభించి కొనసాగుతున్న వాడుకరి:Ramesam54 భారతీయ వికీసోర్సు సమావేశానికి హాజరైన పిదప సముదాయ విస్తరణకు మరికొందరిని తీసుకువచ్చే క్రమంలో ఏ2కె సహకారం తీసుకుంటున్నారు.
- వనరుల రూపకల్పన: గత రెండు సంవత్సరాలుగా వాడుకరి:Ramesam54, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:Gsvsmurthy, వాడుకరి:Yasshu28, వాడుకరి:USHA RANI AKELLA, వాడుకరి:Raamanamma kalidassu, తదితరులను తెలుగు వికీపీడియాలో కొత్తవారిగా శిక్షణనిచ్చి నిలిపే క్రమంలో సంపాదించిన అనుభవం ప్రకారం తెలుగు వికీపీడియా, వికీసోర్సుల్లోని అంశాలపై విస్తారమైన ట్యుటోరియల్ వనరులు అందుబాటులోకి తీసుకువస్తే తప్ప సముదాయ విస్తరణ సాగదని పాఠం నేర్చుకున్నాం. దీని ఆధారంగా వాడుకరి:Chaduvari సహకారంతో తెలుగు వికీపీడియాకు అవసరమైన అంశాలను జాబితా వేస్తూ, దానిని మొదటి, ద్వితీయ, మూడవ స్థాయి అంశాలుగా విభజించి, వాటికి ట్యుటోరియల్స్ రాయడం జరుగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు వికీసోర్సులో అవసరాన్ని అనుసరించి తెలుగు వికీసోర్స్ కాపీహక్కుల మార్గదర్శిని రూపొందించడం జరిగింది. ఈ ప్రయత్నం ముందుకుపోతుంది.
తెలుగు బయట ఎ2కె ఉద్యోగిగా
[మార్చు]- 2018 డిసెంబరులో దక్షిణ భారతదేశ స్థాయి కాపీహక్కుల కార్యశాల నిర్వహణకు సహకారం.
- 2019 మార్చిలో వికీమీడియా సమ్మిట్ ఇండియా 2019 సహ నిర్వహణ.
- మార్చిలో వికీమీడియా సమ్మిట్లో సీఐఎస్-ఎ2కె ప్రాతినిధ్యం.
- జూన్ తొలివారంలో ట్రైన్-ద-ట్రైనర్ 2019 కార్యక్రమ నిర్వహణకు సహకారం.
పూర్తి స్వచ్ఛంద కార్యకలాపాలు
[మార్చు]- 2019 జనవరి నెలలో ద వికీపీడియా లైబ్రరీ కాన్ఫరెన్స్ ఇండియాలో పవన్ సంతోష్ వ్యక్తిగత స్థాయిలో పాల్గొన్నాడు. కార్యక్రమానికి ముందుగా సాటిలైట్ ఈవెంట్స్ నిర్వహిస్తే బావుంటుందని తాను చేసిన సూచన ఆమోదం పొందగా, హైదరాబాదులో ఒక శాటిలైట్ ఈవెంట్ నిర్వహించాడు.
- 2018 నవంబరు చివరిలో వికీసైట్ 2018 కార్యక్రమానికి ఎంపికై పాల్గొన్నాడు.
- 2018 అక్టోబరు నుంచి వికీమీడియా స్ట్రాటజీ 2018-2020లో భాగంగా ఏర్పరిచిన కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సభ్యునిగా, సమన్వయకర్తగా పనిచేస్తున్నాడు. దీనికి ఎంపికైన సందర్భంలో సీఐఎస్ తో అతని అనుబంధం పరిగణనలోకి వచ్చినా, దీనిలో చేస్తున్న పని ఇప్పటిదాకా (2019 జూన్) స్వచ్చందంగానే చేస్తున్నాడు.