Jump to content

వాడుకరి చర్చ:Azifast Andhra

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Azifast Andhra గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Azifast Andhra గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో మీకు సహాయమేమైనా అవసరమైతే, సంకోచించకుండా నా చర్చ పేజీలో అడగండి (నాకూ ఒక చర్చ పేజీ ఉంది మరి). నాకు వీలైనంతలో సాయం చేస్తాను.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఏ విషయంలో సాయం అవసరమైనా సరే... నా చర్చా పేజీలో రాయండి. సంతకంలో నా చర్చ పేజీ లింకు ఉంది, చూడండి.   Nrgullapalli (చర్చ) 13:39, 27 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అమరావతి ఆంధ్రప్రదేశ్ పేజీల్లో మీ దిద్దుబాట్లు

[మార్చు]

అమరావతి, ఆంధ్రప్రదేశ్ పేజీల్లో రాజధానుల గురించి చేసిన దిద్దుబాట్లే పదేపదే చేస్తూ, తిరిగి మారుస్తూ, మళ్ళీ చేస్తూ, తిరిగి మారుస్తూ.. ఉన్నారు. రాజధానుల పట్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొంత తికమక ఉన్నమాట నిజమేనేమో గానీ, మరీ అంత అయోమయం లేదని అనుకుంటున్నాను. కాబట్టి ఏదో ఒక రాజధానిని (లేదో ఏదో ఒక మూడింటికి) స్థిరపరచుకుని, ఇకపై దిద్దుబాట్లు ఆపమని కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 16:02, 19 ఏప్రిల్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

పై పేజీల్లో మీరు చేస్తున్న మార్పులు అనుచితంగా ఉన్నాయి. వికీపీడియాకు చిన్నమెత్తు ఉపయోగం లేదు వాటి వల్ల. ఈ పేజీల్లోను, సంబంధిత పేజీల్లోనూ మార్పుచేర్పులు చెయ్యకుండా మిమ్మల్ని నిరోధించాను. ఇలాంటి మార్పులు మరే పేజీలో చేసినా, చర్య తీవ్రత పెరుగుతుందని గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 01:25, 4 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు

[మార్చు]

@Azifast Andhra: నమస్కారాలు,

త్వరలో జరగబోయే పరిశోధనా కార్యక్రమం లో పాల్గొని, మీ కోసం మరియు వికీపీడియా యొక్క మెరుగుదల కోసం సహాయపడగలరు. ఈ అవకాశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొనుటకు కొన్ని ప్రశ్నల కు సమాధానములు ఇవ్వవలెను, మేము అర్హులను సంప్రదించి వారికి తగిన సమయానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము.

ఆసక్తిగల ఇతర సంఘ సభ్యులు మీకు తెలిసిన యెడల, వారికీ ఈ సమాచారాన్ని అందించగలరు.

కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు, BGerdemann (WMF) (చర్చ) 20:22, 8 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ సర్వే వేరొక సంస్థ (థర్డ్ పార్టీ ) ద్వారా జరపబడుచున్నది, కావున వాటికీ అదనపు నిబంధనలు వర్తిస్తాయి. గోప్యత మరియు సమాచార నిర్వహణ గురించి మరిన్ని వివరాల కోసం సర్వే గోప్యతా ప్రకటన చూడవలెను.

మూసల్లో చేసే మార్పుచేర్పులు

[మార్చు]

మూస పేరుబరిలో ఉండే పేజీలను సాధారణంగా ఇతర పేజీల్లో ఉపయోగిస్తూంటాం (ట్రాన్స్‌క్లూడు చేస్తూంటాం). కొన్ని మూసలు వందల వేల పేజీల్లో చేరుతూంటాయ్. మూసలో మనం చేసే మార్పు చేర్పులు ఆయా పేజీలన్నిటిలో ప్రతిఫలిస్తాయ్. కాబట్టి మూసల్లో మార్పులు చేసేటపుడు ఒకింత జాగ్రత్తగా ఉండాలి.

గతంలో {{Edit fully-protected}} మూసలో మీరు చేసిన మార్పులు అలాంటివే. బహుశా తెలియక చేసి ఉంటారని భావిస్తున్నాను. అందుకే ఆ తరువాత ఆ మూస పేజీని బ్లాంకు చేసారు. అయితే బ్లాంకు చెయ్యరాదు. ప్రస్తుతం నేను దాన్ని సరిచేసాను. ఇకపై మూసల్లో మార్పులు చేసేటపుడు మరింత జాగ్రత్త వహించండి. __చదువరి (చర్చరచనలు) 08:02, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం గురించి వ్యాసాల్లో మార్పులు

[మార్చు]

User:Azifast Andhra గారు, విశాఖపట్నం వ్యాసంలో గతంలో రాజధాని విషయమై మీ మార్పులు రద్దు చేయటం జరిగింది. మరల అదే తరహాలో ఈ వ్యాసం, ఇతర వ్యాసాలలో మార్పులు చేస్తున్నారు. రాజధాని విషయం గురించి న్యాయస్థానంలో తీర్పు వెలువడేంతవరకు అటువంటి మార్పులు చేయవద్దు. అమరావతి వ్యాసంలో వున్నట్లు, కొత్త విభాగం చేర్చి పూర్తి విషయాన్ని అనగా ప్రభుత్వ ఆదేశం, న్యాయవిచారణ విషయాల గురించి మూలాలతో సహా రాయండి. ఈ సలహా పట్టించుకోకుండా మీరు గతంలో చేసినట్లుగా మరల మార్పులు చేస్తే మీ చర్యలను దుశ్చర్యలుగా పరిగణించి మీ ఖాతాపై నిషేధాలు విధించే అవకాశం వుంటుంది. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 22:24, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీపై నిరోధం

[మార్చు]

కృష్ణా జిల్లా, గుంటూరు, గుంటూరు జిల్లా పేజీల్లో మీరు చేసిన మార్పులు అనుచితంగా ఉన్నాయి. ఆ పేజీల్లోని సమాచారపెట్టెల్లో మీరు తప్పు సమాచారాన్ని చేర్చారు. అందుగ్గాను మూడునెలల పాటు మిమ్మల్ని నిరోధించాను. మీరు పదేపదే చేస్తున్న తప్పు దిద్దుబాట్ల కారణంగాను, గతంలో వివిధ వాడుకరులు మీకు చేసిన హెచ్చరికలను దృష్ట్యానూ, గతంలో మీపై విధించిన నిరోధాల దృష్ట్యానూ మీపై మరింత తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం ఉంది. ఈ నిరోధం తరువాత మీ పద్ధతి మార్చుకుంటారనే ఆశతో ప్రస్తుతానికి అలా చెయ్యలేదు. గమనించగలరు. __చదువరి (చర్చరచనలు) 10:19, 23 నవంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీపై శాశ్వత నిరోధం అవకాశం

[మార్చు]

వాడుకరి:Azifast Andhra గారు, వికీపీడియాపై అవగాహన పెంచుకోకుండా, మీరు చేస్తున్న విధ్వంసక మార్పులను రద్దు చేశాము. ఒక వారంపాటు మీపై నిరోధం విధించాము. ఇప్పటికి నలుగురు నిర్వాహకులు మీపై వివిధ కాలాలపాటు నిరోధం విధించనట్లు గమనించాము. మీరు ఇదేతీరులో విధ్వంసక మార్పులు మరల మొదలెడితే మీపై శాశ్వత నిరోధం విధించటం తప్ప వికీపీడియా నిర్వాహకులకు ఇతర కార్యాచరణలు లేవని గమనించండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:40, 24 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ హెచ్చరిక తర్వాత మీరు రెండు సార్లు మరల దుశ్చర్యలు చేశారు. కావున మీ ఖాతాపై శాశ్వత నిరోధం విధించబడింది. --అర్జున (చర్చ) 22:23, 24 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]